• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • ON THIS WORLD EARTH DAY 2021 LETS TAKE A PAUSE TO READ A FEW QUOTES WHICH TALK ABOUT THE IMPORTANCE OF THIS PLANET GH SRD

World Earth Day 2021 : నేడు వ‌ర‌ల్డ్ ఎర్త్ డే...ఈ రోజు గురించి మ‌హ‌నీయులు ఏం చెప్పారంటే...

World Earth Day 2021 : నేడు వ‌ర‌ల్డ్ ఎర్త్ డే...ఈ రోజు గురించి మ‌హ‌నీయులు ఏం చెప్పారంటే...

World Earth Day 2021 : నేడు వ‌ర‌ల్డ్ ఎర్త్ డే...ఈ రోజు గురించి మ‌హ‌నీయులు ఏం చెప్పారంటే...

World Earth Day 2021 : 1970లో మొద‌లైన ఆధునిక ప‌ర్యావ‌ర‌ణ విప్ల‌వం పుట్టుక‌ను పుర‌స్క‌రించుకొని ఏప్రిల్ 22న వ‌ర‌ల్డ్ ఎర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంటారు. మ‌న ప‌ర్యావ‌ర‌ణాన్ని సంర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ రోజు మ‌న‌కు గుర్తుచేస్తుంది. దీని వ‌ల్ల మ‌న భ‌విష్య‌త్‌ త‌రాల కోసం ఈ భూమి అనుకూలంగా ఉండేట‌ట్లు త‌యారుచేసే అవ‌కాశం మ‌న‌కు క‌లుగుతుంది.

  • Share this:
ఈ రోజు ప్ర‌పంచ ధ‌రిత్రి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం గురించి గొప్ప‌వారు చెప్పిన మాట‌ల‌ను మ‌నం గుర్తుపెట్టుకోవాలి. విశ్వంలో మ‌న‌కు తెలిసిన అన్ని గ్ర‌హాల్లోకీ ఒక్క భూగ్ర‌హం మాత్ర‌మే ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటుంద‌నే మాటలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. ఈ నీలి గ్ర‌హంపై ప‌రుచుకున్న ప‌చ్చ‌ని వృక్షాలు‌, కొండ కోన‌లు, నీరు వంటి ప్ర‌కృతి సంప‌దంతా క‌లిసి ఇక్క‌డ మ‌నుషుల‌తో పాటు ఇత‌ర జీవ‌రాశులు బ‌త‌క‌డానికి స‌హ‌క‌రిస్తున్నాయి. అయితే మ‌నిషి బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల పెరిగిపోతున్న కాలుష్యంతో భూమి మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం క‌లిగే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందుకే పెరిగిపోతున్న కాలుష్యంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, భూమిపై ఉన్న అద్భుత‌మైన వాతావ‌ర‌ణాన్ని స్మ‌రించుకోవ‌డానికి ఈ వ‌ర‌ల్డ్ ఎర్త్ డే ఒక సంద‌ర్భం. 1970లో మొద‌లైన ఆధునిక ప‌ర్యావ‌ర‌ణ విప్ల‌వం పుట్టుక‌ను పుర‌స్క‌రించుకొని ఏప్రిల్ 22న వ‌ర‌ల్డ్ ఎర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంటారు. మ‌న ప‌ర్యావ‌ర‌ణాన్ని సంర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ రోజు మ‌న‌కు గుర్తుచేస్తుంది. దీని వ‌ల్ల మ‌న భ‌విష్య‌త్‌ త‌రాల కోసం ఈ భూమి అనుకూలంగా ఉండేట‌ట్లు త‌యారుచేసే అవ‌కాశం మ‌న‌కు క‌లుగుతుంది. ఈ ఏడాది మ‌నం జ‌రుపుకుంటున్న 51వ ఎర్త్‌ డేకు `రీస్టోర్ అవ‌ర్ ఎర్త్‌` అనే థీమ్‌ను నిర్ణయించారు. అంటే మ‌న భూమిని పున‌రుద్ధ‌రించాల‌నే శ‌ప‌థం చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఇది మ‌న‌కు తెలియ‌జేస్తుంది.

భూగ్ర‌హానికి, దీనిపై ప‌రుచుకున్న ప్ర‌కృతికి ఉన్న‌ ప్ర‌త్యేక‌త‌ను తెలుసుకోవ‌డం కోసం ప్ర‌పంచ ధ‌రిత్రి దినోత్స‌వం రోజు కొంద‌రు గొప్ప‌వారు చెప్పిన మాట‌ల‌ను మ‌నం ఇక్క‌డ గుర్తు చేసుకుందాం.

1. మ‌హాత్మా గాంధీ- `భూమి మ‌నిషికి కావాల్సిన‌ అన్ని అవ‌స‌రాల‌ను తీరుస్తుంది కానీ దురాశ‌ను కాదు`
2. రేచ‌ల్ కార్స‌న్- మ‌న గురించి విశ్వంలో ఉన్న అద్భుతాల‌ను, నిజాల‌ను స్ప‌ష్టంగా తెలుసుకోవ‌డంపై ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ, దీన్ని కూల్చేయ‌డంపైన ఎక్కువ ఆశ‌క్తి ఉండ‌కూడ‌దు.
3. అల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్- ప్ర‌కృతిని నిశితంగా గ‌మ‌నించు, ప్ర‌తి విష‌యంపై నీకు మంచి అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.
4. వాల్ట్ విట్‌మ్యాన్- ఉత్త‌మ వ్య‌క్తిని త‌యారుచేసే ర‌హ‌స్యం నాకు అర్థ‌మ‌య్యింది. అది బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పెర‌గ‌డం, ‌భూమితో పాటే తిన‌డం, నిద్రించ‌డం.
5. రాల్ఫ్ ఓల్డా ఎమ‌ర్స‌న్- ప్ర‌కృతి ఎప్పుడూ ఆత్మీయ‌ రంగుల‌నే ధ‌రిస్తుంది.
6. బెంజిమిన్ ఫ్రాంక్లీన్- బావి ఎండిపోయిన‌ప్పుడే మ‌న‌కు నీటి విలువ తెలుస్తుంది.
7. విలియం షేక్‌స్పియ‌ర్- వినేవారి కోసం భూమి సంగీతాన్ని ప‌లికిస్తుంది.
8. అమెరిక‌న్ ఆదివాసుల సామెతః మ‌న పిత‌రుల నుంచి మ‌న‌కు భూమి వార‌స‌త్వంగా రాలేదు. మ‌న పిల్ల‌ల నుంచి మ‌నం దాన్ని కొనుక్కున్నాము.
9. జూల్స్ రినార్డ్- భూమిపైన స్వ‌ర్గం లేదు. కానీ స్వ‌ర్గ‌పు ముక్క‌లున్నాయి.
10. మెహ్మెత్ ముర‌త్ ఇల్డాన్- మ‌నం భూమిని ఎంత ఎక్కువ కాలుష్యం చేస్తే, అంత త‌క్కువ‌గా ఈ భూమిపైన నివ‌శించే అర్హ‌తను కొల్పోతాము.
11. మ‌థ‌ర్ థెరిస్సా- చెత్త క‌నిపించిన‌ప్ప‌డు, మ‌నం వాడుకోద‌గిన వ‌స్తువుల‌ను దూరంగా పారేసే మ‌నుషుల‌ను చూసిన‌ప్పుడు మాత్ర‌మే నాకు కోపం వ‌స్తుంది.
12. పెర్సి బేష్షి షెల్లీ- దూరం... దూరం... పురుషుడికీ, ప‌ట్ట‌ణానికి... లోయ‌ల‌కు, అటవీ వృక్షాల‌కు... మౌనంగా ఉండే అడ‌వికి, అపుడు ఆత్మ దాని సంగీతాన్ని అణిచివేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
13. థామ‌స్ ఫుల్ల‌ర్- చెట్ల‌ను నాట‌డం త‌న‌తో పాటు త‌న స‌హ‌చ‌రుల్ని ప్రేమించ‌డ‌మే!
14. లియో టాల్‌స్టాయ్- సంతోషంగా ఉండ‌టానికి మొట్ట‌మొద‌టి నియమం ఏంటంటే, ప్ర‌కృతికీ, మ‌నిషికీ ఉన్న బంధం ఎప్ప‌టికీ తెగిపోకుండా ఉండ‌ట‌మే!
15. జార్జ్ వాషింగ్ట‌న్ కార్వ‌ర్- సూర్యోద‌యానికి ముందు చెట్లు ఎంత ముద్దుగా క‌నిపిస్తాయో అంత‌కుమించిన అందం మ‌రొక‌టి ఉండ‌దు.
16. జేన్ గుడాల్- నీ చుట్టూ ఉన్న ప్ర‌పంచపై ప్ర‌భావం లేకుండా నువ్వు ఒక్క‌రోజు కూడా దాట‌లేవు. నువ్వు చేసేదాన్ని బ‌ట్టే మార్పు క‌నిపిస్తుంది. నువ్వు ఎలాంటి మార్పును తేవాల‌నుకుంటున్నావో నువ్వే నిర్ణ‌యించుకో...
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు