హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Fathers Day 2020 | పింకీ రెడ్డి.. తండ్రికి తగ్గ తనయ.. సేవా కార్యక్రమాల్లో భళా

Fathers Day 2020 | పింకీ రెడ్డి.. తండ్రికి తగ్గ తనయ.. సేవా కార్యక్రమాల్లో భళా

తండ్రి సుబ్బిరామిరెడ్డితో పింకీ రెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

తండ్రి సుబ్బిరామిరెడ్డితో పింకీ రెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

Fathers Day 2020 | ‘నేను ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా మా నాన్నతోనే పంచుకుంటాను.’ అని సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి తెలిపారు.

  పింకీ రెడ్డి.. బిజినెస్ సర్కిల్ లో ఈమె పేరు తెలియనివారుండరు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీవీకే గ్రూప్ డైరెక్టర్. మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి గారాలపట్టి. అటు వ్యాపారంలోనూ... సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తు ముందుకు సాగుతున్న పింకీరెడ్డి అలియాస్ అపర్ణ రెడ్డి. పింకీ రెడ్డి ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలిగా పని చేశారు. అపర్ణా ఫౌడేషన్ పేరుతో సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ రంగాల కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ సౌత్ ఇండియా సెలబ్రిటీగా వెలుగొందుతున్న పింకీ రెడ్డి తన తండ్రి గురించి న్యూస్‌18తో పంచుకున్న అనుభవాలు. ఆమె మాటల్లోనే...

  తండ్రి సుబ్బిరామిరెడ్డి, కిరణ్ మజుందార్ షా‌తో పింకీ రెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

  నేను మా నాన్నకు కార్బన్ కాపీ. ఆయన చాలా విశాల హృదయం కలిగిన వ్యక్తి... నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనలాగే నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తాను. నేను పట్టినప్పటి నుంచి మాది సంపన్న కుటుంబమే. మా అమ్మ నాకు క్రమశిక్షణ నూరి పోసేది. మా నాన్న వేరు. ఆయనలో చాలా సేవాగుణం ఉంటుంది. చదువు నేర్చుకోవడం ఒకెత్తయితే... తల్లిదండ్రులను చూసి నేర్చుకోవడం చాలా ఉంటుంది. నాలాగే నా పిల్లలు కూడా సేవాభావం కలిగిన వారే.

  లాయర్ పత్రిక నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న పింకీ రెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

  మా నాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయాల్లో రాణిస్తూనే వ్యాపారం కూడా చేశారు. నాకు రాజకీయాలంటే కోరికే లేదు. రాజకీయాల్లో లేకున్నా నేను చేయగలిగింది చేస్తున్నాను. ప్రజలు నిన్ను గుర్తించేలా ఏదైనా చేయాలని చెప్పేవారు. తల్లిదండ్రుల్ని చూసి రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పే వాళ్లను చూస్తే నాకు నవ్వొస్తుంది. చిన్న నాటి నుంచి చూస్తున్నాను. మా ఇంటికి ఎంత మంది వచ్చే వాళ్లో. పొద్దున లేస్తే జనమే జనం.. దాదాపుగా ప్రతీ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖ వ్యక్తులు మా ఇంటికి వచ్చే వారు. నాకు దానిపై పెద్ద క్రేజ్ లేదు. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమెతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది.

  శ్రీదేవితో పింకీరెడ్డికి ప్రత్యేక అనుబంధం (Image;pinkyreddyofficial/Instagram)

  మా నాన్న లేగే నాకు దైవ భక్తి ఎక్కువే. కానీ ఆయన లాగా చేయలేదు. గంటల తరబడి ధ్యానం చేస్తారు. పూజలు చేస్తారు. నేనలా చేయలేను. ఆయనంత ఏకాగ్రత నాకు లేదనిపిస్తుంది. మా అత్తవారింటి వారు కూడా మొదటి నుంచి సంపన్నులే. మా కుటుంబ వ్యాపారమైన జీవీకే గ్రూపులో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా నాన్న నుంచి చాలా మెళకవలు నేర్చుకున్నాను. ఆయన లాగా కష్టపడే స్వభావం నాకు అలవడింది.

  సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పింకీ రెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

  సాధారణంగా అమ్మదగ్గర గారాభంగా... నాన్న దగ్గర హుందాగా ఉంటారు. కానీ నా విషయంలో ఇది రివర్స్... మా అమ్మ చాలా స్ట్రిక్ట్.... నాన్న మాత్రం సరదాగా ఉంటారు. బయటి నుంచి రాగానే ముద్దులిచ్చి ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే వారు. రోజువారి కార్యక్రమాల్లో మా నాన్న ఇన్వాల్వ్ కారు. ఆయన నుంచే నేర్చుకున్నదే నేను అమలు చేస్తున్నాను. నిన్ను చూసి పక్కన వారు పొగడాలి... అలా పని చేయాలి అని చెప్పేవారు. నువ్వు సంపాదించే ప్రతీ రూపాయిలో పది పైసలు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని చెప్పేవారు. మా నాన్న ప్రభావం మా పిల్లల మీద కూడా ఉంది. సాయం చేసే తత్వం నేను మా తండ్రి నుంచి నేర్చుకుంటే మా పిల్లుల మా నాన్నను, నన్ను చూసి నేర్చుకున్నారు. వారిలోనూ కష్టపడి పని చేసే తత్వం ఉంది.

  తండ్రి సుబ్బిరామిరెడ్డితో పింకీ రెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

  నేను ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా మా నాన్నతోనే పంచుకుంటాను. ఇప్పుడు మా నాన్న 75 ఏళ్లు. అయినా ఆయనలోని ఎనర్జీ లెవల్స్, పని చేసే తత్వం ఉండటం చాలా అరుదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించే సమయంలో నేను వారిస్తుంటాను... ఈ వయస్సులో ఇంత స్ట్రెస్ తీసుకుకోవడం అవసరమా అని. అయినా ఆయన ‘ఐ లవ్ టు డూ ఇట్’ అంటారు.

  కనెక్ట్ మేగజీన్ కవర్ పేజీపై పింకీరెడ్డి (Image;pinkyreddyofficial/Instagram)

  మా నాన్నలాగా నేను ఫిట్ గా, హెల్దీగా ఉంటాను. మా అమ్మాయి పెళ్లి సందర్భంలో నా గురించి పూర్తిగా తెలియని వారు మీకు పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఉందా అని ఆశ్చర్యపోయేవారు. నేనిప్పుడు అమ్మమ్మను కూడా (నవ్వుతూ). నేను చిన్నప్పట్నుంచి చూస్తున్నాను మా నాన్న ఉదయాన్నే లేచి జాగింగ్ చేసేవారు. యోగా చేసే వారు. ఫిట్ నెస్, ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day

  ఉత్తమ కథలు