ON THIS DIWALI IF YOU ARE LOOKING TO MAKE SOMETHING SPECIAL FOR YOUR LOVED ONES CHECK OUT THIS MOTICHOOR CHEESECAKE RECIPE SRD
Diwali 2021 : రొటీన్ స్వీట్లతో బోర్ కొట్టిందా! అయితే,ఈ పండుగ వేళ మోతీచూర్ ఛీజ్ కేక్‌ను ప్రయత్నించండి..
Photo Credit : Instagram
Motichoor cheesecake: ఈ డెజర్ట్ నాలుగు దశల్లో తయారు చేస్తారు. ఇందుకోసం కేక్ బేస్, బూందీ, పంచదార పాకం, కేక్ పైభాగం కోసం వివిధ రకాల పదార్థాలు అవసరమవుతాయి.
పండగ సీజన్ వచ్చిందంటే చాలు భారతీయుల ఇంట్లోరకరకాల పిండి వంటలు తయారు చేస్తుంటారు.ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా విభిన్న రకాల మిఠాయిలు తయారు చేస్తారు. అయితే, ఈ మిఠాయిల్లో ఎక్కువగా హల్వా, పాయసం, లడ్డూలు ఇలా రొటీన్ స్వీట్లను రెడీ చేస్తుంటారు. అయితే, వీటిని తిని చాలా మందికి బోర్ కొడుతుంది. రొటీన్‌కు బిన్నంగా కాస్త డిఫరెంట్ స్వీట్ల వైపు చూస్తుంటారు. అటువంటి వారి కోసమేవినూత్నమైన స్వీట్‌ను పరిచయం చేస్తున్నారు ప్రముఖ ఫుడ్ బ్లాగర్ శివేశ్ భాటియా. 'మోతీచూర్ ఛీజ్ కేక్' స్వీట్ ను ఎలా తయారు చేయాలో ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు."ఛీజ్ కేక్ అనే ఈ లడ్డు నాకెంతో ఇష్టం. ఈ పండగ సీజన్ ను రుచికరంగా మార్చడానికి మోతీచూర్ ఛీజ్ కేక్ తో ప్రారంభిస్తున్నాను. గుడ్డు లేకుండా తయారు చేసే ఈ వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దీపావళిలో మీ ప్రియమైనవారి కోసం ఈ మోతీచూర్ ఛీజ్ కేక్‌ను తయారు చేయండి." అని శివేశ్ భాటియా పోస్టులో పేర్కొన్నారు.
మోతీచూర్ ఛీజ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
ఈ డెజర్ట్ నాలుగు దశల్లో తయారు చేస్తారు. ఇందుకోసం కేక్ బేస్, బూందీ, పంచదార పాకం, కేక్ పైభాగం కోసం వివిధ రకాల పదార్థాలు అవసరమవుతాయి.
మొదటి దశ..
ముందుగా శనగపిండిని నీటిలు కలిపి బూందీని తయారు చేయాలి. అనంతరం వాటిని రుచికోసం నెయ్యిలో వేయించి అనంతరం రోజ్ వాటర్ ను కలిపిని పంచదార పాకంలో ముంచండి.
రెండో దశ..
ఛీజ్ కేక్ లో క్రీమ్ ఛీజ్, విప్పింగ్ క్రీమ్ కూడా ఉంటాయి. ఇది అదనపు రుచిని అందిస్తుంది.
మూడో దశ..
కుంకుమ పువ్వుతో పాటు యాలకులను బిస్కట్ బేస్ లో కలపాలి. మీ మిశ్రమానికి కొద్దిగా నెయ్యిని జోడించాలి. ఇది మంచి సువాసన వస్తుంది.
నాలుగో దశ..
పిస్తా పొడి కోసం పిస్తాను బాగా నూరుకోవాలి. అనంతరం ఛీజ్ కేక్ కోసం సిద్ధంగా ఉన్న బిస్కెట్ల మిశ్రమంలో ఈ పిస్తా పొడిని కలాపాలి. మెత్తదనం కోసం మీరు మృదువైన ఛీజ్ క్రీమ్ ను ఉపయోగించాలి. గట్టిగా ఉన్న లేదా కఠిన క్రీమ్ ఛీజ్ వాడినట్లయితే మీ మిశ్రమం ముద్దగా మారుతుంది. ఫలితంగా కేక్ మృదువుగా ఉండదు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.