ఈరోజు ప్రముఖ బాలివుడ్ Bollywood నటి రేఖ 67వ పుట్టిన రోజు. ఇప్పటికీ తన అందం, ఫిట్నెస్ Fitness మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇంత గ్లామరస్ బ్యూటీ ఎలా తన అందాన్ని మెయిన్‌టెన్ చేస్తుందో అని అందరూ అనుకుంటారు. ఈ సందర్భంగా ఈ వయస్సులో కూడా ఆమె ఇంత అందంగా ఆకార్షణీయంగా కనిపించడానికి తన బ్యూటీ సిక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
ఈ బాలివుడ్ నటి Actress rekha అందం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అక్టోబర్ 10న రేఖ 67వ ఏట అడుగుపెడుతున్నారు. కానీ, ఇప్పటికీ ఆమె డ్రెస్సింగ్ సెన్స్.. ఆమె తరంనాటి హిరోయిన్లకు పోటీనిచ్చే విధంగా ఉంటుంది. ఈరోజుల్లో సినిమాలో ఆమె నటించలేకపోయినా.. అనేక రియాల్టీ షోలలో ఆమెను మనం చూస్తూనే ఉంటాం.
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ..
రేఖ తాను తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదే ఆమె ఫిట్నెస్, అందానికి కారణం. ఆమె రోజుకు 10–12 గ్లాసుల నీరు తాగుతారట. దీంతో స్కిన్ హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు విషపూరిత అంశాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. రేఖ ఉడికించిన పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. దీంట్లో నూనె, మసాలా చాలా తక్కువగా ఉంటుంది. వీటితోపాటు ప్రతిరోజూ రోటీ, ఒక కప్ పెరుగు తినడానికి ఇష్టపడతారు. డ్రైఫ్రూట్స్ తక్కువ మోతాదులోనే తీసుకుంటారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటారు.
రేఖ దినచర్య..
రేఖ తన దినచర్యను చాలా కచ్ఛితంగా పాటిస్తారు. ఆమె రాత్రి 7.30లోపు భోజనం చేసేస్తారు. ఆ తర్వాత ఏమీ తీసుకోరు. అంతేకాదు డిన్నర్ తర్వాత త్వరగా నిద్రపోతారు. అందుకే ఆమె మిడ్నైట్ పార్టీలకు అటెండ్ కారు. డిన్నర్‌కు బెడ్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తుంది. కనీసం ప్రతిరోజూ 8 గంటల నిద్ర పోతారు. ఇది తనను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందాన్ని పెంచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
యోగా..
ఈ అందాల నటి ఫిట్‌గా ఉండటానికి రోజూ యోగాను చేస్తారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా యోగా కోసం టైం కేటాయిస్తారు. యోగా మానసికంగా.. శారీరకంగా బలంగా ఉంచుతుందని ఆమె నమ్ముతారు. అందుకే ఇప్పటికీ తన అందం చెక్కు చెదరకుండా ఉంది. యోగా ముఖంలో మెరుపును తీసుకువస్తుంది. అందాన్ని మరింత పెంచుతుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.