news18-telugu
Updated: January 15, 2019, 11:34 AM IST
Donkey's Milk Soap | గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499 (Image: Organiko Website)
గాడిద పాలతో తయారు చేసిన సబ్బు చండీగఢ్‌లోని 'వుమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్'లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఢిల్లీకి చెందిన స్టార్టప్ 'ఆర్గానికో' గాడిద పాలతో తయారుచేసిన సబ్బులను ప్రదర్శిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సందర్శకులంతా గాడిద పాల సబ్బును కొనేందుకు ఎగబడ్డారు. 100 గ్రాముల సబ్బు ధర రూ.499. ఇంత ధర ఉన్నా గాడిద పాల సబ్బు కొనేందుకు ఆసక్తి చూపించారు సందర్శకులు. 2017లో మహారాష్ట్రలోని సోలాపూర్‌లో గాడిద పాలతో సబ్బుల్ని తయారు చేసే పైలట్ ప్రాజెక్టును 'ఆర్గానికో' వ్యవస్థాపకులు పూజా కౌల్ ప్రారంభించారు. గాడిద పాలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, బ్యాక్టిరీయా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణగా నిలుస్తుందని చెబుతున్నారు 'ఆర్గానికో' కో-ఫౌండర్ రిషబ్. ఒక లీటర్ గాడిద పాలను రూ.2,000 చెల్లించి కొంటున్నట్టు తెలిపారు.

గాడిద పాలకు ధర ఎక్కువ. ఇందుకు కారణం గాడిద పాలల్లో ఔషధ గుణాలు అధికంగా ఉండటమే. ఒక గాడిద రోజుకు ఒక లీటర్ పాలు మాత్రమే ఇవ్వగలదు. గాడిద పాలతో మేము తయారు చేసే ఉత్పత్తులకు తమిళనాడు, కర్నాటకలో మంచి డిమాండ్ ఉంది. అక్కడి ప్రజలకు గాడిద పాలతో వచ్చే లాభాల గురించి తెలుసు. త్వరలో గాడిద పాలతో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ తయారుచేస్తాం.
— రిషబ్, 'ఆర్గానికో' స్టార్టప్ కో-ఫౌండర్
'ఆర్గానికో' స్టార్టప్‌ని అధికారికంగా 2018 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఘజియాబాద్‌లోని దస్నాలో 10 కుటుంబాలు 25 గాడిదల్ని పోషిస్తూ ఈ స్టార్టప్ నిర్వాహకులకు పాలను సప్లై చేస్తున్నారు. వాటితోనే సబ్బులు తయారవుతున్నాయి. ఎక్కువగా జైపూర్, ఢిల్లీలో గాడిద పాల సబ్బులు అమ్ముడుపోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండిPaytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్
AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు
Published by:
Santhosh Kumar S
First published:
January 15, 2019, 11:34 AM IST