అబ్బాయిల్లో ఒబెసిటీ ఉంటే ముందుగానే ఆ లక్షణాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఊబకాయం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ, తాజా పరిశోధనల్లో అబ్బాయిల్లో ఒబెసిటీ సమస్య ఉండడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయని తేలింది. అవేంటంటే..

  • Share this:
ఒబెసిటీ సమస్య ఉండడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అమ్మాయిల్లో అయితే ముందుగానే యుక్తవయసుకి వస్తారని తెలుసు. కానీ, అబ్బాయిల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని తేల్చారు శాస్త్రవేత్తలు. ఒబెసిటీ కారణంగా అబ్బాయిలు ముందుగానే టీనేజ్‌లోకి వస్తారని తేల్చారు. యూనివర్సిటీ ఆఫ్ చిలీ పరిశోధకలు చేపట్టిన ఓ పరిశోధనలో ఈ నిజాలు బయటపడ్డాయి.
4 నుంచి 7ఏళ్ల వయసున్న 527మంది బాలురుని పరిశోధించిన శాస్త్రవేత్తలు ఒబెసిటీ కారణంగా అబ్బాయిల్లో సమస్యలు తలెత్తుతాయని తేల్చారు శాస్త్రవేత్తలు. అధిక కొవ్వు, నడుము చుట్టూ చెడు కొవ్వు పేరుకుపోవడం జరుగుతుందని, అంతేకాదు, ఆకస్మిక పెరుగుదల, మానసిక సమస్యలు వంటి లక్షణాలు కూడా బయటపడతాయని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో ఒబేసిటీ సమస్య ఉంటే త్వరగా తగ్గించేందుకు జగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

సూట్, హైహీల్స్‌తోనే జాబ్‌కి రావాలని ఆర్డర్.. ‘కూటూ’ఉద్యమం మొదలుపెట్టిన మహిళలు..
First published: