హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Obesity Diabetes: స్థూలకాయంతో డయాబెటిస్ ముప్పు.. ఇలా చేస్తే మీరు సేఫ్

Obesity Diabetes: స్థూలకాయంతో డయాబెటిస్ ముప్పు.. ఇలా చేస్తే మీరు సేఫ్

గంటలతరబడి కూర్చుని పనిచేసుకోవటం, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో ఒబేసిటీ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా , హార్మోనల్ లోపం వల్ల ఇలా శరీరం విపరీతంగా బరువు పెరగచ్చు.

గంటలతరబడి కూర్చుని పనిచేసుకోవటం, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో ఒబేసిటీ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా , హార్మోనల్ లోపం వల్ల ఇలా శరీరం విపరీతంగా బరువు పెరగచ్చు.

గంటలతరబడి కూర్చుని పనిచేసుకోవటం, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో ఒబేసిటీ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా , హార్మోనల్ లోపం వల్ల ఇలా శరీరం విపరీతంగా బరువు పెరగచ్చు.

  కాస్త బరువు ఎక్కువ ఉంటే ఫర్లేదు. కానీ మీ బరువు అమాంతం పెరిగిందంటే అది స్థూలకాయంగా మారిందంటే మాత్రం మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలు అత్యధికంగా ఉన్నట్టే. ఎందుకంటే కొత్తగా డయాబెట్స్ టైప్-2 బారిన పడుతున్న వారిలో సగం మంది స్థూలకాయం ఉన్నవారే కావటం ఇక్కడ హెచ్చరించదగిన విషయంగా మారుతోంది. అధిక బరువుతో బాధపడుతుంటే మీ బరువును తక్షణం అదుపులోకి తెచ్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించండి, అది ఒబేసిటీగా మారకముందే మీ లైఫ్ స్టైల్ లో మార్పులు తెచ్చుకుని, చెమటోడ్చి సన్నబడాలి లేదంటే మాత్రం ఒబేసిటీకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పినట్టేనని తాజా అధ్యయనం కూడా హెచ్చరిస్తోంది.

  ఇలా టైప్ 2 డయాబెటిక్స్ బారిన పడుతున్నవారిలో అత్యధికులు 65 ఏళ్లు కూడా నిండకుండానే తనువు చాలిస్తున్నారు. ప్రీడయాబెట్స్ ఉన్నవారు 5-7శాతం తమ శరీర బరువు తగ్గించుకుంటే టైప్ 2 డయాబెట్స్ బారిన పడకుండా కాపాడుకునేందుకు 58శాతం అవకాశం ఉంది. ప్రజారోగ్యం బాగుండాలంటే ఒబేసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టాల్సిందేనని ఇందుకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుని షుగర్ ట్యాక్స్ వేయటం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆంక్షలు పెట్టడం చేయటం తప్పనిసరి అంటూ వైద్యులు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఇలాంటివారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు అత్యధికం కనుక ఒబేసిటీకి చెక్ పెట్టేలా వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఉన్నవారితో పోల్చితే ఒబేసిటీ ఉన్నవారికి టైప్ టూ డయాబెట్స్ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే జస్టేషన్ డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఆతరువాతి కాలంలో టైప్ 2 డయాబెట్స్ రాకుండా ఉండాలంటే శరీర బరువును నియంత్రించుకోవటం తప్పనిసరి.

  గంటలతరబడి కూర్చుని పనిచేసుకోవటం, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో ఒబేసిటీ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా , హార్మోనల్ లోపం వల్ల ఇలా శరీరం విపరీతంగా బరువు పెరగచ్చు. కానీ మంచి పోషకాహారం, నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్దమైన జీవితంతో కూడిన కసరత్తులతో క్రమంగా బరువు తగ్గి, ఆరోగ్యంగా తయారు అవ్వచ్చు.

  బాడీ పాజిటివిటీ సంగతేంటి?

  మరి బాడీ పాజిటివిటీ సంగతేంటి అంటారా.. కాస్తంత బొద్దుగా ఉండటం, వంశపారంపర్యంగా సన్నబడలేక పోవటం, ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ వంటి కొందరికి మాత్రమే ఈ బాడీ పాజిటివిటీని అప్లై చేయాలి. అంతేకానీ బద్ధకించి, ఎడతెరిపి లేకుండా తిండి తిని బరువు పెరిగే వారుకు ఏమాత్రం కాదు. ఫిట్ గా ఉండాలే కానీ స్లిమ్ అవ్వటం కాదని నిపుణులు చెబుతున్నది పూర్తిగా అర్థంచేసుకోక చేజేతులా ఒబేసిటీని తెచ్చుకోకండి. మనదేశంలో ఏటా స్థూలకాయుల సంఖ్య పెరుగుతుండగా, మధుమేహం, టైప్ 2 మధుమేహవ్యాధి గ్రస్తుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధికంగా స్థూలకాయులు, టైప్-2 డయాబెట్స్ తో బాధపడుతున్న జనాభా అమెరికాలోనే ఉంది.

  obesity, type 2 diabetes, prediabetes, body positivity, US news, health tips,  life style news, స్థూలకాయం, టైప్ 2 డయాబెట్స్, బాడీ పాజిటివిటీ, ప్రీడయాబెట్స్, అమెరికా, లైఫ్ స్టైల్ న్యూస్

  First published:

  Tags: Diabetes, Health, Health benifits, Health Tips

  ఉత్తమ కథలు