Food Habits : రోజూ ఇలా ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది మహిళలు పిల్లల కోసం ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నాం లంచ్, ఈవెనింగ్ డిన్నర్ చేసేసి, మధ్యలో స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. ఇవన్ని పెడుతుంటారు కానీ.. పిల్లలకు పోషకాలు సరిగ్గా అందుతున్నాయో, లేదో గమనించరు. దీంతో చాలామంది చిన్నారులు పోషకాహారలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Share this:
చాలామంది మహిళలు పిల్లల కోసం ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నాం లంచ్, ఈవెనింగ్ డిన్నర్ చేసేసి, మధ్యలో స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. ఇవన్ని పెడుతుంటారు కానీ.. పిల్లలకు పోషకాలు సరిగ్గా అందుతున్నాయో, లేదో గమనించరు. ఈ గజిబిజీ లైఫ్‌లో పోషకాలగురించి పట్టించుకునే కాలమెక్కడుంది. దీంతో చాలామంది చిన్నారులు పోషకాహారలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్య నిపుణుల పరిశోధనల ప్రకారం.. ఈ మధ్యకాలంలో పిల్లలు, పెద్దల సూక్ష్మపోషకాల లోపానికికారణం ఆహారపు అలవాట్లేనని తేలింది.
అవగాహన పెరిగింది.. ఆహారం మారింది అనుకుంటూ వరి, గోధుమ, జొన్న వంటి తృణధాన్యాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. కానీ, అది కొంతవరకే వాస్తవం. 50శాతం మంది ప్రజలే తృణధాన్యాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఆహారం నుంచి కూడా పోషకాలు పూర్తిగా అందడంలేదు. ఇక కీలక సూక్ష్మపోషకాల మాట అయితే కలే.

ఎదిగే పిల్లలకు కాల్షియం, ఐరన్ ఎంతో ముఖ్యం. ఇవి మాంసం, చేపలు, తాజాపండ్లు, డ్రైఫ్రూట్స్, నట్స్, ఆకుకూరలు, పప్పుల ద్వారా భిస్తుంది. ఇవి రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటేనే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అయితే.. మన బిజీ లైఫ్‌లో ఎంతమందితల్లులు పిల్లలకు ఈ ఆహారాన్ని పెడుతున్నారు. ఇక చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్‌కి ఎక్కవుగా మొగ్గుచూపుతారు. ఇవి త్వరగా చేసి పెట్టేయొచ్చు. పని త్వరగా అయిపోతుందని వారి ఆలోచన. ఆ తర్వాత మార్కెట్లో దొరికే రకరకాల మాల్ట్స్‌ని పాలల్లో కలిపివ్వడం చేస్తున్నారు. ఇక పేద, మధ్యతరగతుల వారి విషయంలో ఇవి కూడా ఉండవనే చెప్పాలి. ఈ నిర్లక్షాలన్నింటి ఫలితమే నేడు చాలామంది పిల్లలు పోషకాహారలోపంతో జబ్బులుపడుతున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ముందుకొచ్చి ఏవేవో పథకాల పేరిట ఆహారాన్ని పంచిపెట్టేందుకు యత్నిస్తున్నా.. అది అర్హులందరికీ చేరుతుందా? అనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది.
మరోవైపు, స్నాక్స్ అంటూ పిల్లలకి జంక్‌ఫుడ్ అందించడం మరో పెద్ద తప్పు. దీంతో.. పిల్లల శరరంలోకి చక్కెర శాతం చేరి స్థూలకాయ సమస్య మొదలైంది. చాలామందిని చూస్తూనే ఉంటాం.. నిండా 15ఏళ్లు నిండని చిన్నారులు కూడా బండెడు శరీరంతో కాళ్లను ఈడుస్తూ నడవడాన్ని.

ఈ సమస్యలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందుగా తల్లిదండ్రులు మేల్కొవాలి. చిన్నతనంలో పిల్లలకు పెట్టే ఆహారమే వారి భవిష్యత్‌లో ఆరోగ్యంగా మారుతుందని గ్రహించాలి. ఉదయం తప్పనిసరిగా బ్రేక‌ఫాస్ట్ చేయించాలి. అందులో ఖచ్చితంగా పాలు, ధాన్యపు గింజలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూడాలి. ఆహారమే కాదు.. నీరు కూడా ఎంతో ముఖ్యం. అందుకే స్కూల్‌కు వెళ్లే పిల్లలకు ఓ పెద్ద బాటిల్ నిండా నీటిని నింపి ఇవ్వాలి. ఈ కారణంగా పిల్లలు కూడా యూరిన్ ఇన్‌ఫెక్షన్లకి గురికాకుండా ఉంటారు. కొంతమంది పిల్లలు నీరు, పండ్లు తీసుకోరని అందుకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ చక్కెర కలిపిన జ్యూస్‌లు, సాఫ్ట్‌డ్రింక్స్ ఇస్తుంటారు. అంతేకాదు, స్కూల్లో స్నాక్స్ టైమ్‌కని ముందుజాగ్రత్తగా బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తారు. అయితే.. ఇవి ఎప్పుడు కూడా పోషకాహారానికి ప్రత్యామ్నాయం కాలేవని గమనించాలి.
సిటీల్లో నివసించేవారు నెలకు ఖచ్చితంగా వీకెండ్స్‌లో హోటల్స్‌లో డిన్నర్ చేస్తుంటారు. ఆ రోజుల్లో ఇంట్లో చేయనివంటకాలన్నీ పిల్లలచేత తినిపిస్తారు. ఈ సంస్కృతికి స్వస్తి పలకాలి.
మొత్తానికీ అన్నింట్లో దూసుకెళ్తున్నామంటూ పిల్లలకు లేనిపోని అలవాట్లు చేస్తూ వారిని వెనక్కి నెట్టకండి. సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని మీరూ తీసుకోండి.. మీ పిల్లలకు అందించి భావితరాలను బలంగా బతకనివ్వండంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మీ మొబైల్‌లో రేడియేషన్ ఎంతుందో ఈజీగా తెలుసుకోండి..


 
First published: