హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips : ఈజీగా బరువు తగ్గాలంటే .. ఈ ఐదు తీసుకుంటే సరిపోతుందట

Health Tips : ఈజీగా బరువు తగ్గాలంటే .. ఈ ఐదు తీసుకుంటే సరిపోతుందట

Health Tips(FILE)

Health Tips(FILE)

Health Tips: సింపుల్‌గా ఇంట్లోనే ఉంటూ పెరుగుతున్న శరీర బరువును తగ్గించుకోవడానికి ఐదు పదార్ధాలు తీసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా ..ఎక్కువ శ్రమపడకుండా ఆ ఐదింటిని తగిన మోతాదులో తింటే సరిపోతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వద్దన్నా వచ్చేది ఒళ్లు...ఎంత కాపాడుకుంటున్న పోయేది జుట్టు. అందుకే ఇప్పుడు ఈ రెండింటిపైనే ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. పోయే జుట్టు కోసం ఎలాగూ ఆపలేం కాబట్టి కనీసం పెరుగుతున్న శరీర బరువును మాత్రం తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు. కొందరు నిపుణులు ఇచ్చే సలహాలతో హెల్త్ టిప్స్ (Health Tips)ఫాలో అవుతున్నారు. మరికొందరు ఆరోగ్య సూత్రాలు, యోగా(Yoga),వ్యాయమం(Exercise),చేస్తూ ఫిజిక్‌ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. కాని సింపుల్‌గా ఇంట్లోనే ఉంటూ పెరుగుతున్న శరీర బరువు(Weight loss)ను తగ్గించుకోవడానికి ఐదు పదార్ధాలు తీసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా ..ఎక్కువ శ్రమపడకుండా ఆ ఐదింటిని తగిన మోతాదులో తింటే సరిపోతుంది.

Health Tips: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మాయం

శరీరం బరువు తగ్గాలంటే..

ముఖ్యంగా బరువు పెరగడం చూడటానికే కాదు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతుంటారు. అయినా చాలా మందికి వద్దంటే కూడా విపరీతంగా ఒళ్లు వచ్చేస్తోంది. అలాంటి వాళ్ల కోసమే నిపుణులు సునాయాసంగా బరువు తగ్గించుకునే తీసుకోవాల్సిన పదార్ధాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ తినడం వల్లే ఈజీగా వెయిట్ లాస్ కావచ్చంటున్నారు. డార్క్ చాక్లెట్స్‌ శరీరంలోని పాలి ఫెనోలిక్ రసాయనాల ఉత్పత్తికి తోడ్పాడుతాయంటున్నారు. అలాగే డార్క్ చాక్లెట్ తినడం వల్లే వాటిలోని ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయని ఫలితంగా కొవ్వు కరుగుతుందంటున్నారు.

తక్కువ మోతాదులో రెడ్ వైన్ ..

ఇక మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నప్పటికి రెడ్ వైన్ మాత్రం బరువు తగ్గించడంలో హెల్ప్ అవుతుందంటున్నారు న్యూట్రిషన్స్. రెడ్ వైన్ లో ఉండే రెస్వరట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్‌లోని షుగర్ పర్సంటేజ్‌ని కంట్రోల్ చేయడంతో పాటు గుండెను కాపాడుతూ బరువును కంట్రోల్‌ చేయడంలో దోహదపడుతుందంటున్నారు.అయితే రెడ్ వైన్‌ కూడా మితంగా తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.

పాప్‌ కార్న్‌తో వెయిట్‌ లాస్ ..

అత్యంత తక్కువ ఖరీదుతో ..అందరికి అందుబాటులో ఉండే పాప్‌ కార్న్ తీసుకోవడం వల్లే కూడా శరీర బరువు తగ్గుతుందంటున్నారు. ఒక కప్పు పాప్ కార్న్ తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి మళ్లీ ఏదో ఒకటి తినడం తగ్గుతుందంటున్నారు. పాప్‌ కార్న్ వల్ల పరోక్షంగా బరువు తగ్గడం ఖాయమంటున్నారు.

బరువును నియంత్రించే కాఫీ..

శరీరంలో జీవక్రియలను సాఫీగా సాగేలా చూడటంలో కాఫీ మంచి బెటర్ అంటున్నారు నిపుణులు. తక్కువ చక్కెర వేసుకుని కాఫీ తాగడం వల్ల ఆకలిని తగ్గిస్తుందని, అదే సమయంలో శరీరంలో కొవ్వు కరిగేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంటున్నారు.

Stomach pain in child: పిల్లల్లో కడుపునొప్పి లక్షణాలు.. తక్షణం తగ్గించడానికి హోం రెమిడీస్

ఆవాలతో బరువుకు చెక్ ..

ఇక ప్రతి కిచెన్‌లో ఉండే ఆవాలు కూడా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. ఒక టీస్పూన్ ఆవాలు మన శరీరంలో జీవక్రియలను 25శాతం మేర పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వర్కౌట్ లు చేసినప్పుడు శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుందని, ఎక్కువ కేలరీలు ఖర్చయి.. బరువు తగ్గడానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు.అయితే వీటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించి తమ ఆరోగ్యానికి ఏది బెటర్ అనిపిస్తే వాటిని తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. అంతే కాదు ఆహారం వల్ల బరువు పూర్తిగా తగ్గదని దానికి అనుగూణంగానే వ్యాయమం తప్పని సరి అంటున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Health benefits, Weight loss tips

ఉత్తమ కథలు