Health Tips : భారతీయుల్లో లోపిస్తున్న పోషకాలు ఇవీ... ఏం చెయ్యాలంటే

ఫుల్లుగా తినడం వేరు... అన్ని పోషకాలతో కూడిన ఆహారం తినడం వేరు. ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపాలు ఎక్కువవుతున్నాయి. మన దేశంలో కూడా పేదరికం, అవగాహన లోపాల వల్ల సరైన ఆహారం తినట్లేదు. 10 శాతం మంది అమెరికన్లలో... ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పౌష్టికాహార లోపాలున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: October 20, 2019, 7:09 AM IST
Health Tips : భారతీయుల్లో లోపిస్తున్న పోషకాలు ఇవీ... ఏం చెయ్యాలంటే
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: October 20, 2019, 7:09 AM IST
మన శరీరంలో కొన్ని పనులు జరగాలంటే... సూక్ష్మ పోషకాలు అవసరం. ఐతే... వీటిని శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు. వాటిని ఇచ్చేందుకే మనం ఆహారం తింటున్నాం. ఐతే... ఇటీవలి కాలంలో... పోషకాల్ని మన శరీరం గ్రహించట్లేదు. కొన్ని సందర్భాల్లో మనం సరైన పోషకాల్ని బాడీకి అందించట్లేదు. మనం తీసుకునే ఆహారంలోనే సరైన పోషకాలు ఉండట్లేదు. అందువల్ల మన శరీరం నష్టపోతుంది. అలా జరగడం వల్ల మనకు అనారోగ్యం వస్తోంది. అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా పది శాతం మందికి పోషకాల లోపం ఉందని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహారం తింటున్నారు. రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, వాతావరణాల వారీగా కూడా తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటున్నాయి. ఫలితంగా పోషకాలు తీసుకునే విషయంలోనూ తేడాలు ఉంటున్నాయి. ఇండియాలో ఏయే పోషకాల లోపాలు ఎక్కువగా ఉంటున్నాయో తెలుసుకుందాం.

ఐరన్ లోపం : శరీరంలో తగినంత ఇనుము లేకపోతే కష్టమే. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచంలో 30 శాతం మందికి ఐరన్ లోపం ఉంది. దీన్నే మనం అనీమియా అంటున్నాం. మన దేశంలో దాదాపు సగం మంది అమ్మాయిల్లో ఐరన్ లోపం ఉందంటే నమ్మగలరా. మహిళల్లో 53 శాతం మందికి ఐరన్ లోపం ఉన్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తేల్చింది. ఐరన్ కోసం ఆకుకూరలు బాగా తినాలి. ఖర్జూరాలు కూడా తింటే మంచిది. అలాగే పప్పుధాన్యాలు, గింజలు, నట్స్, మాంసం తింటే... ఐరన్ లోపం తొలగిపోతుంది.

విటమిన్ D లోపం : సూర్య కిరణాల నుంచీ లభించేది విటమిన్ డి. అలాంటిది... ప్రపంచంలో చాలా మందికి విటమిన్ డి లోపం ఉంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో ఈ లోపం ఉంది. ఫలితంగా ఎముకలు గుల్లబారిపోతాయ్, గుండెకు ప్రమాదం, డయాబెటిస్ వస్తుంది, బరువు పెరుగుతారు, టెన్షన్ ఎక్కువవుతుంది... ఇవన్నీ రాకూడదంటే... చక్కగా ఎండలో కాసేపు ఉండాలి. లేదంటే... చేపలు (ముఖ్యంగా సముద్ర చేపలు) బాగా తినాలి.

అయోడిన్ లోపం : థైరాయిండ్ హార్మోన్ చక్కగా పనిచెయ్యాలంటే... దానికి అయోడిన్ సరిపడా అందాలి. థైరాయిడ్ హార్మోన్... మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మన దేశంలో 325 జిల్లాల్లో సర్వే చెయ్యగా... 236 జిల్లాల్లో ఎక్కువగా అయోడిన్ లోపం ఉన్నట్లు తేలింది. నాణ్యమైన ఉప్పును వాడటం వల్ల సరిపడా అయోడిన్ అందుతుంది. అలాగే వెన్న, ఆవు పాలు, గుడ్లు, సముద్ర చేపలు, గడ్డ పెరుగులో అయోడిన్ మూలకం ఉంటుంది.



విటమిన్ A లోపం : విటమిన్ ఏ లోపం వల్ల భారత్‌లో చాలా మంది పెద్దలు, పిల్లలకు కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. బిడ్డ పుట్టిన ఆరు నెలలపాటూ... తల్లి పాలు పట్టిస్తే... విటమిన్ ఏ లోపం లేకుండా చెయ్యడానికి వీలవుతుంది. అలాగే... ఆకు కూరలు ఎక్కువగా తింటే విటమిన్ ఏ లోపాన్ని పోగొట్టుకోవచ్చు. 1970లోనే విటమిన్ ఏ నిర్మూలన కార్యక్రమం ఇండియాలో మొదలైంది. ఇప్పటివరకూ 3 కోట్ల మంది పిల్లల్ని ఈ లోపం నుంచీ కాపాడారు.

విటమిన్ C లోపం : చర్మానికీ, రోగనిరోధక శక్తి పెరగడానికీ విటమిన్ సీ అవసరం. మన దేశంలో 60 ఏళ్లు దాటిన వారిలో 73 శాతం మందికి విటమిన్ సీ లోపం ఉన్నట్లు తేలింది. స్మోకింగ్‌ని నిషేధిస్తే విటమిన్ సీ లోపాన్ని తగ్గించవచ్చు. అలాగే... తాజా పండ్లు, పుల్లటి ఆహారాలు తీసుకుంటే... విటమిన్ సీ లభిస్తుంది.
First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...