Health Tips : వారంలో ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది..

నిపుణుల సూచన ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు లేదా వారంలో 3-4 గుడ్లు తీసుకోవడం మంచిది. అయితే గుడ్లను రీఫైన్డ్ ఫ్లోర్, హై సుగర్ ఫుడ్స్,మాంసంతో కలిపి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

news18-telugu
Updated: August 16, 2019, 4:28 PM IST
Health Tips : వారంలో ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 16, 2019, 4:28 PM IST
మానవ శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల ప్రోటీన్స్ గుడ్డు ద్వారా లభిస్తాయి. కాబట్టే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డును తీసుకోవడం ద్వారా శరీరానికి పొటాషియం,నియాసిన్,రైబోఫ్లేవిన్,మెగ్నీషియం,సోడియం వంటి ధాతువులు అందుతాయి. అంతేకాదు,
విటమిన్ ఏ,పాస్పరస్,ఐరన్,జింక్,విటమిన్ డి,విటమిన్స్ బి6,విటమిన్ బి12,ఫాలిక్ యాసిడ్,థియామిన్ వంటి ధాతువులు కూడా గుడ్డు ద్వారా శరీరానికి అందుతాయి. అయితే గుడ్డులో కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి.. డైట్‌లో ఎన్ని గుడ్లను తీసుకోవాలి అన్న సందేహం
ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు లేదా వారంలో 3-4 గుడ్లు తీసుకోవడం మంచిది.

అయితే గుడ్లను రీఫైన్డ్ ఫ్లోర్, హై సుగర్ ఫుడ్స్,మాంసంతో కలిపి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా తీసుకుంటే.. అవి ఫ్యాటీ యాసిడ్స్‌గా మారి గుండె జబ్బులు,డయాబెటీస్‌కు దారితీసే ప్రమాదం ఉంది. హై కొలెస్ట్రాల్,గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి 3 గుడ్లకు మించకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...