హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Face Oils: ఫేస్ ఆయిల్స్‌తో మెరిసే చర్మం మీసొంతం.. వీటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Face Oils: ఫేస్ ఆయిల్స్‌తో మెరిసే చర్మం మీసొంతం.. వీటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌పై ఈ జనరేషన్ వారికి అవగాహన పెరుగుతోంది. చాలామంది తమ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో చాలామంది ఫేస్‌ ఆయిల్స్ చేర్చుకుంటున్నారు. వీటిని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం హెల్తీగా ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌పై ఈ జనరేషన్ వారికి అవగాహన పెరుగుతోంది. చాలామంది తమ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో చాలామంది ఫేస్‌ ఆయిల్స్ చేర్చుకుంటున్నారు. వీటిని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం హెల్తీగా ఉంటుంది.

* ఫేస్ ఆయిల్స్ రకాలు

మార్కెట్లో అనేక రకాల ఫేస్ ఆయిల్స్ ఉన్నాయి. అయితే కొన్నింటిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకొన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్ని రకాల చర్మాలకు ఒకే ఫేస్ ఆయిల్ పనిచేయదు. చలికాలంలో చర్మంపై ఎక్కువగా పగుళ్లు వస్తాయి. ఆ సమయంలో ఫేస్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అయితే రోజువారీ లైఫ్‌స్టైల్‌లో మీకు ఏ ఫేస్ ఆయిల్ సూట్ అవుతుందో తెలుసుకొని, అదేవాడాలి. వీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి.

* ఎలా ఎంచుకోవాలి ?

ఫేస్ ఆయిల్ కొనుగోలు చేసే ముందు ఆ ఆయిల్‌ను ఏయే పదార్ధాలతో తయారు చేశారో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఆ ప్రొడక్ట్‌ స్టిక్కర్ పైనే ఉంటాయి. కొందరికి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడక, అలర్జీకి కారణం అవుతాయి. కాబట్టి ఫేస్ ఆయిల్ శాంపుల్‌ను మీ అరచేతిపై వేసుకొని పది నుంచి 15 నిమిషాలు వెయిట్ చేసి ఏదైనా నెగిటివ్ రియాక్షన్ వస్తుందేమో చూడండి. ఎలాంటి నెగిటివ్ రియాక్షన్ రాకపోతే అది మీకు సేఫ్ అనుకోవచ్చు.

* పాటించాల్సిన జాగ్రత్తలు

ఫేస్ ఆయిల్‌ను చాలా సున్నితంగా ముఖ చర్మంపై అప్లై చేసుకోవాలి. గట్టిగా రుద్ది అప్లై చేస్తే చర్మం ముడతలు పడే అవకాశం ఉంది. కంటి, చెవి, ముక్కు లోపలికి ఇది వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. మీకు మీరే సొంతంగా అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి ఎవరైనా సహాయం తీసుకొని వారితో మర్దన చేయించుకోవడం మంచిది.

Pregnancy tips: గర్భధారణ సమయంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

Cashew for Diabetes : మధుమేహం ఉంటే జీడిపప్పు తినవచ్చా? నిపుణుల సలహా

* పరిమితంగా వాడాలి

మార్కెట్‌లో లభించే ఫేస్ ఆయిల్స్‌ను కొన్ని కెమికల్స్ కలిపి కూడా తయారు చేస్తుంటారు. కాబట్టి వీటిని మితంగా అప్లై చేసుకోవాలి. ఎక్కువ కాంతివంతమైన చర్మం కోసం మీకు ఎక్కువ అప్లై చేయాలని అనిపించవచ్చు. అది మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది.

* మేకప్‌తో జాగ్రత్త

ఫేస్ ఆయిల్‌ను అప్లై చేసుకునేటప్పుడు.. అంతకు ముందు వేసుకున్న మేకప్ లేదా ఇతర క్రీమ్స్ డ్రై అయ్యే వరకు ఆగాలి. మేకప్ వేసిన వెంటనే వీటితో మర్దన చేసుకుంటే ఫలితం ఉండదు. మాయిశ్చరైజర్, ఫేస్ ఆయిల్‌ను కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని మరింత హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే లేయరింగ్ చాలా ముఖ్యం. ఒక లేయర్ డ్రై అయిన తర్వాత మాత్రమే మరోసారి వీటితో మర్దన చేసుకోవాలి.

ఫేస్ అయిల్స్‌ను ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. ఎండ, గాలి, వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటిని పెట్టకూడదు.

First published:

Tags: Life Style

ఉత్తమ కథలు