Hair Growth Tips : జుట్టుకీ మనలో ఆత్మవిశ్వాసానికీ సంబంధం ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఉండేవారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే జుట్టు తక్కువగా, బట్టతల ఉండేవారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశాలుంటాయి. ఎందుకంటే... జుట్టు లేకపోవడాన్ని ఓ లోపంగా భావిస్తుంది ఈ సమాజం. జుట్టు లేని వాళ్లను చిన్నచూపు చూస్తుంటారు కొందరు. మాటకు ముందు, మాటకు తర్వాత... జుట్టు లేదంటూ... హేళన చేస్తుంటారు. బట్టతల అంటూ వెటకారాలు చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో అవమానాలు భరిస్తుంటారు చాలా మంది జుట్టు సమస్యల్ని ఎదుర్కొంటున్నవాళ్లు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అన్నది కామన్ సమస్య. మన లైఫ్ స్టైల్, కాలుష్యం, ఆహార అలవాట్లు, జన్యుపరమైన సమస్యలు, మద్యం, స్మోకింగ్ ఇలా ఎన్నో కారణాలు జుట్టు రాలిపోవడానికి కారణం అవుతున్నాయి.
మీకు తెలుసా... వంట గదిలో ఉండే అల్లం... మన జుట్టుకు మేలు చేస్తుందని. అవును... ఇంట్లోనే మనం సొంతంగా జుట్టును కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. తాజాగా ఉండే అల్లం ముక్కలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, చాలా విటమిన్లు ఉంటాయి. అవి జుట్టును మెరిసేలా చెయ్యడమే కాదు... బలంగా, ఒత్తుగా అయ్యేలా చేస్తాయి. అల్లం ముక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్... మన జుట్టుపై వాలే విషవ్యర్థాల్ని తరిమికొడతాయి. అందుకే అల్లంతో జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
చాలా మంది నిమ్మరసాన్ని జుట్టుకు పట్టిస్తారు. ఎందుకంటే... నిమ్మరసం జుట్టుకు మేలు చేస్తుందని భావిస్తారు. ఐతే... నిమ్మరసంలో యాసిడ్ ఉంటుంది. తరచుగా నిమ్మరసాన్ని జుట్టుకు పట్టిస్తే... జుట్టు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఖరీదైన షాంపులు వాడితే... వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయంటున్న నిపుణులు... బేబీ షాంపూలను వాడమని సూచిస్తున్నారు. వారానికి రెండుసార్లు పిల్లలకు వాడే షాంపూలనే పెద్దలూ వాడాలని సూచిస్తున్నారు.
అల్లం నూనె (ginger oil) జుట్టుకు పట్టిస్తే... ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అల్లం రసాన్ని జుట్టుకు పట్టించి... ఓ అరగంట జుట్టును ఆరనివ్వాలి. ఆ తర్వాత... నీటితో లేదా షాంపూతో తల స్నానం చేస్తే... జుట్టు క్రమంగా గట్టిపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benefits, Life Style, Tips For Women