Sleep tips: ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదా? అయితే రోజూ ఇలాంటి టిప్స్​ పాటించండి.. హాయిగా నిద్ర పోవచ్చు

ప్రతీకాత్మక చిత్రం

జీర్ణక్రియ నుండి మీ మానసిక స్థితి (mental health) వరకు అన్నింటిపై నిద్ర (sleep) ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు (brain) సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి. అయితే హాయిగా నిద్ర (happy sleep) పట్టాలంటే కొన్ని పద్దతులు తప్పకి పాటించాలి.

  • Share this:
    బిజీ లైఫ్‌స్టైల్‌ (life style)లో అనేక మంది సరిగ్గా నిద్ర (sleep) కూడా పోవడం లేదు. పని ఒత్తిడి, మానసిక చికాగుల కారణంగా చాలా మంది నిద్రలేమితో భాదపడుతున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు (Unhealthy problems) కొనితెచ్చుకుంటున్నారు. మానవ శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే కంటి నిండా నిద్ర (enough sleep) ఎంతో అవసరం. నిద్ర వల్ల శరీరానికి (body) నూతనోత్తేజం కలుగుతుంది. అంతేకాక వారు రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సరైన నిద్రతో మరుసటి రోజు నూతనోత్తేజంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. జీర్ణక్రియ నుండి మీ మానసిక స్థితి (mental health) వరకు అన్నింటిపై నిద్ర (sleep) ప్రభావాల్ని చూపిస్తుంది. అందువల్ల మీ మెదడు (brain) సరిగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర తప్పనిసరి. అయితే హాయిగా నిద్ర (happy sleep) పట్టాలంటే కొన్ని పద్దతులు తప్పకి పాటించాలి.

    వ్యాయామం చేయండి..

    మీరు నిద్రపోయే రూమ్ చల్లగా, చీకటి (dark)గా ఉండేటట్లు చూసుకోండి. బెడ్రూమ్ (bedroom) విండోస్ కి హెవీ కర్టెన్స్ యూజ్ చేయండి. డిమ్ నైట్‌లైట్ ని హాల్ లో కానీ, బాత్రూమ్ ముందు కానీ యూజ్ చేస్తే రాత్రి పూట లేచినా ఇబ్బంది ఉండదు. వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ (exercise) వలన బరువు తగ్గడం, ఆరోగ్యానికి మంచిది, అంతేకాకుండా మంచి నిద్ర కూడా వ్యాయామం వలన సాధ్యపడుతుంది. సూర్యాస్తమయం నుంచి కెఫీన్, నికోటిన్ తగ్గించండి. ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి, ఫలితంగా నిద్ర పట్టదు.

    రాత్రి హెవీగా తినకండి, లేదా తిన్నతరువాత రెండు గంటల వరకూ నిద్రపోకండి. రిఫైండ్ కార్బ్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ నిద్ర (sleep)ని డిస్టర్బ్ చేస్తాయి. బెడ్రూమ్ (bedroom) లో బెడ్ మీద కూర్చుని వర్క్ చేసుకోవడం వంటి పనుల వల్ల బ్రెయిన్ బెడ్ (bed) ని నిద్ర కి ఎసోసియేట్ చేయలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన మీరు బెడ్రూమ్ లోనే పని చేసుకోవలసి వస్తే బెడ్ మీద కూర్చుని (sit) కాకుండా పక్కన ఇంకో అరేంజ్మెంట్ చేసుకోండి.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి ఒకే సమయానికి లేచే అలవాటు (habit) చేసుకోండి. వీకెండ్స్ అయినా సరే, ఈ టైమింగ్స్ మాత్రం మార్చకండి. అలాగే, సూర్యోదయానికి ఎంత దగ్గరగా నిద్ర లేస్తే అంత మంచిది. వీలున్నంత వరకూ పగలు కునుకు తీయకండి. తప్పదనిపిస్తే ఒక్క పావుగంట మించి నిద్రపోకండి. మీరు నిద్ర పోయే సమయం కంటే ముందే మీకు మత్తుగా అనిపిస్తే వెంటనే పడుకోకండి, మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఫ్రెండ్ కి కాల్ చేయడమో, మరుసటి రోజుకి కావాల్సిన బట్టలు తయారుగా పెట్టుకోవడమో వంటి పనులు చేయండి.

    పగలు సన్‌లైట్ కి ఎక్స్పోజ్ అవ్వండి. బాల్కనీలో కూర్చుని కాఫీ తాగండి. బ్రేక్ ఫాస్ట్ (breakfast) చేసేటప్పుడు మీ డైనింగ్ రూమ్ విండో ఓపెన్ చేసేయండి. వర్క్ లో బ్రేక్స్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా బయటకి రండి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published: