టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ బిజీబిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం (Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా(corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత(peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి (pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర (sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్దతులు రోజూ పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుందట. అయితే ఆ పద్దతులు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
సాయంత్రం పూట మద్యం, సిగరెట్లు (cigarettes), ఎక్కువ భోజనం మానుకోండి. ఆల్కహాల్ (alcohol), సిగరెట్లు మరియు కెఫిన్ నిద్ర (sleep)కు భంగం కలిగిస్తాయి. ఎక్కువ, కారంగా భోజనం చేయడం వల్ల అజీర్ణం (digest) వల్ల అసౌకర్యం కలుగుతుంది. అది నిద్రపోవటాన్ని కష్టంగా చేస్తుంది.
నిద్రకు ముందు (before sleep) రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం (food) తినొద్దు (don’t eat). ఒకవేళ ఆకలి (hungry)తో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండి (snacks)ని ప్రయత్నించండి.
మీరు నిద్రపోవడానికి కొంత సమయం (time) పడుతుంది, కాబట్టి పడుకునే ముందు పుస్తకాలు (books) చదవడం వంటి ప్రశాంతమైన (peaceful) చర్య చేయండి. కొంతమందికి, ల్యాప్‌టాప్ (laptop) వంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని (electronic items) ఉపయోగించడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ పరికరాల తెరల నుండి వెలువడే నిర్దిష్ట రకం కాంతి (light) వల్ల నిద్ర పట్టదు. మీకు నిద్రించడానికి ఇబ్బంది ఉంటే, నిద్రపోయే ముందు లేదా అర్ధరాత్రి (midnight) ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌ని వాడొద్దు.
మీరు నిద్ర పోలేకపోతే, మరొక గది (room)లోకి వెళ్లి మీకు అలసట వచ్చే వరకు విశ్రాంతి (rest) తీసుకోండి. పని సామగ్రి, కంప్యూటర్లు (computers), టెలివిజన్లను నిద్రపోయే వాతావరణం నుంచి దూరం (distance)గా ఉంచటం మంచిది. మీకు ఒక నిర్దిష్ట కార్యాచరణ లేదా వస్తువు మీ నిద్ర (sleep)కు భంగం కలిగించినట్లు అనిపిస్తే, దాన్ని మీ నిద్ర వేళ దినచర్య నుండి తొలగించండి. మీకు ఇంకా నిద్ర సరిగా రాకుంటే మీ డాక్టర్ (doctor)ని సంప్రదించడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Sleep, Sleep tips, Tv channel