వర్షాకాలం.. సీజనల్ జబ్బులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కరోనా.. ఇమ్యూనిటీ (Immunity) పెంచుకోవడానికి కావాల్సిన ఆహారం తీసుకుంటున్నాం. అయితే, జ్వరం (Fever) వచ్చినపుడు మాంసాహారం తింటే ప్రమాదమని కొందరు అంటుంటారు. అందులో నిజమెంతో తెలుసుకుందాం.
ఈ విషయంపై చాలా మందికి సందేహం ఉంటుంది. చికెన్, మటన్, కోడిగుడ్లు, చేపలు (fishes) వంటి వంటకాలు జ్వరం వచ్చినపుడు తినకూడదా? తింటే ఏమవుతుంది? కొందరు దీన్ని నమ్మకుండా నాన్ వెజ్ తింటారు. మరికొందరు భయపడి వాటికి జోలికి పోరు. సాధారణంగా ఆ సమయంలో మాంసాహారం తింటే పచ్చ కామెర్లు వస్తాయని అంటారు.
ముఖ్యంగా జ్వరం వస్తే జీర్ణశక్తి (Digestion) తగ్గిపోతుంది. అందుకే వైద్యులు సైతం తేలికైనా ఆహారం తీసుకోమంటారు. మరి అలాంటి సందర్భంలో సరిగ్గా జీర్ణం కాని నాన్ వెజ్ తింటే.. కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో దాని పనితీరు మందగిస్తుంది. ఫలితంగా కామెర్లు (Jaundice)వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినపుడు మాంసాహారం అస్సలు తినకూడదు. కేవలం కామెర్లు మాత్రమే కాదు.. ఇతర రోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఆ సమయంలో తేలికైన ఆహారం తీసుకుంటే మంచిది.
వ్యాధి బారిన పడేది ఎవరంటే..?
ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ తినేవారు. మాంసాహారం అధికంగా తీసుకునేవారు. ఎక్కువ శాతం బయటి ఫుడ్.. చిరుతిళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి కామెర్లు రావడానికి ఎక్కువ చాన్స్ ఉంటుంది. మద్యం సేవించేవారికి కూడా కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిని త్వరగా గుర్తించడం కష్టం.
పచ్చకామెర్ల బానిన పడినవారికి కళ్లు, అరచేతులు, నోరు, అరికాళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. సమయం గడుస్తున్న కొద్ది ఇది ప్రాణాంతకం అవుతుంది.
అందుకే జ్వరంతో బాధపడుతున్నపుడు సూప్స్, ఒక కప్పు రైస్, కిచిడీ, పప్పులు వంటివి తీసుకోవాలి. ఫిష్ చికెన్, మాంసాల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్, విటమిన్ బీ3 ఇతర విటమిన్లు ఉన్నా.. అవి కేవలం ఎముకలకు బలాన్ని చేకూర్చడానికే.. కానీ, ఆరోగ్యపరంగా వైద్యుల సలహాలు తీసుకోంది.. ఫీవర్ వచ్చినపుడు వీటికి కాస్త దూరంగా ఉండటమే మేలు.
ఇంకా కొబ్బరినీరు, తేనె, అల్లం కలిపిన ఆహారం తింటే త్వరగా జ్వరం తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పళ్ల రసాలు తీసుకుంటే కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.