Home /News /life-style /

weight loss tips:  ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

weight loss tips:  ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బరువు తగ్గడం (weight loss ) అనేది అంత సులువైన పని కాదు. దానికి చాలా ఓపిక, పట్టుదల ఇంకా సమయం చాలా అవసరమౌతుంది. సమతుల ఆహారంతో పాటు ఇంకా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ద్వారా కూడా ఏ విధంగా బరువు తగ్గొచ్చో ఈ కింది చిట్కాల ద్వారా (weight loss tips) తెలుసుకోండి

ఇంకా చదవండి ...
    అసలే బిజీ లైఫ్​. చదువులు, ఉద్యోగాలు, ఇతర పనులు, ఇంటి పనులు అన్నీ ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. వేళకు కూడా తినే సమయం దొరకదు చాలామందికి. వేళకు ఆహారం (food) తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ఈ రోజుల్లో అధిక బరువు కూడా ప్రమాదకరమే. అయితే బరువు తగ్గడం (weight loss ) అనేది అంత సులువైన పని కాదు. దానికి చాలా ఓపిక, పట్టుదల ఇంకా సమయం చాలా అవసరమౌతుంది. సమతుల ఆహారంతో పాటు ఇంకా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ద్వారా కూడా ఏ విధంగా బరువు తగ్గొచ్చో ఈ కింది చిట్కాల ద్వారా (weight loss tips) తెలుసుకోండి. మరి అవేంటో తెలుసుకోండి.

    ఇక బరువు తగ్గేందుకు (weight loss) ఉపయోగపడే పోషకాల్లో ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవని గుర్తుపెట్టుకోవాలి. గుడ్డు, పప్పు, చికెన్‌ ఇంకా తృణ ధాన్యాల్లో ప్రొటీన్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక వీటిల్లోని ప్రోటీన్స్ (proteins) శరీరంలో ఎక్కువ సమయం నిల్వ ఉండటం వల్ల జంక్‌ ఫుడ్‌ లేదా ఇతర రూపాల్లో బయటినుంచి క్యాలరీలను తీసుకోవడం వల్ల బరువుని చాలా ఈజీగా అదుపు చేయవచ్చు.

    ఇక విటమిన్‌ ‘సి’  (vitamin C)లో యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి.ఇక ఇది కేవలం విషహరణానికి మాత్రమేకాక బరువు తగ్గే ప్రక్రియను కూడా బాగా వేగవంతం చేస్తుంది. ఇక ఆల్మా ఇంకా ఆరెంజ్‌ అలాగే ఇతర సిట్రస్‌ పండ్ల (citrus fruits)లో కూడా విటమిన్‌ ‘సి’ చాలా ఎక్కువగా ఉంటుంది.

    ఆకుపచ్చ కూరగాయల్లో,  పప్పు దినుసులు మొదలైన వాటిల్లో కూడా ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇక శరీరం బాగా పనిచేయాలంటే ప్రమాదకర ద్రావణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించి వెయ్యాలి. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీవాణువిషాలను ఖచ్చితంగా బయటకి పంపి ఇంకా ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ల నుంచి శరీరాన్ని పూర్తిగా కాపాడుతాయి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight gain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు