హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

NIVA Bupa: తక్కువ ధరలోనే క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఆవిష్కరించిన నివా బుపా.. ఫీచర్ల వివరాలివే!

NIVA Bupa: తక్కువ ధరలోనే క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఆవిష్కరించిన నివా బుపా.. ఫీచర్ల వివరాలివే!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

NIVA Bupa | "నివా బుపా" తక్కువ ధరలో క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ చాలా సరసమైన ధరకు లభిస్తుంది. ఇండియన్ క్యాన్సర్ సొసైటీ తో సంప్రదించిన తర్వాత ఈ ప్లాన్ ను రూపొందించినట్లు నివా బుపా ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఇంకా చదవండి ...

కరోనా (Corona) తర్వాత హెల్త్​ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. వయస్సుతో సంబంధంలో అంతా ఇన్సూరెన్స్ పాలసీ (Insurance Policy) లు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద వ్యాధులతో ఆసుపత్రి పాలయినా, అనుకోని సందర్భాల్లో యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చేరినామనల్ని ఇన్సూరెన్స్ అనేది అనవసర ఖర్చుల నుంచి కాపాడుతుంది.అందుకే హెల్త్​ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంతా భావిస్తుంటారు. అయితే ఇప్పటికీచాలా మంది యువకులు తమకు ఇన్సూరెన్స్అవసరం లేదని లైట్​ తీసుకుంటుంటారు.కానీ ఇలా లైట్ తీసుకోవడం మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యానర్స్(Cancer), ఎయిడ్స్(AIDS), వంటి పెద్ద పెద్ద వ్యాధులతో మనం సతమతమవుతున్న సమయంలో ఇన్సూరెన్స్ మనల్ని కాపాడుతుందని గుర్తు చేస్తున్నారు. మార్కెట్లో(Market) ప్రస్తుతం అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అవి మన కోసం వివిధ రకాల ప్లాన్లను అందిస్తున్నాయి.

Weight Loss: బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా.. అయితే ఇవి మీకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి


ప్రస్తుతం మార్కెట్లో లీడింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల్లో నివా బుపా ఒకటి. దీనిని ఒకప్పుడు మ్యాక్ బుపా ఇన్సూరెన్స్ కంపెనీగా పిలిచేవారు. కానీ కంపెనీ ప్రస్తుతం తన పేరును నివా బుపాకు మార్చుకుంది. ఈ కంపెనీచాలా తక్కువ ధరలో క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ చాలా సరసమైన ధరకు లభిస్తుంది. ఇండియన్ క్యాన్సర్ సొసైటీ తో సంప్రదించిన తర్వాత ఈ ప్లాన్ ను రూపొందించినట్లు నివా బుపా ఒక ప్రకటనలో తెలియజేసింది.

80 వేలకు పైగా ఆసుపత్రులతో టైఅప్..

మనదేశంలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉన్నప్పటికి కూడా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. సామాన్యులు ఇంత ఖర్చు చేసి చికిత్సను చేయించుకునే స్థితిలో ఉండడం లేదు. క్యాన్సర్ వల్ల ఏటా చాలా మంది అమాయకులు తమ అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఒక వేళ క్యాన్సర్ కోసం ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామనుకున్న ఆ రేట్లు సామాన్యులు భరించలేని విధంగా ఉన్నాయని నివా బుపాతెలియజేసింది.

Home tips: ఈ ఒక్క టిప్ తో పచ్చిబఠాణి ఏడాదిపాటు నిల్వ ఉంటుంది..

అందుకోసమే తాము చాలా తక్కువ ధరలో క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ను తక్కువ ఆదాయం గల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. నామమాత్రపు ప్రీమియంతో ఇది అందుబాటులో ఉంటుంది. కీమోథెరపీ, రేడియేషన్, డేకేర్ వంటి ఖర్చులను కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ (కుటుంబం మొత్తానికి వర్తించే విధంగా) రూ. 5 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.

ఇద్దరు పెద్దలు, ముగ్గురు పిల్లలు (క్యాన్సర్ లేని కుటుంబాలకు) ఇక ఈ ప్లాన్ లో క్యాష్ లెస్ హాస్పిటాలిటీ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. నివా బుపాతో జతకట్టిన దాదాపు 80,000 ఆసుపత్రులలో ఇది వర్తిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను నివా బుపా తయారు చేసినందుకు చాలా సంతోషం అని ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ట్రస్టీ ఉషా థోరట్ అన్నారు.

First published:

Tags: Insurence, Life Style

ఉత్తమ కథలు