ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం(ఫిబ్రవరి 4) సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ఓ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముంబైలో సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్ క్లినిక్‌ను ప్రారంభించారు. మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి అన్ని రకాలైన చికిత్సలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ముంబైలో కూడా ఇది గమనించారు. ఎవరైనా మహిళలు తమకు రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే, వారికి కేవలం రెండు గంటల్లోనే చెక్ చేసి చెబుతారు. క్యాన్సర్‌ను గుర్తించడం, దానికి చికిత్స విధానం కూడా ఈ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంది. ‘సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో మేం సమగ్రమైన అంకాలజీ విభాగంతో పాటు అత్యున్నతమైన రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికీ అంకాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం.’ అని నీతా అంబానీ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ముఖ్యమైనది. భారత్‌లోని మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో 14 శాతం రొమ్ము క్యాన్సర్ గా గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 22 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తున్నట్టు గుర్తించారు. HNRFH సీఈఓ డాక్టర్ తారంగ్ జ్ఞానచాందిని మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ బారినపడే వారు ఎదుర్కొనే శారీరక, మానసిక సంఘర్షణను తాము గుర్తించామని, అందుకే వారి కోసం వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకొచ్చామన్నారు. ‘క్యాన్సర్ రాకుండా చూడడం, ముందుగా గుర్తించడం, చికిత్స అందించడం, కౌన్సెలింగ్, రిహాబిలిటేషన్, సమగ్రమైన శ్రద్ధ.. మహిళలకు అన్ని రకాలైన చికిత్స సేవలు ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.’ అని డాక్టర్ జ్ఞానచాందిని చెప్పారు.
Smt. Nita Ambani, Founder and Chairperson, Reliance Foundation launches “One-Stop Breast Clinic” at Sir H.N. Reliance Foundation Hospital. #WorldCancerDay #BreastCancer #IAmAndIWill #RespectForLife #RelianceFoundationHospitalhttps://t.co/xAVtAGSgBW
— Sir H.N. Reliance Foundation Hospital (@RFhospital) February 4, 2021
ఆస్పత్రి డైరెక్టర్, సర్జికల్ అంకాలజీ డాక్టర్ విజయ్ హరిభక్తి మాట్లాడుతూ మహిళలకు అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, క్యాన్సర్ గుర్తింప, చికిత్స, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు. వారు పూర్తిగా కోలుకునేలా యాక్షన్ ప్లాన్ ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా రొమ్ము క్యాన్సర్ చికిత్స విధానంలో తీసుకుంటున్న చర్యలను ఇక్కడ క్లినిక్స్‌లో అమలు చేస్తున్నారు. పేషేంట్ కేంద్రంగా, అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నారని లండన్లోని ప్రముఖ గై ఆస్పత్రి క్లినికల్ లీడ్, బ్రెస్ట్ ట్యూమర్ గ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ అశుతోష్ కొఠారి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nita Ambani, Reliance Foundation