అర్ధరాత్రి ఆరగిస్తే... ఇక అంతే!

Night Time Snacking Linked With Poor Sleep, Obesity

Night Time Snacking Linked With Poor Sleep, Obesity

 • News18
 • Last Updated :
 • Share this:
  కాలం మారింది. మన అలవాట్లు మారాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరిలోనూ వేళాపాళా లేకుండా జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైంది. సాధారణంగా జంక్ ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాంటిది శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన నడిరాత్రి సమయంలో కనుక స్నాక్స్ పేరుతో జంక్ ఫుడ్ తీసుకుంటే... అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే! అని తాజా అధ్యయనంలో రుజువైంది. ముఖ్యంగా అర్ధరాత్రి లేచి ఆరగించే వారిలో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం విపరీతంగా పెరుగుతుందట. అర్ధరాత్రి సమయంలో మానవ శరీరంలో జీర్ణావయ వ్యవస్థ పూర్తిగా విశ్రాంతిలోకి జారుకుంటుంది. అందుకే రాత్రి వేళల్లో భోజనం మితంగా చేయాలని డాక్టర్లు చెబుతుంటారు.

  డిన్నర్ పేరిట అధికంగా ఆరగించి, అది అరగకముందే పడుకునేవారికి ఊబకాయం త్వరగా వస్తుంది. అదీగాక మధ్య రాత్రి లేచి తిండి కోసం వెతికే వారిలో అయితే ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆకలి తట్టుకోలేక తింటే ఒకే కానీ... వరుసగా అదే అలవాటు అయితే మాత్రం జీర్ణాశయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదమూ ఉందట. అంతేకాదు మధ్యరాత్రిలో తినడం అలవాటు అయిన వారిలో 60 శాతం మందికి నిద్రలేమి బాగా పెరుగుతుంది.

  3 వేల మందికి పైగా ఉద్యోగులపై మొబైల్ ఫోన్ల ద్వారా జరిపిన ఈ సర్వే ప్రకారం సమయా పాలన లేకుండా ఆహారం తీసుకునే వారిలో షుగర్, అతిబరువు వంటి సమస్యలు విపరీతంగా పెరిగాయట. అంతేకాకుండా వీరు సుఖంగా నిద్రపోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తోందని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బల్తీమోరే నగరానికి చెందిన ప్రొఫెషనల్ స్లీప్ సొసైటీ ఈ అధ్యయనం చేసింది. జంక్ ఫుడ్ తినేవారిలో నిద్రలేమి పెరిగి... రాత్రి సమయాల్లో మరింత జంక్ ఫుడ్ తినడానికి కారణమవుతోందని వీరిలో చాలామంది చెప్పడం విశేషం. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడమే ఈ సమస్యలకు పరిష్కారమని పౌష్టికాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
  First published: