అర్థరాత్రి వరకు మేల్కొంటే గుండెపోటు ఖాయం

రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేందుకు ఇబ్బందులు పడేవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. అంతేకాదు... వేళాపాళా లేకుండా తినడం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్వీట్స్ ఎక్కువగా తీసుకునేవారికీ ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ.

news18-telugu
Updated: January 18, 2019, 7:42 PM IST
అర్థరాత్రి వరకు మేల్కొంటే గుండెపోటు ఖాయం
సోషల్ మీడియా కారనంగా 40 శాతం నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న టీనేజర్స్.
  • Share this:
అర్థరాత్రయినా సరే స్మార్ట్‌ఫోన్‌ వాడటం మీకు అలవాటా? నిద్ర ముంచుకొస్తున్నా ఫేస్‌బుక్, యూట్యూబ్‌తో టైమ్ గడిపేస్తుంటారా? ఫోన్, ల్యాప్‌టాప్ కాకుండా రాత్రంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారా? ఇవన్నీ మీకు గుండెజబ్బుల్ని తీసుకొచ్చేవే. బోనస్‌గా డయాబెటిస్ కూడా వస్తుంది. వామ్మో అనుకోకండి. అర్థరాత్రి వరకు నిద్రపోని వారికి గుండెజబ్బులు, డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ అని తాజా అధ్యయనాలు తేల్చాయి.

త్వరగా నిద్రపోయి తెల్లవారుజామున నిద్రలేచేవారితో పోలిస్తే... అర్థరాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 2.5 రెట్లు ఎక్కువ అన్నది నెస్లే హెల్త్ సైన్స్ పరిశోధకుల అధ్యయనం సారాంశం. రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేందుకు ఇబ్బందులు పడేవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. అంతేకాదు... వేళాపాళా లేకుండా తినడం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్వీట్స్ ఎక్కువగా తీసుకునేవారికీ ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ.

ఆలస్యంగా తినడం కూడా టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుందట. కారణం... సిర్కాడియం రిథమ్ అదుపుతప్పడమే. అందుకే అర్థరాత్రి వరకు మేల్కొనేవాళ్లు నిద్రపోయేముందు తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అది మెటబాలిజంపై ప్రభావం చూపిస్తుంది. అర్థరాత్రి వరకు మేల్కొనేవాళ్లు... వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోయి ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచిస్తారట. అది కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి:మీకూ నోమోఫోబియా ఉందా? స్మార్ట్‌ఫోన్‌తో ఈ రోగం ఖాయమా?

వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

రియల్‌మీ యూ1 లుక్ ఎలా ఉందో చూశారా?
Loading...
ఎస్‌బీఐ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన 3 డెడ్‌లైన్స్ ఇవే...
First published: January 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...