డ్రెస్సుల తయారీకి రెడ్ వైన్... కొత్త టెక్నాలజీపై జోరుగా పరిశోధనలు...

కాటన్, నైలాన్, సిల్క్ వంటి వాటి ద్వారా వస్త్రాలు తయారుచెయ్యడం మనం చూస్తున్నాం. భవిష్యత్తులో మాత్రం రెడ్ వైన్ ద్వారా డ్రెస్సులు తయారుచేస్తారట. అదెలాగో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 7:02 AM IST
డ్రెస్సుల తయారీకి రెడ్ వైన్... కొత్త టెక్నాలజీపై జోరుగా పరిశోధనలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Red Wine : ఈ ప్రపంచంలో... షాంపేన్, వోడ్కా, విస్కీ ఎంత ఫేమస్సో... రెడ్ వైన్ కూడా అంతే. ఎర్రటి ద్రాక్షల నుంచీ తీసే ఈ వైన్‌ను పార్టీలలో ప్రజలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇలాంటి ఈ వైన్ నుంచీ డ్రెస్సులు తయారుచేస్తారంటే నమ్మడం కష్టమే. రెడ్ వైన్, కాఫీ, బ్లాక్ టీ వంటి వాటి నుంచీ టాన్నిక్ యాసిడ్‌ను వెలికితీస్తున్నారు యూకేలోని మాంచెస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు. ఈ యాసిడ్‌ను బట్టల తయారీలో ఉపయోగించబోతున్నారు. దీని వల్ల లాభమేంటంటే... మనం వేసుకునే డ్రెస్సులు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. లావుగా ఉండేవారికి లావుగా... సన్నగా ఉండేవారికి సన్నగా మారిపోతాయి. ఎవరి శరీర తీరును బట్టి... వారికి అనుకూలంగా డ్రెస్సులు ఒదిగిపోయేందుకు రెడ్ వైన్ నుంచీ తీసే టాన్నిక్ యాసిడ్ ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ యాసిడ్ వల్ల డ్రెస్సులు ఎక్కువ కాలం మన్నుతాయని కూడా చెబుతున్నారు.

వేడిగా ఉన్న వాతావరణం సడెన్‌గా చల్లబడిపోతే, మామూలు వాతావరణంలో మంచు తుఫాను వచ్చి... మైనస్ డిగ్రీలకు పడిపోతే... అప్పటికప్పుడు డ్రెస్సును మార్చుకునే వీలు లేకపోతే ఇబ్బందే. అలాంటి సమయలో... ఈ కొత్త తరహా డ్రెస్సులు... వాతావరణానికి తగ్గట్టుగా... మారిపోతాయని, చలి, ఎండ, వాన, తీవ్రమైన మంచు నుంచీ కాపాడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి డ్రెస్సుల తయారీకి ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నా అవి సక్సెస్ కావట్లేదు.

జనరల్‌గా కాఫీ, బ్లాక్ టీ వంటివి డ్రెస్‌పై పడితే... ఆ మరకలు వెంటనే పోవు. దీనంతటికీ కారణం వాటిలోని టాన్నిక్ యాసిడే. అది డ్రెస్సుల ఫైబర్‌పై ఉండే పదార్థాన్ని పీల్చేసుకుంటోంది. ఈ లక్షణమే... ఫ్లెక్సిబుల్ డ్రెస్సుల తయారీకి ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. కొత్త టెక్నాలజీతో... అనుకూలమైన డ్రెస్సుల తయారీతోపాటూ... అవి మరింత తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చేలా చేయవచ్చంటున్నారు.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>