కార్లలో శృంగారం...అమెరికన్లలో పెరుగుతున్న వికృత వాంఛ

అమెరికన్లలో కార్ సెక్స్‌ కోరిక రోజు రోజుకు పెరిగిపోతుంది. కార్లలో శృంగారం చేయడం ఎలా అనే విషయం తెలుసుకోవడానికి అమెరికన్లు తెగ వెర్రిత్తిపోతున్నారు.

news18-telugu
Updated: September 4, 2019, 12:47 PM IST
కార్లలో శృంగారం...అమెరికన్లలో పెరుగుతున్న వికృత వాంఛ
ఆ సర్వే ప్రకారం.. అత్యంత ఎక్కువగా సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేది రైతులే.
  • Share this:
శృంగారంలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకోవడంలో మిగతా వారితో పోలిస్తే అమెరికన్లు కాస్త ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే అనేక సర్వేల్లో రుజువైంది. తాజాగా అమెరికన్లలో మరో రకమైన సెక్స్ కోరికలు కూడా పెరుగుతున్నాయనే విషయం ఆసక్తిరేపుతోంది. ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం... అమెరికన్లలో కార్ సెక్స్‌ కోరిక రోజు రోజుకు పెరిగిపోతుంది. కార్లలో శృంగారం చేయడం ఎలా అనే విషయం తెలుసుకోవడానికి అమెరికన్లు తెగ వెర్రిత్తిపోతున్నారు. కొంతకాలం నుంచి ఈ సంఖ్య బాగా పెరిగిపోతోంది. నెలకు దాదాపు 6, 600 మంది అమెరికన్లు కార్లలో సెక్స్ చేయడం ఎలా అని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారంటే... వీరిలో ఈ రకమైన కోరిక ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే అమెరికన్లలో ఈ రకమైన వింత వాంఛ పెరగానికి కారణాలు కూడా ఉన్నాయని ఓ సెక్స్ ఎడ్యుకేషన్ సంస్థ విశ్లేషించింది. ఒత్తిడితో పాటు రిస్క్ తక్కువగా ఉండటమే ఈ కొత్త రకం సెక్స్ వైపు అమెరికన్లు ఎక్కువగా దృష్టి పెట్టడానికి కారణమట. తమ రోజూవారి జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కార్లలో సెక్స్ చేస్తే బాగుంటుందనే భావనలో పలువురు అమెరికన్లు ఉన్నట్టు తెలుస్తోంది. కార్లలో అయితే తమ పార్టనర్లు అందుబాటులో ఉండటం ఇందుకు మరో ప్రధాన కారణమట. ఇక కార్లలో సెక్స్ చేయడం వల్ల రిస్క్ కూడా తక్కువగా ఉంటుందనే ఫీలింగ్ కూడా అమెరికన్ యూత్‌లో ఎక్కువగా ఉందని ప్రముఖ సెక్స్ ఎడ్యుకేషన్ సంస్థ విశ్లేషించింది. చూస్తుంటే... అమెరికన్లలో కార్ సెక్స్ కోరిక రోజురోజుకు మరింత పెరిగేలా కనిపిస్తోంది.

First published: September 4, 2019, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading