ఇండియాలో సెక్స్ టాయ్స్ అమ్మకాల జోరు..

కియారా అద్వానీ

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్.. దేశంలో యువతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని దాదాపు మార్చేసిందట. ఆ షార్ట్ ఫిల్మ్‌లో కియారా అద్వానీ వాడిన సెక్స్ టాయ్, దానివల్ల ఆమె పొందిన స్వయం తృప్తి కొంతమంది యువతులను బాగా ఆకర్షించిందట.

 • Share this:
  ఇండియాలో పెళ్లి కాకుండా సెక్స్ చేయడం అనేది పెద్ద నేరం. యువతీ యువకులు మేజర్ అయినా.. సమాజం అలాంటి వాటిని అంగీకరించదు. పెరిగిన విధానం, సంస్కృతి అడ్డు పడతాయి. పురుషుల విషయానికి వచ్చే సరికి స్వయం తృప్తి పెద్ద విషయమేమీ కాదు. కానీ, యువతులకు అదో పెద్ద సమస్య. స్వయం తృప్తి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నా.. వాటిని అనుసరించేందుకు ముందు వెనకా ఆలోచించాల్సిందే. మార్కెట్‌లో సెక్స్ టాయ్స్ దొరుకుతున్నా, వాటిపై చాలా మందికి అవగాహన తక్కువ. వాటిని ఎలా వాడాలి? ఎక్కడ దొరుకుతాయి? ఎలా కొనాలి? తదితర కారణాలతో వాటికి దూరంగా ఉంటారు. అయితే.. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్.. దేశంలో యువతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని దాదాపు మార్చేసిందట. ఆ షార్ట్ ఫిల్మ్‌లో కియారా అద్వానీ వాడిన సెక్స్ టాయ్, దానివల్ల ఆమె పొందిన స్వయం తృప్తి కొంతమంది యువతులను బాగా ఆకర్షించిందట. వాటి గురించి నెట్‌లో సెర్చ్ చేసి మరీ కొనుగోళ్లను ప్రారంభించారట.

  ‘లస్ట్ స్టోరీస్‌లో కియారా సెక్సువల్ ఆనందం గురించి చాలా బాగా విశదీకరించింది. ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఆమె నటన, హావభావాలు ప్రేక్షకులకు ఓ రకమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా.. సెక్స్ టాయ్స్ గురించి ఎక్కువ మంది యువతులకు తెలిసేలా చేసింది’ అని దట్స్‌పర్సనల్.కామ్ అనే వెబ్‌సైట్ తెలిపింది.

  ఆ షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యాక సెక్స్ టాయ్స్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని వెల్లడించింది. కాగా, టాయ్స్‌ను ఆర్డర్ చేస్తే లోపల ఏముందో తెలిసిపోతుందని చాలా మంది భయపడతారని, కానీ, వ్యక్తిగత ఆనందం కోసం వాడేవారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, ఏ వస్తువు డెలివరీ అవుతుందో తీసుకునే వారికి తప్ప ఎవ్వరికీ తెలియదని ఆ వెబ్‌సైట్ హామీ ఇచ్చింది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: