బలవంతపు శృంగారం... సర్వేలో షాకింగ్ విషయాలు

అమెరికాలోని ప్రతి 16 మంది అమ్మాయిల్లో ఒకరు బలవంతంగా శృంగారం చేయడానికి సిద్ధపడుతున్నారని ఓ సర్వే తేల్చి చెప్పింది.

news18-telugu
Updated: September 17, 2019, 3:35 PM IST
బలవంతపు శృంగారం... సర్వేలో షాకింగ్ విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యువతులపై లైంగిక దాడి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉన్న ఓ భయంకరమైన సమస్య. కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉండే ఇలాంటి సమస్యలు... అమెరికా వంటి అగ్రరాజ్యంలోనూ బాగానే ఉన్నాయని ఆ దేశ వ్యాధి నియంత్రణ సంస్థ చేపట్టిన సర్వేలో స్పష్టమైంది. అమెరికాలోని ప్రతి 16 మంది అమ్మాయిల్లో ఒకరు బలవంతంగా శృంగారం చేయడానికి సిద్ధపడుతున్నారని ఈ సర్వే తేల్చి చెప్పింది. తొలిసారి ఈ రకంగాలో సెక్స్‌లో పాల్గొంటున్న యువతుల్లో కొందరిపై శారీరికంగా, మరికొందరు మానసికంగా ఒత్తిడి ఉంటోంది. గత ఎనిమిదేళ్ల నుంచి చేపడుతున్న ఈ సర్వేలో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న 13 వేల మంది మహిళల అభిప్రాయాలను తీసుకున్నారు.

వీరిలో 6.5 శాతం మంది తాము వివిధ ఒత్తిళ్ల కారణంగానే తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నామని తెలిపారు. పలువురు తాము డ్రగ్స్, ఆల్కహల్ కారణంగా తొలిసారి సెక్స్ చేశామని వివరించారు. దీంతో వారంతా బలవంతంగా శృంగారంలో పాల్గొన్న వారే అని తేలింది. వీరిలో ఎక్కువమంది యువతులు 15 ఏళ్ల వయసులో 27 ఏళ్ల వయసున్న యువకులతో సంభోగించారని వెల్లడైంది. అంతకుముందు 1995లో ఇదే రకమైన సర్వేలో ఈ మొత్తం శాతం 9 శాతం ఉందని... అది ఇప్పుడు 6.5కు తగ్గిందని సంస్థ అభిప్రాయపడింది. అయితే లండన్‌కు చెందిన సామాజిక సైకాలజిస్ట్ పెట్రా బొయన్టన్ మాత్రం ఈ శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading