శృంగారం కన్నా అదే బెస్ట్... సర్వేలో ఆసక్తికర విషయాలు

ఓ ట్రావెల్ సైట్ నిర్వహించిన సర్వేలో సెక్స్ కన్నా హాలీడేస్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తేలడం ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: September 20, 2019, 4:37 PM IST
శృంగారం కన్నా అదే బెస్ట్... సర్వేలో ఆసక్తికర విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళలు, పరుషులకు శృంగారం అంటే ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. శృంగార సాగరంలో తేలిపోవాలని... ఆ మధురానుభూతిని ఆస్వాదించాలనుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే శృంగారంలో పాల్గొనేందుకే చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కాని ఈ విషయంలో ఓ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఓ కొత్త సర్వేలో ఆస్ట్రేలియాకు చెందిన స్త్రీలు, పరుషులు తమకు సెక్స్ కంటే హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడమే ఇష్టమని తెలిపారు. ఓ ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో ఆస్ట్రేలియాకు చెందిన 1000 మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సర్వేలో 57 శాతం మంది సెక్స్ కంటే హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికే మొగ్గు చూపగా... 25 శాతం సెక్స్ కావాలని కోరుకున్నారు. 7 శాతం మంది ఎక్సర్‌సైజ్‌లు, బిగ్ నైట్ ఔట్‌లపై 6 శాతం ఆసక్తి చూపారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సర్వేలో పురుషుల కంటే స్త్రీలే శృంగారంపై ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. మహిళలు 69 శాతం సెక్స్‌కావాలని కోరుకోగా... పురుషుల్లో కేవలం 45 శాతం మంది మాత్రమే హాలీడేస్ కంటే సెక్స్ బెటర్ అని అభిప్రాయపడ్డారు.

హాలీడేస్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారిలో 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి శాతం 64 ఉండగా... 18 నుంచి 24 మధ్య వయసున్న వారిలో సెక్స్‌పై ఆసక్తి 46 శాతం ఉంది. 45 నుంచి 54 ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువ శాతం సెక్స్‌పై ఆసక్తి చూపడం గమనార్హం. వీరి శాతం 30కు పైగా ఉంది. ఇక సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే 18 నుంచి 24 ఏళ్ల వయసున్న వాళ్లు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉండటం ఆసక్తికరమైన విషయం. ఈ విషయంలో దక్షిణ అస్ట్రేలియాలో 28 శాతం, క్వీన్స్‌ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియా 27 శాతం, విక్టోరియాలో 21 శాతం శృంగారం వైపు ఆసక్తి చూపారు.First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>