భార్యతో గొడవ పడి శృంగారం చేశారో.. మీ దాంపత్య జీవితం మరింత..

Sex Education: వాదన జరిగాక ఇరువురు మళ్లీ కలిసిపోయేందుకు ఇది చక్కని మార్గమని, అప్పుడు చేసుకునే శృంగారం ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: August 11, 2019, 6:35 PM IST
భార్యతో గొడవ పడి శృంగారం చేశారో.. మీ దాంపత్య జీవితం మరింత..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భాగస్వామితో హ్యాపీగా, రొమాంటిక్‌గా ఉండాలని కోరుకోవడం సహజం. కానీ, అప్పుడప్పుడు చిన్న చిన్నగొడవలు వస్తుంటాయి. వాదించుకోవడం లాంటివి ఎక్కవు అవుతుంటాయి. అయితే, ఆ వాదన శ్రుతి మించకుండా ఓ మోతాదులో ఉంటేనే దాంపత్య జీవితానికి మంచిది. అంతేకాదు.. భార్యభర్తలు వాదులాడుకొని, ఆ తర్వాత సమస్యను పరిష్కరించుకుంటే ఇంకో ప్రయోజనం కూడా ఉందట. ఎక్కువ మంది భాగస్వాములు.. వాదనకు దిగిన తర్వాత కాసేపటికి వారితో శృంగారం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. వాదన జరిగాక ఇరువురు మళ్లీ కలిసిపోయేందుకు ఇది చక్కని మార్గమని, అప్పుడు చేసుకునే శృంగారం ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. వాషింగ్టన్ డీసీకి చెందిన ఫ్యామిలీ వైద్యనిపుణురాలు, సైకాలజిస్టు మెరిసా నెల్సన్ ప్రకారం.. రొటీన్ సెక్స్‌ నుంచి ఇది ఉపశమనం కలిగించడమే కాకుండా, మామూలుగా సెక్స్ చేసుకునే సమయంలో కాకుండా వాదులాడుకున్నాక చేసుకునే సెక్స్‌ వల్ల ఆక్సిటోసిన్ ఎక్కువగా విడుదల అవుతుంది.

ఒకవేళ భార్యాభర్తల మధ్య వాదన జరిగితే కాసేపటికి.. భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఎక్కువ సంతృప్తి కలుగుతుందని తన వద్దకు వచ్చేవారికి సూచిస్తుంటానని ఆమె చెప్పారు. వాదన జరిగేప్పుడే దంపతుల మధ్య ప్రేమానురాగాల బంధం మరింత బలపడుతుందని, దానికి కారణం భావోద్వేగమేనని వివరించారు. అయితే, సెక్సువల్ ఆనందం పొందే అంశం.. వాదన తీవ్రతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>