అక్కడ పదమూడేళ్లకే వర్జినిటీ కోల్పోతున్న బాలురు.. కావాలనే..

వర్జినిటీ కోల్పోతున్న వారిలో నల్ల జాతీయులే ఎక్కువగా ఉన్నారని ఆ సర్వే తేల్చింది. తెల్ల జాతీయులతో పోల్చితే 79 శాతం ఎక్కువ మంది పదమూడేళ్లకు ముందే వర్జినిటీ కోల్పోతున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 3:01 PM IST
అక్కడ పదమూడేళ్లకే వర్జినిటీ కోల్పోతున్న బాలురు.. కావాలనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలో 13 ఏళ్లకే చాలా మంది బాలురు వర్జినిటీ కోల్పోతున్నారట. ఓ అధ్యయనం తెలిపిన వివరాల ప్రకారం 13 ఏళ్లు వచ్చేసరికి దాదాపు 7 శాతం మంది సెక్స్‌లో పాల్గొంటున్నారు. యూత్ రిస్క్ బిహేవియర్ సిస్టం సర్వే సంస్థ 19,916 మంది విద్యార్థులపై సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం బాలురు అమ్మాయిలతో సెక్స్‌ చేస్తున్నారట. ఇక, వర్జినిటీ కోల్పోతున్న వారిలో నల్ల జాతీయులే ఎక్కువగా ఉన్నారని ఆ సర్వే తేల్చింది. తెల్ల జాతీయులతో పోల్చితే 79 శాతం ఎక్కువ మంది పదమూడేళ్లకు ముందే వర్జినిటీ కోల్పోతున్నారు. ఆ సందర్భాల్లో ఎలా అనిపించిందని వారిని ప్రశ్నించగా.. 55 శాతం మంది మళ్లీ కావాలని, 37 శాతం మంది మిశ్రమ భావనలు కలిగాయని, 8 శాతం మంది మరోసారి సెక్స్ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది.

తల్లిదండ్రులు సెక్స్ గురించి పిల్లలకు చెప్పి, దాని పర్యవసానాలను వివరిస్తేనే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం.. సెక్స్ చేయాల్సిన కనీస వయసు 16-18 ఏళ్ల మధ్య ఉంది. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో 16 ఏళ్లుగా, కొన్ని రాష్ట్రాల్లో 18 ఏళ్లుగా ఉంది. యూకేలో అయితే 16 ఏళ్ల లోపు వారెవరైనా సెక్స్ చేయకూడదు.
First published: May 15, 2019, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading