Home /News /life-style /

NEW STUDIES LINK CELL PHONE RADIATION WITH CANCER

అతిగా సెల్ ఫోన్ వాడకం.. క్యాన్సర్‌కి కారకం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నో అవసరాలను తీర్చి అంతర్జాలాన్ని అరచేతిలోకి తెచ్చిన మొబైల్.. అరుదైన సమస్యలను కూడా తీసుకొస్తుంది.

    ప్రజెంట్ లైఫ్‌లో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం అతికష్టం. చాలామంది భోజనం లేకుండానైనా జీవించగలరేమో కానీ.. సెల్ లేని రోజుని ఊహించలేకపోతున్నారు. కామన్ మ్యాన్ నుంచి కాస్ట్లీ పర్సన్ వరకూ ప్రతిఒక్కరి ఫస్ట్ ఛాయిస్ మొబైల్. ఎన్నో అవసరాలను తీర్చి అంతర్జాలాన్ని అరచేతిలోకి తెచ్చిన ఈ సాధనం.. అరుదైన సమస్యలను కూడా తీసుకొస్తుంది. ఇప్పటికే మెదడు, చెవి సంబంధిత సమస్యలు వస్తాయని ఎన్నో ప్రయోగాలు తేల్చినప్పటికీ.. తాజాగా క్యాన్సర్ కూడా వస్తుందని తేలింది..
    కొన్ని యూనివర్సిటీలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ నిజం తెలిసింది. మొదట్లో ఎలుకలు, మూగజీవాలపై ప్రయోగాలు చేసిన పరిశోధకులు.. కొన్ని నెలల అనంతరం వాటి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ప్రయోగానికి ముందు ఆరోగ్యంగా ఉన్న జీవులు.. అనంతరం, ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాయి. అంతేకాదు.. క్యాన్సర్ లక్షణాలు కూడా బయటపడ్డాయి. అయితే.. మగఎలుకలతో పోలిస్తే.. ఆడ ఎలుకల్లో ఈ లక్షణాలు తక్కువగా గుర్తించారు.
    కాబట్టి.. సెల్ ‌ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా మొబైల్ యూజ్ చేస్తే.. శరీరంలోని ఏదైనా ఓ భాగానికి కేన్సర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
    First published:

    Tags: Cancer, Health Tips, Women health

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు