• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • NEW INTERESTING FACTS ON RELATIONSHIP BETWEEN EVOLUTION OF HUMAN AND DOGS AK GH

Dogs: ఆ విషయంలో మనుషుల కంటే కుక్కలే ముందు

Dogs: ఆ విషయంలో మనుషుల కంటే కుక్కలే ముందు

ప్రతీకాత్మక చిత్రం

Dogs: మానవులు, కుక్కల పరిణామ క్రమాల్లో కొన్ని పోలికలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుక్కల పరిణామ క్రమం, వైవిద్యం (డైవర్సిటీ) 11,000 సంవత్సరాల క్రితమే మొదలైందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. చివరి మంచు యుగం ముగిసిన సమయానికే కుక్కల్లో ఉన్న డైవర్సిటీ ఇప్పటికీ ఉందట. పురాతన DNAపై చేసిన గ్లోబల్ స్టడీ ఈ వివరాలను గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్‌టిట్యూట్ నేతృత్వంలోని ఒక పరిశోధనా బృందం 27 కుక్కల జన్యు క్రమాలను విశ్లేషించింది. వాటిలో కొన్ని దాదాపు 11,000 సంవత్సరాల క్రితం యూరప్, సైబీరియా అంతటా నివసించిన జాతులకు చెందినవని ఉన్నాయి. ఇతర జంతువులను మనుషులు మశ్చిక చేసుకోక ముందే వివిధ జన్యుక్రమాలతో ఉన్న ఐదు రకాల కుక్క జాతులు అప్పట్లో ఉన్నాయని వారు కనుగొన్నారు.

మనుషుల కంటే ముందే...
ఈ రోజు మనకు బయట కనిపించే వీధి కుక్కల్లో కొన్ని మంచు యుగం నాటి నుంచి జీవక్రమాన్ని కొనసాగిస్తున్నాయని క్రిక్స్ ఏన్షియంట్ జెనోమిక్స్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకుడు పొంటస్ స్కోగ్లండ్ చెబుతున్నారు. మంచుయుగం ముగిసే సమయానికి కుక్కలు ఉత్తరార్ధగోళం మొత్తానికీ వ్యాపించాయని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వైవిధ్యం (డైవర్సిటీ) చాలా ముందుగానే మొదలైనట్టు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మనుషులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టడానికి ముందు రాళ్లతో వేటాడే రాతియుగం నాటికే కుక్కల్లో జీవవైవిద్యం ప్రారంభమైందని చెప్పారు.

తోడేళ్ల నుంచి విడిపోయాయి
తోడేళ్ల నుంచి కుక్కలు ఏ సమయంలో, ఎక్కడ ఉద్భవించాయనేది అధ్యయనంలో తెలపలేదు. జన్యు డేటా విశ్లేషణల ప్రకారం సుమారు 25,000 నుంచి 40,000 సంవత్సరాల క్రితం తోడేళ్ల జాతి నుంచి కుక్కలు వేరుపడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పందులు, ఇతర జంతువులను వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో మానవులు సాదుకోవడం మొదలుపెట్టారు. కానీ తోడేళ్ల నుంచి కుక్కలు ఏదో ఒక ప్రదేశంలోనే వేరుపడి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. అన్ని జాతుల కుక్కలకూ ఒకే ఒక్క సాధారణ పూర్వీకులుగా తోడేళ్ల జాతి ఉండే అవకాశం ఉంది. అంతరించిపోయిన ఆ పాత జాతి తోడేళ్ల నుంచే కుక్కలు జన్యువులను పంచుకున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాదు జంతువుగా మారిన కుక్కలకు తోడేళ్ల నుంచి జీన్స్ ఫ్లో తక్కువగా ఉండగా, పెంపుడు కుక్కల నుంచి తోడేళ్లకు జీన్స్ ఫ్లో ఎక్కువగా ఉందని వారు గుర్తించారు.

కన్వర్జెంట్ పరిణామం
అస్థిపంజరం నుంచి సేకరించిన పురాతన DNAలను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన పరిణామ క్రమాలను అంచనా వేయగలిగారు. ఉదాహరణకు.. నాలుగు లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం యూరోపియన్ కుక్కలు చాలా వైవిధ్యంగా ఉండేవి. అవి చాలా భిన్నమైన నీయర్ ఈస్టర్న్, సైబీరియన్ కుక్కల జాతి నుంచి ఉద్భవించాయి. కానీ కాలక్రమేణా ఈ వైవిధ్యం పోయింది. ప్రస్తుతం మనం చూస్తున్న యూరోపియన్ కుక్కలు అసాధారణమైన ఆకారాలు, రూపాల్లో ఉన్నప్పటికీ, జన్యుపరంగా వాటి డైవర్సిటీ తగ్గిపోయిందని అధ్యయన బృంద సభ్యుడు అండర్స్ బెర్గ్స్ట్రోమ్ చెప్పారు. ఈ వైవిధ్యం డాగ్ సబ్సెట్ నుంచే వచ్చిందని ఆయన తెలిపారు.

మానవ పరిణామ క్రమంతో సంబంధాలు
మానవులు, కుక్కల పరిణామ క్రమాల్లో కొన్ని పోలికలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు... చింపాంజీల కంటే మానవుల్లో ఎక్కువ రకాల జన్యువులు ఉన్నాయి. ఇవే మనుషుల్లో సెలైవరీ అమైలేస్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ను సృష్టించాయి. ఇది ఎక్కువ మొత్తంలో ఉండే పిండి పదార్ధాలను విచ్ఛిన్నం చేసేందుకు జీర్ణక్రియలో మనకు సహాయపడుతుంది. ఇదేవిధంగా తోడేళ్లతో పోలిస్తే, వాటి నుంచి ఉద్భవించిన మొదటి తరాల కుక్కల్లో ఎక్కువ జన్యువులు ఉన్నాయి. అవి మనుషులకు పెంపుడు జంతువులుగా మారిన తరువాత, వాటి ఆహారం వ్యవసాయ జీవితానికి అనుగుణంగా మారడంతో ఈ ధోరణి కాలక్రమంలో పెరిగింది.

గత పరిశోధనల్లో తేలిన అంశాలు
మానవుల వలసలు కుక్కల జాతుల విస్తరణకు దోహదపడ్డాయి. వలసల వల్ల మంచు ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆర్కిటిక్ స్లెడ్ కుక్కలు అధిక కొవ్వు ఉండే ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి వీలుగా కొత్త రకం జీవక్రియ మార్గాలను అభివృద్ధి చేసుకున్నాయని గత పరిశోధనల్లో తేలింది. ఉత్తర అమెరికాకు చెందిన మొదటి తరం కుక్కలు సైబీరియాలో ఒక జాతి నుండి ఉద్భవించాయని 2018లో చేసిన పరిశోధల్లో తెలిసింది. కానీ యూరోపియన్ల రాక తరువాత ఆ జాతి పూర్తిగా అంతరించిపోయిందని అధ్యయనంలో పేర్కొన్నారు.

అధ్యయనంతో మనకూ ఉపయోగం
పురాతన DNA అధ్యయనం (ancient DNA study) మన పూర్వీకులపై చేసిన అధ్యయనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి అధ్యయనాలు కుక్కల పరిణామ క్రమాలపై కూడా పరిశోధనలు చేయడానికి ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు భావించారు. కుక్కల పరిణామ క్రమానికి సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడం వల్ల మన పూర్వీకుల చరిత్ర గురించి కూడా తెలుస్తుందని బెర్గ్స్ట్రోమ్ చెబుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: