ఏ పిల్లలకు పెద్దయ్యాక డయాబెటిస్ వస్తుంది?... కనిపెట్టవచ్చంటున్న పరిశోధకులు

డయాబెటిస్ సమస్యను ముందే గుర్తిస్తే... జరగబోయే చాలా నష్టాల నుంచి బయటపడొచ్చు. కానీ... చాలా మంది కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు పరిశోధకులు చెబుతున్న విషయం వైద్య రంగంలో సంచలనమే.

news18-telugu
Updated: August 9, 2020, 10:48 AM IST
ఏ పిల్లలకు పెద్దయ్యాక డయాబెటిస్ వస్తుంది?... కనిపెట్టవచ్చంటున్న పరిశోధకులు
ఏ పిల్లలకు పెద్దయ్యాక డయాబెటిస్ వస్తుంది?... కనిపెట్టవచ్చంటున్న పరిశోధకులు
  • Share this:
డయాబెటిస్ సమస్య... జన్యుపరంగా రావచ్చు లేదా... ఆహార, ఇతర లైఫ్‌స్టైల్ అలవాట్ల వల్ల రావచ్చు. న్యూయార్క్‌లోని కొందరు పరిశోధకులు (వారిలో ఒకరు భారత సంతతి వారు)... ఏ పిల్లలకు పెద్దయ్యాక టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించే పద్ధతిని అభివృద్ధి చేశారు. తమ అధ్యయన వివరాల్ని నేచర్ మెడిసిన్ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. సాధారణంగా పిల్లలు పుట్టాక... వారికి భవిష్యత్తులో ఏవైనా అనారోగ్యాలు వస్తాయా అనే టెస్టులు చేస్తారు. వాటిని మరింత అభివృద్ధి చేస్తూ... కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా, రాదా అనే విషయాన్ని తేల్చగలుగుతున్నామని పరిశోధకులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, ముందు తరాల వారిలో ఎవరికైనా T1D అనేది అభివృద్ధి చెందితే... పిల్లలకు కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఐతే... చాలా మందికి ఫ్యామిలీ హిస్టరీ తెలియట్లేదు.

అంతర్జాతీయంగా ఏడు చోట్ల 7798 మంది పిల్లలకు పుట్టినప్పటి నుంచి 9 ఏళ్లు వచ్చేలోపు టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని తేల్చారు. ఇది షాకింగ్ విషయమే ఎందుకంటే... డయాబెటిస్ అనేది పెద్ద వాళ్లకే ఎక్కువగా వస్తూ ఉంటుంది. పిల్లలకూ అది వస్తే... తట్టుకోవడం కష్టమే. జన్యుపరమైన అంశాలు, క్లినికల్ అంశాలు, ఫ్యామిలీ డయాబెటిస్ చరిత్ర, పిల్లల్లో ఉండే ఆటోయాంటీబాడీస్ వంటి అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... డయాబెటిస్ వస్తుందో లేదో పరిశోధకులు ముందుగానే చెబుతున్నారు.

ఏ పిల్లలకైతే పెద్దయ్యాక డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందో... వారికి ముందుగానే తల్లిదండ్రులు... డయాబెటిస్ రిస్క్ కౌన్సెలింగ్ ఇవ్వాలనీ, తద్వారా... ఆ వ్యాధిని కంట్రోల్ చేసుకునే అలవాటు వారికి ఏర్పడుతుందని చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్‌లో బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల రక్తంలో సరిపడా ఇన్సులిన్ లేక... రక్తంలో యాసిడ్ పెరుగుతుంది. ఇది సమస్యకు దారితీస్తుంది. తగిన మందులు, ట్రీట్‌మెంట్ ద్వారా... డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుతున్నారు.

మొత్తంగా ఈ పరిశోధనలను బట్టీ... పుట్టే పిల్లల్లో... 40 శాతం పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్లందరికీ ముందు నుంచే సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు వీలవుతుందని పరిశోధకులు తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: August 9, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading