మీకు డయాబెటిస్ ఉన్నప్పుడు, మీ మెడికల్ చెక్‌లిస్ట్ చాలా పొడవుగా ఉంటుంది: ఏ సమయాలలో రక్తంలో షుగర్ స్థాయులు చెక్ చేసుకోవాలి, ప్రతీ భోజనంలో కార్బోహైడ్రేట్లను లెక్కపెట్టుకోవాలి, మందులు తీసుకోవాలి, గ్లూకోజ్ మానిటర్ స్ట్రిప్‌లు మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలి, రక్తపోటు చూసుకుంటూ ఉండాలి … జాబితా కొనసాగుతూనే ఉంటుంది. మీరు రోజూ గమనించాల్సిన అవసరం లేని విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది – అంటే కంటి సమస్యలు, కంటి చూపు పోవడానికి దారి తీసే డయాబెటిస్ సమస్యలు వంటివి. లేదా, మెల్లగా పెరిగే డయాబెటిస్ సమస్యలు ఏవైనా సరే. అవి మెల్లగా ఆవరిస్తాయి, కేవలం స్పష్టమైన లక్షణాలు కనిపించేంత వరకు మీరు వాటిని గమనించరు … అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
మేము మీ మానసిక ఒత్తిడిని పెంచాలని అనుకోవడం లేదు. కానీ, మీకు విషయం చెప్పాలని అనుకుంటున్నాం. కాబట్టి కంగారు పడకండి. ఇదంతా చదివిన తర్వాత మీరు చేయాల్సింది ఒక్కటే పని – మీ ఫోన్ క్యాలెండర్లో ప్రతీ సంవత్సరం కంటి పరీక్షలకు ఒక రోజు నిర్ణయించుకుని (కంటి వైద్యుల వద్ద, కళ్ళజోళ్ళ షాపులో కాదు!) క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం. క్లిష్టమైన సూచనలు కానీ, మీకు మీరే వైద్యులులా లక్షణాల కోసం కఠినమైన నిఘా వేయడం వంటివి అవసరం లేదు.
జాబితా భయంకరంగా కనిపించవచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటిస్ కారణంగా కంటికి వచ్చే సమస్యలను సులభంగా గుర్తించవచ్చు, ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా నివారించవచ్చు కూడా. చాలా వాటిని నియంత్రించవచ్చు, కానీ డయాబెటిస్ ఉన్న చాలా మందికి ఈ విషయం తెలీదు. ఈ అవగాహన రాహిత్యాన్ని మనం పరిష్కరించవచ్చు.
Network18 అలాగే Novartis కలిసి 'Netra Suraksha' – డయాబెటిస్‌పై భారతదేశ పోరాటంకార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా వైద్యరంగం, పాలక వర్గం అలాగే మేధావి వర్గంలో నిపుణులను డయాబెటిక్ రెటినోపతీపై పోరాటానికి మద్దతు కోరడం వీరి ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పని చేయగలిగే వయస్సులో ఉన్న వారిలో అంధత్వానికి అగ్ర కారణం డయాబెటిక్ రెటినోపతీ. మీరు మీ విషయంలో అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో సరైన శ్రద్ధ తీసుకునేలా అవగాహన కోసం ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశాలను ప్రసారం చేయడం, వివరణాత్మక వీడియోలను, కథనాలను ప్రచురించడం ద్వారా సమాచారాన్ని అందిస్తుంది.
దాని కోసం ముందు కన్ను ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుందాం.
కన్నుకు రక్షణగా బయట దృఢమైన పొర ఉంటుంది. కంటిపై ఉన్న స్పష్టమైన, వంగి ఉండే పొరను కార్నియా అంటారు. దాని ప్రధాన పని కంటిని రక్షిస్తూనే కాంతిని ఫోకస్ చేయడం1. కార్నియా ద్వారా ప్రయాణించిన తర్వాత కాంతి యాంటిరియర్ ఛాంబర్ (ఇది యాక్వియస్ హ్యూమర్ అనే రక్షణనిచ్చే ద్రవంతో నిండి ఉంటుంది), ప్యూపిల్ (ఐరిస్‌లో ఉండే రంధ్రం, కంటి రంగు ఉండే భాగం) ద్వారా, ఆ తర్వాత మరింత ఫోకస్ చేసే లెన్స్ ద్వారా వెళ్తుంది. చివరగా, కాంతి కంటి మధ్యలో ద్రవంతో నిండి ఉన్న మరొక ఛాంబర్ (విట్రియెస్) ద్వారా ప్రయాణం చేసి, కంటి వెనుక భాగం రెటీనాను తాకుతుంది1.
రెటీనా తనపై పడిన చిత్రాలను రికార్డ్ చేసి, వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్లుగా మారుస్తుంది, వీటిని మెదడు అందుకుని డీకోడ్ చేస్తుంది. రెటీనాలో ఒక భాగం చిన్న చిన్న వివరాలను కూడా గమనించడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. అత్యంత క్షుణ్ణమైన దృష్టి ఉండే ఈ చిన్ని భాగాన్ని మాక్యులా అంటారు. రెటీనాలో అలాగే దాని వెనుక ఉన్న రక్త నాళాలు మాక్యులాకు పోషణనిస్తాయి1. ఇప్పుడు డయాబెటిస్ కంటికి ఎలాంటి సమస్యలను తీసుకువస్తుందో చూద్దాం.
గ్లకోమా
గ్లకోమా అంటే ఆప్టిక్ నరాన్ని దెబ్బతీసే వ్యాధి—అంటే కంటిని మెదడుతో సంధానించే నరాలు. డయాబెటిస్ ఉంటే గ్లకోమా వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది, చికిత్స త్వరగా చేయించకపోతే దీని వలన కంటి చూపు పోయే ప్రమాదం ఉంది2.
కంటిలో ఒత్తిడి పెరిగినప్పుడు గ్లకోమా వస్తుంది. ఈ ఒత్తిడి వల్ల రెటీనాకు అలాగే ఆప్టిక్ నరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు నొక్కుకుపోతాయి. రెటీనా అలాగే నరం దెబ్బతినడం వలన మెల్లగా కంటి చూపు పోతుంది3.
క్యాటరాక్ట్‌లు
మన కంటిలో ఉన్న లెన్స్‌లు స్పష్టమైన కంటి చూపు కోసం క్లియర్‌గా ఉంటాయి – కానీ వయస్సు పెరిగే కొద్దీ వీటిలోని స్పష్టత మసకబారిపోతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో క్యాటరాక్ట్ అనే అస్పష్ట లెన్స్‌లు ఏర్పడే ఈ ప్రమాదం 2- 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో డయాబెటిస్ లేని వారితో పోలిస్తే ఈ సమస్య చిన్న వయస్సులోనే వచ్చే అవకాశం ఉంది - నిజానికి, ఈ ప్రమాదం డయాబెటిస్ లేని వారితో పోలిస్తే 15-25 రెట్లు ఎక్కువ4. పరిశోధకులు అధిక గ్లూకోజ్ స్థాయుల వలన మన కంటి లెన్స్‌లలో డిపాజిట్లు జరుగుతాయని అంటారు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో క్యాటరాక్ట్‌లు చిన్న వయస్సులోనే రావడమే కాకుండా త్వరగా పెరుగుతుంది కూడా5.
రెటీనోపతీ
డయాబెటిక్ రెటీనోపతీ అంటే డయాబెటిస్ కారణంగా రెటీనాకు వచ్చే సమస్యలను చెప్పడానికి ఉపయోగించే పదం. రెటీనోపతీ రెండు ప్రధాన రకాలు: నాన్ప్రొలిఫరేటివ్ అలాగే ప్రొలిఫరేటివ్. నాన్ప్రొలిఫరేటివ్ రెటీనోపతీలో, చాలా సాధారణ రెటీనోపతీలో కంటి వెనుక భాగంలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి, సంచులను ఏర్పరుస్తాయి. నాన్ప్రొలిఫరేటివ్ రెటినోపతీ మూడు దశలలో ఉంటుంది (తక్కువ స్థాయి, మధ్యస్థ స్థాయి, తీవ్ర స్థాయి), ఈ స్థాయి బ్లాక్ అయ్యేకొద్దీ ఈ తీవ్రత పెరుగుతుంది. దానికి స్పందనగా, కొత్త రక్తనాళాలు రెటీనాలో పెరుగుతాయి. ఈ కొత్త నాళాలు బలహీనంగా ఉండి, రక్తస్రావం కావచ్చు, కంటి చూపును ఆపేయవచ్చు. కొత్త రక్తనాళాల వల్ల స్కార్ టిష్యూ కూడా పెరగవచ్చు. స్కార్ టిష్యూ కుంచించుకుపోయిన తర్వాత, అది రెటీనాను దెబ్బ తీయవచ్చు లేదా దానిని ఉన్న ప్రదేశంలో ఉండనివ్వకుండా చేయవచ్చు, దీనినే రెటీనల్ డిటాచ్మెంట్ అంటారు6.
డయాబెటిక్ రెటీనోపతీ క్లస్టర్లో మాక్యులార్ ఎడిమా ఇంకొకటి. మీరు చదవడానికి, డ్రైవింగ్ చేయడానికి, ముఖాలను చూడటానికి అవసరమైన భాగం మాక్యులా అని మనకి తెలుసు. డయాబెటిస్ వల్ల మాక్యులా వాయవచ్చు, దీనినే డయాబెటిక్ మాక్యులార్ ఎడిమా అంటారు. కాలం గడిచేకొద్దీ, ఈ వ్యాధి కంటిలోని ఈ భాగం చూపును దెబ్బతీయవచ్చు లేదా చూపు పూర్తిగా పోవచ్చు. మాక్యులార్ ఎడిమా అప్పటికే డయాబెటిక్ రెటీనోపతీ ఇతర లక్షణాలు ఉన్న వారిలో వృద్ధి చెందుతుంది2.
డయాబెటిక్ రెటీనోపతీ పెరగడం, తీవ్రమయ్యే అవకాశం వీటి వల్ల పెరుగుతుంది6
:● మీకు చాలా కాలంగా డయాబెటిస్ ఉండటం.
● మీ రక్తంలో షుగర్ (గ్లూకోజ్) స్థాయులు సరైన నియంత్రణలో లేకపోవడం.
● మీకు ధూమపానం అలవాటు ఉండటం లేదా రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉండటం.
కానీ, మేము మాట ఇచ్చినట్టే, మీరు చేయాల్సిందల్లా మీ కంటి వైద్యుల వద్దకు వెళ్ళి సంవత్సరానికి ఒక సారైనా కంటి పరీక్ష చేయించుకోవడం – ఇది సాధారణంగా చేసే నొప్పి లేని కంటి పరీక్ష, మీరు డయాబెటిక్ రెటీనోపతీ అలాగే అంధత్వాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రారంభం ఇక్కడ నుండి చేయండి – మీకు ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి మా ఆన్లైన్ డయాబెటిక్ రెటీనోపతీ స్వీయ చెకప్చేసుకోండి. ఆ తర్వాత News18.comలో Netra Suraksha కార్యక్రమం పేజీని చూడండి. ఇందులో మెటీరియల్‌లు అన్నీ (రౌండ్ టేబుల్ చర్చలు, ఎక్స్‌ప్లెయినర్ వీడియోలు, కథనాలు) అందుబాటులో ఉంటాయి. మీ ఆరోగ్యం విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. డయాబెటిస్ చికిత్స విషయంలోలానే చిన్న చిన్న జాగ్రత్తలే కాపాడుతాయి. కాబట్టి సంకోచించవద్దు. మీ డయాబెటిక్ రెటీనోపతీ, అంధత్వాన్ని నియంత్రించడంలో మొదటి చర్య ఈరోజే తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.