వేపనూనెతో దోమలను ఇలా తరిమికొట్టండి...

World Mosquito Day: వేపనూనె, కొబ్బరి నూనెను సమపాళ్లల్లో తీసుకొని పడుకునే ముందు శరీరానికి అప్లై చేసుకోవాలి. అలా చేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు వేపనూనె ప్రభావంతో దోమలు మీ దరిచేరకుండా ఉంటాయి.

news18-telugu
Updated: August 20, 2019, 3:59 PM IST
వేపనూనెతో దోమలను ఇలా తరిమికొట్టండి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 20, 2019, 3:59 PM IST
దోమలను తరిమికొట్టేందుకు సహజపద్ధతులను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేపనూనె దోమల పాలిట శత్రువు, మస్కిటో కాయిల్స్, స్ప్రేల బదులు వేపనూనెను వాడితే దోమలను నివారణ సహజ పద్ధతులతోనే సాధ్యం అవుతుందని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. అయితే వేపనూనెను దోమల నియంత్రణకు ఎలా వాడాలో చూద్దాం. ముందుగా వేపనూనె, కొబ్బరి నూనెను సమపాళ్లల్లో తీసుకొని పడుకునే ముందు శరీరానికి అప్లై చేసుకోవాలి. అలా చేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు వేపనూనె ప్రభావంతో దోమలు మీ దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా వేపనూనే శరీరానికి ఎలాంటి హానీ కలిగించదు. అలాగే వేప నూనె ప్రభావంతో దోమలు ఆ ప్రదేశం నుంచి దూరమవుతాయ. అయితే ఈ విషయాన్ని ప్రముఖ జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించడం విశేషం.

అంతేకాదు వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాండీ ప్రోటోజోల్ గుణాలు ఉన్నాయి. అలాగే వేపనూనెలో కాస్త దూదిని ముంచి ఇంట్లోని ప్రతి గదిలో నాలుగు మూలలా పెడితే దోమలు ఆ గదిలోకి రావు. అలాగే నిలువఉన్న నీళ్లలో వేపనూనెను చల్లితే దోమలు వృద్ధిని అరికట్టవచ్చు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...