తలపై చుండ్రు ఫంగస్ వల్ల వస్తుంది. ఈ చుండ్రును వదిలించుకోవడం కష్టతరమే. ఎందుకంటే అది త్వరగా పోదు. ఈ చలికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఎందుకంటే ఈ సమయం శిలీంధ్రాలకు అనుకూలం. దీన్ని చులకన చేస్తే.. హెయిర్ లాస్ బాగా అవుతుంది.
రోజూ షాంపూ చేస్తే.. చుండ్రు సమస్య పోతుందని అపోహ పడతారు. డాండ్రఫ్‌కు చెక్ పెట్టాలంటే.. వేప సహజమైన ఔషధ మూలిక. ఇది జుట్టును బలపరుస్తుంది కూడా. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరస్ లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, చుండ్రు సమస్యకు వేపను ఎలా వాడాలో తెలుసుకుందాం.
వేపాకులను నమలడం.. ఇది ఇబ్బందికర విషయమే అయినా..చుండ్రు ఉన్నవారు రోజూ వేప పూవును తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే చేదును తగ్గించడానికి కాస్త తేనె కలుపుకుని తీసుకోవచ్చు. వేపాకు, పువ్వును నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు.
వేపనూనె.. కొబ్బరి నూనెలో కొన్ని వేప ఆకులు వేసి మరిగించిన తర్వాత దాన్ని కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించి.. సులభంగా ఇంట్లో వేపనూనెను తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ మరీ ఎక్కువగా వేసుకోవద్దు. దీన్ని సన్‌లైట్ పడని ప్రాంతంలో పెట్టుకోవాలి. రాత్రి నిద్రపోయే సమయంలో తలకు ఈ ఆయిల్‌తో మర్దనా చేసుకోవాలి. ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది.
వేప, పెరుగు కలిపి చుండ్రును వదిలించుకోవడానికి హెయిర్‌కు బాగా ఉపయోగపడుతుంది.. ఇది చుండ్రుకు బెస్ట్ ట్రీట్మెంట్. వేప ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కాస్త పెరుగు కలుపుకుని తల మొత్తం పట్టించి.. 15–20 నిమిషాల తర్వాత తలను బాగా కడిగేయండి.
మాస్క్.. కొన్ని వేపకులు తీసుకుని, వాటిని మిక్సిలో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీంట్లో ఒక టీస్పూన్ తేనెను కలిపి జుట్టు మొత్తంగా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత హెడ్‌బాత్ చేసుకోవాలి.
కండీషనర్.. వేప హెయిర్ కండీషనర్ తయారు చేయడం చాలా సులభం. కొన్ని వేపాకులను నీటిలో బాగా మరిగించాలి. షాంపూ చేసిన తర్వాత ఈ నీటితో మసాజ్ చేయాలి. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
షాంపూ.. చుండ్రు సమస్యలకు ఏ రెమిడీ పనిచేయకపోతే.. రెడీమేడ్ వేప ఆధారిత షాంపూలు అందుబాటులో ఉంటాయి. వీటిని వారానికి 2–3 సార్లు వాడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.