Home /News /life-style /

NAVRATRI 2021 HEALTHY TEETH NAVRATRI SPECIAL FOOD AND BEVERAGES FOR ORAL HEALTH GH SK

Healthy Teeth: నవరాత్రి వేళ దంతాలను నిర్లక్ష్యం చేయకండి.. ఈ ఫుడ్ తింటే మీ పళ్లు సేఫ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navratri special food: ఉపవాసం చేస్తున్నప్పుడు డైట్ పూర్తిగా మారుతుంది కాబట్టి ఈ సమయంలో దంత అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని దంత వైద్యులు సూచిస్తున్నారు. అలాగే దంత అనారోగ్యానికి దారి తీయని ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
పుష్టిగా ఆహారం తినాలన్నా.. కండలు పెంచాలన్నా ఆరోగ్యమైన దంతాలు (Healthy teeth) ఉండటం చాలా ముఖ్యం. నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో ఏ ఆహార పదార్థాలూ తినలేం. నిజానికి మనం తినే తిండికి దంత ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉంటుంది. అందుకే మనం తినే ఆహారం, అలాగే ఆహార అలవాట్ల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత నవరాత్రుల (Navratri 2021) సమయంలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేస్తున్నప్పుడు డైట్ పూర్తిగా మారుతుంది కాబట్టి ఈ సమయంలో దంత అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని దంత వైద్యులు సూచిస్తున్నారు. అలాగే దంత అనారోగ్యానికి దారి తీయని ఫుడ్స్ (Food) తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నవరాత్రి సమయంలో దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఫుడ్స్, బెవరేజెస్ తీసుకోవాలో చూద్దాం.

టమాటాలతోనూ మీ ముఖాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దుకోవచ్చంట..ఎలాగో తెలుసుకోండి

1. పండ్లు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న పండ్లు

పండ్లు (fruits) దంతాలు, చిగుళ్ళను శుభ్రంగా ఉంచుతాయి. అలాగే పండ్లు నోటిలో లాలాజలం కంటిన్యూయస్‌గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. కాల్షియం, ఫాస్ఫేట్ కలిగి ఉంటే లాలాజలం.. బ్యాక్టీరియా ఆమ్లాల కారణంగా ఖనిజాలను కోల్పోయిన పళ్ళ ప్రాంతాలకు తిరిగి ఖనిజాలను పంపిస్తుంది. అధిక స్థాయిలో విటమిన్-సి కలిగిన నారింజ, ద్రాక్షపండు తినడం ద్వారా నోటిలోని రక్త నాళాలు, కనెక్టివ్ టిష్యూ బలోపేతం అవుతాయి. ఫలితంగా చిగుళ్ల వాపు తగ్గుతుంది.

2. మజ్జిగ, పెరుగు, జున్ను

నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో మజ్జిగ, పెరుగు, జున్ను బాగా దోహదపడతాయి. అత్యంత శక్తివంతమైన లాలాజలం నోటిలోని అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది. ఇక ఈ ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో పుదీనా కలుపుకుని తాగితే నోటి శుభ్రత పెరుగుతుంది.

Uncooked Vegetables: సరిగా ఉడికించి తినకపోతే.. హానికరంగా మారే  కూరగాయలు ఇవే

3. కొబ్బరి నీరు

పోషకాలు, యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలు అందించడంలో కొబ్బరినీళ్లకు ఏదీ సాటి రాదు. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఉపవాసం సమయంలో మిమ్మల్ని ఎక్కువ సేపు హైడ్రేటెడ్ (hydrated) గా ఉంచుతుంది. అలాగే ఉపవాసానికి సంబంధించిన తిమ్మిరిని/ కడుపు నొప్పిని నివారిస్తుంది.

4. మఖానా లేదా ఫాక్స్ నట్స్(fox nuts)

ఆరోగ్యకరమైన ప్రోటీన్, అవసరమైన పోషకాలు కోసం ఫాక్స్ నట్స్ (తామర గింజలు) తరచూ తినండి.

తిన్న వెంటనే కడుపులో సమస్యలు మొదలవుతున్నాయా? అయితే ఈ చిట్కాలు  పాటించండి

5. బాదం, వాల్‌నట్, పిస్తా వంటి నట్స్

అధిక ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లు పుష్కలంగా లభించే బాదం వాల్‌నట్ పిస్తా వంటివి తినండి.

6. సలాడ్స్

ఫైబర్ అధికంగా ఉండి, నోటిని శుభ్రపరిచే సలాడ్స్ తినడం దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్స్ ని ఆరోగ్యకరమైన నోటి బ్యాక్టీరియా (oral bacteria) తినే ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్ అని కూడా అంటుంటారు. సలాడ్ మరింత నైట్రేట్ ఉత్పత్తి చేసి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. దీనివల్ల నోటిలో నైట్రిక్ ఆక్సైడ్ పెరిగి ఆరోగ్యకరమైన దంత మైక్రోబయోమ్‌లు ఉత్పత్తి అవుతాయి.

Egg For Heart Health: గుడ్డు తింటే గుండెకు మంచిదా..కాదా..ప్రతిఒక్కరూ  తెలుసుకోండి

7. గ్రీన్ మరియు బ్లాక్ టీ
ఈ టీలలో ప్లేక్ (plaque) బ్యాక్టీరియాతో ఇంటర్ యాక్ట్ అయ్యే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా పెరగకుండా చేసి యాసిడ్ తయారు కాకుండా చేస్తాయి.

8. అమరాంత్ రోటీలు, క్వినోవా పులావ్(quinoa pulao)
ఈ ఆహార పదార్థాలు మీ డైట్ లో ఫైబర్, నాణ్యమైన ప్రోటీన్లను పెంచుతాయి.

9. విత్తనాలు(seeds)
విత్తనాలు ఆకలి దూరం చేస్తాయి. ఎండుద్రాక్ష, నట్స్ ప్రేగుకు ప్రీబయోటిక్ ఫైబర్‌ను అందిస్తాయి.

10. హైడ్రేషన్
మీరు ఉపవాసం చేసే సమయంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఒక బాటిల్ నీళ్ళు ఎప్పుడూ మీ పక్కనే ఉంచుకుని అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. రుచి కోసం ఇందులో నిమ్మ రసం, సబ్జా విత్తనాలను యాడ్ చేసుకోవచ్చు.

ఆహార నియమాలతో పాటు ఉపవాసం చేస్తున్న సమయంలో చక్కగా నిద్ర పోవడం ద్వారా తల నొప్పులకు చెక్ పెట్టొచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Dussehra 2021, Life Style, Lifestyle, Navratri 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు