Shivratri 2021: శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి..

ఫైల్ ఫోటో

శివరాత్రిని పురస్కరించుకుని చాలా మంది ఉపవాసాలు ఉంటారు. అయితే ఇప్పటికే ఉపవాసాలు ఉండి మళ్లీ ఉంటున్నవారికి.. కొత్తగా ఉపవాసాలు చేయబోయే వారికి కొన్ని సూచనలు.

  • News18
  • Last Updated :
  • Share this:
    భారతదేశపు అతిపెద్ద పండుగలలో శివరాత్రి ఒకటి. శివరాత్రిని పురస్కరించుకుని చాలా మంది ఉపవాసాలు ఉంటారు. అయితే ఇప్పటికే ఉపవాసాలు ఉండి మళ్లీ ఉంటున్నవారికి.. కొత్తగా ఉపవాసాలు చేయబోయే వారికి కొన్ని సూచనలు. ఉపవాసాలప్పుడు ఏం తినాలనేదానిపై కచ్చితంగా దృష్టి సారించాలి. తొమ్మిది రోజుల పాటు ఆహారం ఏం తీసుకోకుండా నిష్టగా ఉపవాసం ఉండి.. తర్వాత ఆహారం తీసుకుంటే దానికి మన శరీరం ఎలా సహకరిస్తుందనేది సందేహమే.

    అయితే కొత్తగా ఉపవాసం చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుని శివరాత్రి నిష్టగా పాటించొచ్చు.

    1. కఠినంగా ఉండే ఉపవాసాలు చేయకపోవడమే మంచిది. అంటే.. కొంతమంది నీళ్లు కూడా ముట్టుకోకుండా వ్రతం చేస్తారు. అయితే కొత్తగా చేసేవాళ్లు అలా చేయడం మంచిది కాదు. ఈ సమయంలో దానిని చేయకపోవడమే ఉత్తమం.

    2. కరోనా కాలం కాబట్టి రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం ఎంతో అవసరం. అందుకే మన బాడీని డీ హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి.



    3.పొడి గింజలు పోషకవిలువలున్న ఆహారం. అవి మన బాడీకి ఎంతో శక్తినిస్తాయి. ఉపవాసం సమయంలో వీటిని తినొచ్చు. రోజూవారి మీరు తీసుకునే ఆహారంలో.. బాదం, వాల్నట్, ఎండు ద్రాక్ష వంటివి ఉండేలా చూసుకోండి.

    navaratri, navaratri fastings, navaratri food, life style, fastings, diet, proteen food, fasting tips
    ప్రతీకాత్మక చిత్రం


    4. వ్రతం చేసే సమయంలో కుట్టు (కేరళ, తమిళనాడు లో ఫేమస్ వంటకం), సాబుదానా తో చేసిన పదార్థాలను తీసుకోండి. అందులో ఉండే హై క్యాలరీలు మీకు ఆకలి కాకుండా నిలువరిస్తాయి.

    5. ఆకలేస్తుందేమోననే భయంతో అంతా ఒకేసారి తినేయొద్దు.. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినేలా చూసుకోవడం ఉత్తమం.

    6. సహజ పానీయాలు తీసుకోండి. మజ్జిగ, లస్సీ, షెర్బత్ లేదా పండ్ల రసాల వంటివి తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అంతేగాక శరీరానికి అవసరమయ్యే శక్తి కూడా అందుతుంది.
    Published by:Srinivas Munigala
    First published: