హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Natural vs Organic Foods: హెల్త్ కేర్ తీసుకునేవాళ్లు తప్పక చదవాలి.. నేచురల్, ఆర్గానిక్ ఫుడ్‌ రెండూ ఒకటేనా..? వీటిని ఎలా గుర్తించాలంటే..?

Natural vs Organic Foods: హెల్త్ కేర్ తీసుకునేవాళ్లు తప్పక చదవాలి.. నేచురల్, ఆర్గానిక్ ఫుడ్‌ రెండూ ఒకటేనా..? వీటిని ఎలా గుర్తించాలంటే..?

నేచురల్, ఆర్గానిక్ ఫుడ్ మధ్య తేడా ఏంటి..?

నేచురల్, ఆర్గానిక్ ఫుడ్ మధ్య తేడా ఏంటి..?

ఆర్గానిక్‌ ప్రొడక్ట్ అంటే ఏంటి, నేచురల్‌ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆర్గానిక్‌ తరహాలోనే నేచురల్‌ ఫుడ్‌లో కూడా సేఫ్టీ, హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయా..? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో ఫుడ్‌ నుంచి స్కిన్‌ కేర్‌ వరకు ఏ ప్రొడక్ట్స్ గురించి ఆరా తీసినా ఆర్గానిక్‌ అనే పేరు వినిపిస్తోంది. లేదంటే నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్ అంటున్నారు. అయితే చాలామంది ఇవి రెండూ ఒకటి అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఆర్గానిక్‌ ప్రొడక్ట్ అంటే ఏంటి, నేచురల్‌ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆర్గానిక్‌ తరహాలోనే నేచురల్‌ ఫుడ్‌లో కూడా సేఫ్టీ, హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయా..? వంటి వివరాలు తెలుసుకుందాం.

* ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్

USDA నేషనల్ ఆర్గానిక్ ప్రోగ్రామ్(NOP), FSSAI ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌లను.. ‘భవిష్యత్తు తరాలను మెరుగుపరచడానికి పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడానికి నేల, నీరు, పునరుత్పాదక వనరులను సంరక్షించే రైతులు ఉత్పత్తి చేసినవి’ అని నిర్వచించాయి. ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌లు జీవవైవిధ్యం, నేల ఆరోగ్యం, రసాయన రహిత ఇన్‌పుట్‌లు మొదలైన వాటిపై దృష్టి సారించే సమగ్ర వ్యవసాయ పద్ధతుల నుంచి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా, పర్యావరణం, సోషల్లీ రెస్పాన్సిబుల్‌ విధానంలో ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌లు ఉత్పత్తి అవుతాయి.

ఇదీ చదవండి: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


* నేచురల్‌ ప్రొడక్ట్స్

నేచురల్‌ ప్రొడక్ట్స్‌ లేబుల్‌తో కనిపించేవి తక్కువ మొత్తంలో, అవసరమైనంత మేరకు మాత్రమే ప్రాసెస్ చేసినవి. వీటిలో సింథటిక్ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంగ్రీడియంట్స్‌, అడిటివ్స్‌ (Additives) ఉండవు. అంటే ఈ ప్రొడక్ట్ ప్యాక్‌లో హానికరమైన రసాయనాలను ఉపయోగించరు. తక్కువ ప్రిసర్వేటివ్స్‌, రసాయనాలు ఉంటాయి. నేచురల్‌ ప్రొడక్ట్‌గా చెప్పాలంటే.. అందులో నేచర్‌లో దొరికే ఇంగ్రీడియంట్స్‌ ఉండాలి. వీటిలో పండ్లు, కూరగాయలు, మాంసాలు, పాల ఉత్పత్తులు ఉన్నాయి. కొన్ని నేచురల్ ప్రొడక్ట్‌లలో మూలికలు, సుగంధాలను కూడా చూడవచ్చు. పర్యవసానంగా సువాసన లేదా రంగులను సహజ పదార్ధాల నుంచి తయారు చేస్తారు. కానీ ఒక ప్రతికూలత ఏమిటంటే.. మన దేశంలో నేచురల్‌ ఫుడ్‌ ఇంకా రెగ్యులేటెడ్‌ అవ్వలేదు. కాబట్టి చాలా మంది తయారీదారులు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కొందరు నిపుణులు అంటున్నారు. ఫుడ్‌ బిజినెస్‌ చేసేవాళ్లు.. ఆర్గానిక్‌ ప్రొడక్షన్స్‌ స్టాండర్డ్స్‌ పాటించని, నాన్‌ ఆర్గానిక్‌ ఇంగ్రీడియంట్స్‌ ఉన్న ప్రొడక్ట్‌లను ఆర్గానిక్‌గా పేర్కొంటూ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

* ప్రధాన తేడాలు..

నేచురల్‌, ఆర్గానిక్‌ అనే పదాలు ఒకే విధంగా ఉండవచ్చు. కానీ అవి వేర్వేరని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌లను సింథటిక్‌ కెమికల్స్‌, సంప్రదాయ పురుగుమందులు, ఎరువులు వినియోగించి ఉత్పత్తి చేయరు. జెనిటికల్లీ మాడిఫైడ్‌ ఆర్గానిస్మ్స్‌(GMOలు) ఉండవు. నేచురల్‌ ప్రొడక్ట్‌లు ఇవన్నీ పాటించకపోయినా.. సింథటిక్ లేదా కృత్రిమ పదార్థాలు ఉండవు. పండ్లు, కూరగాయలు ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌కు ఒక ఉదాహరణ. సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ పండ్లు, కూరగాయలు హానికరమైన సింథటిక్ రసాయనాలు, పురుగుమందులు లేకుండా నేలపై పండిస్తారు. ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌లను ఎప్పుడూ సర్టిఫైడ్‌ కంపెనీలే ధ్రువీకరిస్తాయి. కచ్చితమైన స్టాండర్డ్స్‌ పాటిస్తారు. ఆల్‌ ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌లను నేచురల్‌గా పేర్కొనవచ్చు. నేచురల్‌ ప్రొడక్ట్‌లు అన్నీ ఆర్గానిక్‌ కావు.

* వినియోగదారులు ఏం చేయాలి?

ఒక ప్రొడక్ట్‌ను దానిలోని ఇంగ్రీడియంట్స్‌ ఆధారంగా ఎంచుకోవాలి. దానిపైన పేర్కొన్న లేబుల్‌ ఆధారంగా కాదు. అందులోని పోషకాల గురించి తెలుసుకొని ఏది ముఖ్యమైందో నిర్ణయించుకోవాలి. సాధారణ పురుగుమందు లేదా ఎరువులు కూడా నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. అందుకే ఒక ప్రొడక్ట్ కొనేముందు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

First published:

Tags: Food, Healthy food, Junk food, Organic Farming

ఉత్తమ కథలు