హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Natural Sugar Substitutes: చక్కెరకు బదులు ఇవి .. Fitness కోసం ఇలా చేస్తే సరి...

Natural Sugar Substitutes: చక్కెరకు బదులు ఇవి .. Fitness కోసం ఇలా చేస్తే సరి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Natural Sugar Substitutes: చక్కెరకు బదులు సహజసిద్ధమైన తీపిని తెచ్చే ఇతర పదార్థాలు ప్రకృతిలో ఉన్నప్పుడు ఇలా రసాయనాలు వేసి తయారు చేసిన చక్కెర ఎందుకు.

  • News18
  • Last Updated :

తీపికోసం మనం ఉపయోగించే చక్కెరతో అనారోగ్యాలు, ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి. మరి చక్కెరకు బదులు సహజసిద్ధమైన తీపిని తెచ్చే ఇతర పదార్థాలు ప్రకృతిలో ఉన్నప్పుడు ఇలా రసాయనాలు వేసి తయారు చేసిన చక్కెర ఎందుకు. మన పెద్దలు ఎప్పటి నుంచో చక్కెరకు బదులు తేనె, పళ్లు, బెల్లం వంటివి ఉపయోగిస్తున్నారు. తియ్యని పదార్థాలు అంటే స్వీట్లలాంటి పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తినాలన్న కోరిక పుట్టినప్పుడంతా నీళ్లు ఎక్కువ తాగండి. బెర్రీలు, చియా విత్తనాలు, సబ్జా గింజలు, పండ్లు, డార్క్ చాక్లెట్లు, పెరుగు వంటివి మీ మెనూలో చేర్చుకోండి. దీంతో తీపి పదార్థాలు తినాలనే జిహ్వచాపల్యం తీరుతుంది.

బాగా దాహమేసిందని, అజీర్ణంగా ఉందని మీరు ఏరినేటెడ్ కూల్ డ్రింక్స్ వంటివి తాగుతుంటే మీరు చక్కెర చాలా ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం. సోడా బేస్డ్ కూల్ డ్రింక్స్ తయారీలో టన్నులకొద్దీ చక్కెరను ఉపయోగిస్తారు. కాబట్టి ఇలాంటి శీతలపానీయాలు ఎక్కువ తాగితే అనారోగ్యానికి దారితీస్తుంది. కేకులు, పేస్ట్రీలు, కుకీస్, గులాబ్ జామూన్లు, పాయసం వంటివి ఇష్టంగా లాగిస్తుంటే మీరు షుగర్ లోడెడ్ బాడీలుగా తయారవుతున్నారని గుర్తుంచుకోండి.

షుగర్ లెవెల్స్...

చక్కెరతో తయారైనవి అంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవని అర్థం. ఇలాంటి వాటిలో పోషకాలు అస్సలు ఉండవని గుర్తుంచుకోవాలి. దీంతో బరువు విపరీతంగా పెరుగుతారన్నమాట. అంతేకాదు పంచదార స్థాయిలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే తలనొప్పి, గుండె దడ, ఒబేసిటీ, పంటి సమస్యలు వంటి దీర్ఘకాల సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఇక డయాబెట్స్, క్యాన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదాలు ఎక్కువ.

షుగర్ ఫ్రీ అనేది మాయ..

డాక్టర్లంతా చెప్పే రహస్యం ఇదే. షుగర్ ఫ్రీ (sugar free) అంటే షుగర్ ఉండదని కాదు. ఇతరత్రా పేర్లతో ఇందులో షుగర్ ను జొప్పించి ఉంటారు. షుగర్ ఫ్రీ కదా అని యమ్మీగా ఉందని లాగించేశారో మీకై మీరు అనారోగ్యం కొనుక్కున్నట్టే. అందుకే షుగర్ ఫ్రీ మాయలో పడి, మోసపోకండి. తీపి రుచి రావాలంటే ఆ రుచి తేగల పదార్థాలను ఏవేవో ఇతరత్రా పేర్లతో కలపాల్సిందే.

చక్కెరకు చక్కని ప్రత్యామ్నాయాలు..

చక్కెరకు (sugar) చక్కని ప్రత్యామ్నాయాలు (alternative) మార్కెట్లో చాలానే ఉన్నాయి. తేనె ఇందుకు మంచి విరుగుడు. తేనె వేసుకుని పాలు, టీ, కాఫీ వంటివి తాగచ్చు. అలాగని స్పూన్లకొద్దీ తేనె వేసుకోకండి. ఇందులో ఎక్కువ ఫ్రక్టోస్ (fructose) ఉంటుంది కనుక రీఫైన్డ్ షుగర్ కంటే ఇది ఎక్కువ తియ్యగా ఉంటుంది. ఔషధ గుణాలున్న తేనెను తరచూ తీసుకోవటం మంచిదికూడా. చక్కని పోషకాలున్న తేనె (honey) ఇన్ఫ్లమేషన్ కు విరుగుడుగా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ల గుణాలున్న తేనె మధురంగా ఉన్నప్పటికీ డయాబెటిక్స్ ఉన్నవారు తేనె ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు. మధుమేహం ఉన్నవారు తేనె అతిగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగే ప్రమాదాలున్నాయి.

ఖర్జూరం షుగర్

మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్న ఖర్జూరం షుగర్ (date sugar) ను ఫిట్నెస్ ప్రీక్స్ బాగా కొంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లున్న ఈ షుగర్ ను ఎండు ఖర్జూరాలతో తయారు చేస్తారు. ఫైబర్ అధికంగా ఉన్న ఈ సిరప్ స్మూతీలు, కుకీల్లో మంచి ఫ్లేవర్ కూడా తెస్తుంది. ఇందులో ఫ్రక్టోస్ లెవెల్ చాలా ఎక్కువ, ఒంట్లో చక్కెర నిలువలు తగ్గించుకోవాలనుకున్నవారు దీన్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

కోకోనట్ షుగర్

కోకోనట్ పామ్ తో తయారయ్యే ఈ షుగర్ నాచురల్ స్వీట్నర్ గా పేరుగాంచింది. కొంచెం మట్టి వాసన ఉన్న కోకోనట్ షుగర్ (Coconut Sugar) వేసిన వంటలు ఎర్తీ ఫ్లేవర్లను తెస్తాయి. టీ, కాఫీలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. గట్ హెల్త్ ను మెరుగుపరిచే గుణాలు దీనికున్నాయి. కానీ కెలరీలు మాత్రం చాలా ఎక్కువ కనుక కోకోనట్ షుగర్ ను తక్కువ వాడండి.

మ్యాప్ల్ సిరప్

ఈమధ్యకాలంలో మన మార్కెట్లో కూడా లభిస్తున్న మ్యాప్ల్ సిరప్ (maple syrup) తో చేసిన కుకీలు, ప్యాన్ కేక్ లు భలే వెరైటీగా ఉంటాయి. వైట్ షుగర్ కు ఇది మంచి ప్రత్యామ్నాయం. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లున్న మ్యాప్ల్ సిరప్ డోనట్స్, ఐస్ క్రీమ్స్, స్మూతీల తయారీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. రీఫైన్డ్ షుగర్ తో పోల్చితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఈ సిరప్ ను టీ, కాఫీ, పాయసం వంటివాటిలోనూ ఉపయోగించవచ్చు.

ఫిగ్స్

గోవా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఫిగ్ (fig) ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కెర వేయకుండా ఫిగ్ పాయసం, ఫిగ్ హల్వా, ఫిగ్ బిస్కెట్లు, ఫిగ్ లడ్డూలు వంటివి పండగల్లో చేసుకుంటే మంచిది. ఫిగ్ పళ్లను నీటిలో బాగా నానబెట్టి, ప్యూరీలా చేసి, మీరు చేయాలనుకున్న తీపి వంటకంలోకి చక్కెర బదులు వేసుకుని వండాలి. ఫిగ్ లతో ఎముకలు దృఢమవుతాయి, బ్లడ్ హెల్త్ మెరుగై, డైజెస్టివ్ సిస్టం బాగా పనిచేసేలా చేస్తుంది.

బెల్లం

చక్కెరకు అసలైన సంప్రదాయ ప్రత్యామ్నాయం బెల్లమే. ఇప్పటికీ ఇంట్లో పెద్దవారికి బెల్లం (Jaggery) తో చేసిన తీపి పదార్థాలంటేనే మక్కువ ఎక్కువ. బెల్లం టీ, బెల్లం కాఫీ, అరిసెలు, పాయసం, లడ్డూ వంటి ఎన్నో పదార్ధాల్లోకి బెల్లం పడితే కమ్మగా రుచి ఉంటుంది. ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న బెల్లం తగు మోతాదులో తినడం చాలా మంచిది. రక్త హీనత (anaemic) ఉన్న వారికి బెల్లం అమృతంలా పనిచేస్తుంది. బెల్లం తింటే ఒంట్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాదు సీజనల్ అనారోగ్యాలైన దగ్గు, జలుబుకు బెల్లంతో చేసిన కషాయమే విరుగుడు. అలాగని డయాబెటిక్స్ ఉన్నవారు ఎడాపెడా బెల్లం, బెల్లంతో చేసిన తీపి పదార్థాలు తింటే అమాంతంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

First published:

ఉత్తమ కథలు