Home /News /life-style /

NATURAL SUBSTITUTES FOR YOUR COSMETICS UMG GH

Natural Substitutes: అందరికంటే అందంగా కనిపించాలా..? మీ కోసం ప్రత్యేకంగా చర్మం, ముఖం, జుట్టు నిగారింపు ప్రొడక్ట్స్.. ట్రై చేయండీ..!

మీ అందానికి మరింత నిగారింపు కోసం..

మీ అందానికి మరింత నిగారింపు కోసం..

నేచురల్ ప్రాడక్ట్స్‌తో చర్మం, జుట్టు అందాన్ని మరింత మెరుగపర్చుకోవచ్చు. వీటి వినియోగంతో ఎటువంటి హాని ఉండదు. మరి మీ అందాన్ని అన్ని విధాలుగా మెరుగుపరిచే ఆ నేచురల్ ప్రొడక్ట్స్ ఏవో పరిశీలిద్దాం..

అందానికి మెరుగులు దిద్దుకునేందుకు చాలామంది ఇప్పుడు నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. చర్మం, ముఖం, హెయిర్ హెల్త్ కోసం చాలామంది వివిధ కాస్మెటిక్ ప్రాడక్ట్స్‌ వాడుతుంటారు. అయితే వాటిలోని రసాయనాలతో దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయంగా నేచురల్ ప్రాడక్ట్స్‌తో చర్మం, జుట్టు అందాన్ని మరింత మెరుగపర్చుకోవచ్చు. వీటి వినియోగంతో ఎటువంటి హాని ఉండదు. మరి మీ అందాన్ని అన్ని విధాలుగా మెరుగుపరిచే ఆ నేచురల్ ప్రొడక్ట్స్ ఏవో పరిశీలిద్దాం..

* కొబ్బరి నూనె
మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌తో తయారైన కొబ్బరినూనె చర్మం పొడిబారడం, ముడతలు పడకుండా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. చర్మం లోపలికి, జుట్టు కుదుళ్లలోకి ఈ నూనె వెళ్లడం వల్ల ఎక్కువ కాలం పాటు కండిషనింగ్, మాయిశ్చరైజింగ్ ప్రభావాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ప్రతిరోజూ కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలను నివారిస్తుంది.

* హెన్నా
చాలా మంది గ్రే హెయిర్ కవర్ చేయడానికి హెయిర్ డై వాడుతుంటారు. ఇందులో టార్ డెరివేటివ్స్ లేదా సెకండరీ అమైన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ సంబంధ కారకాలు. కాబట్టి మంచి జుట్టు కోసం హెన్నాకు మారండి. సహజంగా లభించే గోరింటాకులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేసే హెన్నా వేసుకుంటే జుట్టు రంగు సహజంగా ఉంటుంది. మీకు ఏ రంగు కావాలన్నా, ఆ కలర్ హెన్నా ఇప్పుడు లభిస్తుంది. దీన్ని వాడడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. నువ్వుల నూనె, కరివేపాకుతో హెన్నాను కలపండి. లేదా బీట్‌రూట్ రసంతో లేదా పెరుగు, నిమ్మరసం, టీ మిశ్రమంతో కూడా కలుపుకొని జుట్టుకు పట్టించుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఇదీ చదవండి: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


* పండ్లు- పసుపుతో ఫేస్ ప్యాక్
ప్రకాశవంతమైన చర్మం కోసం సులభమైన మార్గం ఫేస్ ప్యాక్‌. ఇది మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. సున్నితమైన మెరుపును అందిస్తుంది. ముందుగా కొద్దిగా పసుపు, పెరుగు మిశ్రమాన్ని కలపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి. మీ ఫేస్ మెరిసిపోతుంది. ప్రత్యామ్నాయంగా, బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు ఫేస్‌కు అప్లై చేయండి. ఇలా తరుచూ చేస్తుంటే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గిపోతాయి.

* కలబంద (అలోవెర)
సాధారణంగా చర్మం పొడి భారకుండా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే వీటిలో ప్రమాదకర సమ్మేళనాలు ఉంటాయి. దీంతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధంగా లభించే అలోవెరాను వాడండి. అలోవెరా పై బెరడు తొలగించి అందులోని జెల్‌ను చర్మానికి అప్లై చేసుకోండి. దీంతో ఈ చర్మం మృదువుగా మారుతుంది.

* వెల్లుల్లి - చందనం
సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్స్‌కు వెల్లుల్లి పవర్‌హౌస్. రక్త శుద్దీకరణలో దీని పాత్ర కీలకం. ఇది చర్మానికి విలక్షణమైన మెరుపును ఇస్తుంది. వెల్లుల్లి రెబ్బ బయటి పొరను తీసివేసి, మొటిమ కనిపించిన ప్రదేశంలో అప్లై చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు కొన్ని వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి, వాటిని కొద్దిగా పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో మొటిమలు తగ్గిపోతాయి.మొటిమల నివారణకు మరో అద్భుత ప్రత్యామ్నాయం చందనం. బాదం నూనె, కొన్ని చుక్కల గంధపు నూనె మిశ్రమంతో చర్మాన్ని మసాజ్ చేయండి. దీంతో చర్మం మృదువుగా తయారు అవుతుంది. ప్రత్యామ్నాయంగా ఒక కప్పు పెరుగు, ఒక టీస్పూన్ పంచదార, చందనం పొడి, అర టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. మీ ముఖానికి ఈ పేస్ట్‌ను అప్లై చేసిన 30 సెకన్ల తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. దీంతో మీ ముఖం నిగనిగ మెరిసిపోతుంది.
Published by:Mahesh
First published:

Tags: Beauty tips, Face mask, Hair styling, Skin care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు