ఇంట్లోనే ఈజీగా, ప్రభావంతమైన క్లీనర్స్‌ని ఇలా తయారు చేసుకోండి..

దుకాణాల నుంచి క్లీనర్లు కొనడం కుటుంబానికి పెద్ద ముప్పే. ఆ రసాయనాల్లో ఉండే విషపదార్ధాలు అనేక సమస్యలకు కారణమవుతాయి.  ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే సహజ క్లీనర్లు ఇవి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:52 PM IST
ఇంట్లోనే ఈజీగా, ప్రభావంతమైన క్లీనర్స్‌ని ఇలా తయారు చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
 • Share this:
దుకాణాల నుంచి క్లీనర్లు కొనడం కుటుంబానికి పెద్ద ముప్పే. ఆ రసాయనాల్లో ఉండే విషపదార్ధాలు అనేక సమస్యలకు కారణమవుతాయి.  ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే సహజ క్లీనర్లు ఇవి.

కిచెన్ క్లీనర్, డియోడరైజర్


 • బేకింగ్ సోడా – 4 టేబుల్ స్పూన్లు

 • వేడి నీళ్లు – ¼ కప్పు


బేకింగ్ సోడా అనేది చక్కని డియోడరైజర్. దాన్ని వంటగది, ఫ్రిజ్, అవెన్ వంటి పరికరాలు శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను వేడి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని మీరు శుభ్రం చేయాలనుకుంటున్న వాటిపై రాయండి.  కాసేపటి తర్వాత శుభ్రమైన స్పాంజ్ తో కడిగేయండి. 

ఆల్ పర్పస్ క్లీనర్ (సువాసనభరితమైనది)

 • వెనిగర్ -ఒక పాలు

 • నీళ్లు – ఒక పాలు

 • రోజ్ మేరీ స్ప్రింగ్స్

 • నిమ్మ తొక్కలు


పైన పేర్కొన్న పదార్ధాలన్నీ కలిపి ఆ ద్రవాన్ని స్ప్రే బాటిల్ లో పోయండి. ఆ ద్రవాన్ని బాగా కదిపి ఓ వారం పాటు అలాగే వదిలేయండి.  ఈ ద్రవాన్ని మీరు ట్రాష్ క్యాన్లు, నీటి మరకలు, గోడలపై మరకలు తుడిచేందుకు ఉపయోగించవచ్చు.

గ్లాస్ క్లీనర్

 • నీళ్లు – 2 కప్పులు

 • సిడర్ లేదా వైట్ వెనిగర్ ½ కప్పు

 • 70% గాఢతతో కూడిన రబ్బింగ్ ఆల్కాహాల్ – ¼ కప్పు

 • ఆరెంజ్ ఎసన్షియల్ స్మెల్ – 1 -2 చుక్కలు


ఈ పదార్ధాలన్నీ బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోయండి. మీ ఇంటిలోని కిటీకీలు, అద్దాలు తుడిచేందుకు దీన్ని ఉపయోగించండి.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading