Health Tips : లవంగాలు రోజూ తింటే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Cloves : మనందరి ఇళ్లలోనూ లవంగాలు ఉంటాయి. అవి లేని పోపుల డబ్బా ఉండదు. ఎందుకంటే లవంగాలు చేస్తున్న మేలు అలాంటిది. ఆ ప్రయోజనాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2020, 7:54 PM IST
Health Tips : లవంగాలు రోజూ తింటే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
  • Share this:
జనరల్‌గా లవంగాల్ని వంటల్లో, మాంసం కూరల్లో, బిర్యానీ తయారీలో వేస్తారు కదా. అలా చెయ్యడం వల్ల ఆ కూరకు టేస్ట్ పెరగడమే కాదు... మన ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. లవంగాల్ని కూరలతోపాటూ... కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. ఈ పువ్వుల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి... దెబ్బతిన్న దంతం దగ్గరా, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే... మెల్లమెల్లగా అది మందులా పనిచేసి... నొప్పిని తగ్గించేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు. తీసుకున్న ఆహారం వల్లగానీ, శరీరంలోని వేడి ఎక్కువగా ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే అరికట్టాలంటే రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే తాజా స్వాస వచ్చి... నోటి దుర్వాసన పోతుంది.

health benefits, clove benefits, cloves health, benefits of cloves, cloves oil, clove tea, cloves side effects, side effects of cloves, clove tea benefits, cloves health benefits, benefits of clove, benefits of cloves for weight loss, health benefits of clove, cloves spice, green cloves, లవంగాలు, ఆరోగ్య ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్
లవంగాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


కొంతమందికి ప్రయాణాలు పడవు. తిన్న ఆహారం జీర్ణం కాదు. వామ్టింగ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓ రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే చాలు. ఆహారం జీర్ణమూ అవుతుంది. వికారం లాంటివీ పోతాయి.

జలుబు, దగ్గు, పడిశం లాంటివి ఏడిపిస్తూ ఉంటే... నోట్లో ఓ లవంగం వేసుకొని... చప్పరించాలి. ఇలా రోజుకు ఐదారు లవంగాల్ని చప్పరిస్తే... ముక్కు సమస్యలు తొలగిపోతాయి.

లవంగాలు చిన్నగా ఉన్నా... వ్యాధుల్ని తరిమికొట్టడంలో, విష పదార్థాల్ని శరీరంలోంచీ బయటకు పంపడంలో బాగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్‌ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాదు... లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని ఇవి తగ్గిస్తుంది. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి.

health benefits, clove benefits, cloves health, benefits of cloves, cloves oil, clove tea, cloves side effects, side effects of cloves, clove tea benefits, cloves health benefits, benefits of clove, benefits of cloves for weight loss, health benefits of clove, cloves spice, green cloves, లవంగాలు, ఆరోగ్య ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్
లవంగాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


లవంగాలు మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్ని అందిస్తాయని తెలుసా. విటమిన్ C, K, ఫైబర్ (పీచు), మాంగనీస్, కాలరీలు, పిండిపదార్థాలను లవంగాలు అందిస్తాయి. మనకు గాయం అయినప్పుడు రక్తం కారిపోకుండా గాయమైన ప్రదేశం దగ్గర రక్తం గడ్డకట్టాలంటే విటమిన్ K అవసరం. అది లవంగాల్లో దొరుకుతుండటం మన అదృష్టం.లవంగాలు కేన్సర్ అంతు చూస్తాయి కూడా. కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా లవంగాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి.

మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు మన ఎముకలకు అవసరం అవుతుంది. బోన్స్ బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది.

లవంగాలతో దుష్ఫలితాలు : లవంగాలతో ఇన్ని ప్రయోజనాలున్నా, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. లవంగాల్ని అదే పనిగా నోట్లో పెట్టుకుంటే నోరు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... రోజుకు నాలుగైదు మించకుండా చూసుకోవాలి. పిల్లలకు లవంగ నూనె అంతగా సెట్ కాదు. అందువల్ల వాళ్లకు వీలైనంత వరకూ లవంగాలు ఇవ్వకూడదు. మంచివి కదా అని లవంగాలను ఎక్కువగా వాడేయకూడదు. ఇవి కొంతవరకూ మేలు చేస్తాయి. మోతాదు ఎక్కువైతే... ఇవే లవంగాలు కీడు చేస్తాయి కూడా. అందువల్ల కొద్దికొద్దిగా మాత్రమే వీటిని వాడటం మేలు.

 

ఇవి కూడా చదవండి :

శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...

పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు... ఎలా వాడాలంటే...
First published: May 17, 2020, 7:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading