Home /News /life-style /

NATIONAL DOCTORS DAY 2021 IS THE BEST OCCASION TO THANK ALL THE DOCTORS NURSES AMID COVID 19

National Doctors' Day 2021 : ఇలాంటి కఠిన సమయంలో డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పాల్సిన సమయమిది..

National Doctors' Day 2021

National Doctors' Day 2021

Happy National Doctors' Day 2021 : పాండమిక్ పరిస్థితి కంటే ముందు కూడా, భారతీయ డాక్టర్లు తీవ్ర పరిస్థితులలో కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. WHO వారి సిఫారసు మేరకు డాక్టర్లు, జనాభా నిష్పత్తి 1:1000 ఉండాలి. కొన్నేళ్ల క్రితమే ఈ నిష్పత్తిని భారతదేశం సాధించింది. కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇటీవల డేటాలో మాత్రం ఆ నిష్పత్తి నుంచి కిందకి పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  జులై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. సమాజంలో అందరి జబ్బులను నయం చేసి వారిని కాపాడటం కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రముఖ ఫిజిషియన్, స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజును నిర్వహించుకుంటారు. ఈ ఏడాది కొవిడ్-19 కారణంగా దేశంలో డాక్టర్ల ప్రాముఖ్యత పెరిగిన తరుణంలో ఈ రోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత మెడికల్ కమ్యూనిటీ ధైర్యాన్ని, అంకితభావాన్ని మెచ్చుకోవడం మన బాధ్యత. ఈ సంక్షోభంలో రోగులకు చికిత్స చేస్తూ 1492 మంది డాక్టర్లు చనిపోయినట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెబుతోంది. వారందరూ తమ వృత్తిలో భాగంగా ఇతరులకు సేవ చేస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసినవారే.

  ఎంతోమందికి ప్రాణభిక్ష
  పాండమిక్ పరిస్థితి కంటే ముందు కూడా, భారతీయ డాక్టర్లు తీవ్ర పరిస్థితులలో కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. WHO వారి సిఫారసు మేరకు డాక్టర్లు, జనాభా నిష్పత్తి 1:1000 ఉండాలి. కొన్నేళ్ల క్రితమే ఈ నిష్పత్తిని భారతదేశం సాధించింది. కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇటీవల డేటాలో మాత్రం ఆ నిష్పత్తి నుంచి కిందకి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు, దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కేవలం పదకొండు రాష్ట్రాలు మాత్రమే ఈ WHO సిఫారసు చేసిన నిష్పత్తిని సంతృప్తిపరుస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ఈ నిష్పత్తి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ప్రతి 1000 మందికి కేవలం 0.08 డాక్టర్లు మాత్రమే ఉన్నాయి అంటే భారతదేశంలో పెద్దమొత్తంలో జనాభాకు వైద్య సేవలు అందడం లేదని అర్థం.

  ఈ సమస్యలు అధిగమిస్తూ కూడా డాక్టర్లు తక్కువ మందే ఉన్నప్పటికీ, వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే వారికి గౌరవం, మెచ్చుకోలు దక్కుతోంది. కొవిడ్-19 సంక్షోభ సమయంలో, నిస్వార్థంగా, నిరంతరం కష్టపడి సేవ చేసే డాక్టర్లను ప్రపంచం చూసింది. ఇన్ఫెక్షన్ వస్తుందని తెలిసినా తమ ప్రాణాలను పనంగా పెట్టి రోగులకు వైద్యం చేశారు. అంతేకాకుండా కొవిడ్-19 వల్ల కలిగే ప్రమాదాల గురించి, దాని నుండి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన ఏర్పరచడంలో కూడా డాక్టర్లు ప్రముఖ పాత్ర పోషించారు. కొన్నిసార్లు, వారి భావోద్వేగాలు కట్టలు తెంచుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముంబైకి చెందిన డా. తృప్తి ఏడుస్తూ అందరికీ కొవిడ్ జాగ్రత్తల గురించి చెప్పిన వీడియో గతేడాది వైరల్ అయిన సంగతి తెలిసిందే.

  మన వంతు కృషి చేస్తున్నామా?
  జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ల కృషిని, శ్రమను గుర్తించడమే కాదు, వారి జీవితాలను మెరుగుపరచడానికి, పని పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి వీలైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి బాధ్యతను వారు నిర్వర్తించడానికి అవసరమైన పరికరాలు లేకపోవడం మాత్రమే కాకుండా, ఇటీవల వారి మీద హింసాత్మక దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అస్సాంలో ఓ వ్యక్తి కొవిడ్-19 వల్ల చనిపోతే, అతనికి చికిత్స చేసిన డాక్టర్ మీద అతని బంధువులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఇలాంటి ఘటనలు డాక్టర్లను నిరుత్సాహపరచడమే కాకుండా, కొత్తగా మెడికల్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటున్నవారి ఆశను చెరిపేస్తాయి.

  ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన వంతు కృషిగా డాక్టర్లు, ఆరోగ్య వర్కర్ల మీద కొంత గౌరవాన్ని అలవరుచుకునే తత్వం ఏర్పడాలి. ఈ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి మీద దాడులు చేసే సంస్కృతిని విడనాడి, వారి పట్ల గౌరవంగా మెలిగే బుద్ధిని అలవరుచుకుందాం. దీంతో డాక్టర్ల మీద హింసాత్మక దాడులు తగ్గడమే కాకుండా, మెడికల్ రంగం మీద ఆశ మెరుగుపడుతుంది. డాక్టర్లు అందించే చికిత్స, వారి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తే – ఎప్పుడో ఒకప్పుడు – పరిస్థితులు మెరుగుపడి, సరైన విధానాలు అమల్లోకి వచ్చి అటు వైద్యుల పరిస్థితి, తద్వారా భారతీయుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

  భారతదేశపు అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అవగాహన డ్రైవ్ అయిన Network18 Sanjeevani – A Shot Of Life, a Federal Bank Ltd వారి CSR ఇనిషియేటివ్ ద్వారా మేము కూడా ఆరోగ్యం, క్షేమం గురించి మా వంతు కృషి చేస్తున్నాం. ఆరోగ్యం, రోగనిరోధక శక్తి కోసం చేసే ఈ యుద్ధంలో భాగం కావడానికి, Sanjeevani ను సందర్శించండి.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Corona, Doctors

  తదుపరి వార్తలు