National Ayurveda Day 2020: ఆ ఆయుర్వేద ములికలు, సుగంధ ద్రవ్యాలతో కరోనా దూరం.. తెలుసుకోండి

మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించే ఆయుర్వేదం శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, COVID-19 మహమ్మారి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే ఐదు ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలు..

news18-telugu
Updated: November 13, 2020, 5:07 PM IST
National Ayurveda Day 2020: ఆ ఆయుర్వేద ములికలు, సుగంధ ద్రవ్యాలతో కరోనా దూరం.. తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నవంబరు 13న దేశవ్యాప్తంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 2016 నుంచి ధన్వంతరి జయంతి లేదా ధంతేరాస్ రోజున ఈ వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం ఐదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవానికి ‘ఆయుర్వేద ఫర్ కోవిడ్ -19’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. ఈ రోజు ఆయుర్వేద చికిత్సల గురించి, ఆయుర్వేదం ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వైద్యం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వ్యాధులను నివారిస్తూ, మరణాల ప్రమాదాన్ని తగ్గించే దిశగా పనిచేయాలనేది ఆయుర్వేద దినోత్సవం లక్ష్యం. పురాతన వైద్య చికిత్స పద్ధతిగా ఆయుర్వేదానికి ఎంతో గుర్తింపు ఉంది.

ఆయుర్వేదానికి ఆధ్యుడు ధన్వంతరి. ఆరోగ్యం, సంపదను అందించే సద్గుణాలు ఆయనకు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆయన పుట్టినరోజు నాడు ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై ఎంతో ప్రతికూల ప్రభావం చూపింది. ఈ వైరస్ రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనికి నివారణ, చికిత్స పద్ధతులుగా ఆయుర్వేద సూత్రాలు పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించిది. మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించే ఆయుర్వేదం శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, COVID-19 మహమ్మారి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే ఐదు ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలు..

1. బ్రహ్మి
సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడి పేరు నుంచి ఈ మూలికకు బ్రహ్మి అనే పేరు వచ్చింది. ఇది ఆయుర్వేదంలో అత్యంత గౌరవనీయమైన, విస్తృతంగా ఉపయోగించే మూలిక. ఆందోళన, మెదడు సంబంధ అనారోగ్యాలు, చర్మ సమస్యలను నివారించడానికి, రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి దీన్ని వాడతారు. ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులకు ఈ మూలికతో చికిత్స చేస్తారు. శ్వాస సంబంధ సమస్యను నివారించడానికి ఇది సహాయపడుతుంది. బ్రాంకటిస్, రొంప, ఛాతీ జలుబు, సైనస్ చికిత్సకు బ్రహ్మిని ఉపయోగిస్తారు. ఇది మానవ శరీరం నుంచి అదనపు కఫం, శ్లేష్మాలను తొలగిస్తుంది. గొంతులో, శ్వాసనాళాల్లో మంటను తగ్గిస్తుంది.

2. అశ్వగంధ
అశ్వగంధ అనేది ఒక చిన్న చెక్క జాతి మొక్క. సంస్కృతంలో అశ్వగంధ అంటే గుర్రపు వాసన అని అర్థం. ఈ ఆయుర్వేద ఔషధ మూలికను 3,000 సంవత్సరాల నుంచి ఒత్తిడిని తగ్గించడానికి, శక్తి స్థాయులను పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. దీనికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3. తులసి

ఈ మొక్కను చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు. తులసికి ఆధ్యాత్మికంగా, ఔషధ పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఔషధ మూలిక రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. సాధారణ జలుబు, తలనొప్పి, కడుపులో అసౌకర్యం, మంట, గుండె జబ్బులకు నివారణిగా తులసిని వాడతారు.


4. వేప

దీన్ని "ఇమ్యునో మాడ్యులేటర్" అని కూడా పిలుస్తారు. ఈ ఔషధ మూలిక రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వేప ఆకులకు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి, విషాన్ని తొలగించడానికి, అల్సర్ల నివారణకు సహాయపడతాయి. ఇది వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.

5. పసుపు
పసుపు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, మధుమేహం వంటి ఎన్నో అనారోగ్యాలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సుగంధ ద్రవ్యం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో పేరుకుపోయే మలినాలను తొలగిస్తూ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Published by: Nikhil Kumar S
First published: November 13, 2020, 4:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading