హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Wellness: మీ పార్ట్‌నర్‌తో శృంగారం బోర్ కొడుతోందా...అయితే ఇలా చేంజ్ చేసి చూడండి..

Wellness: మీ పార్ట్‌నర్‌తో శృంగారం బోర్ కొడుతోందా...అయితే ఇలా చేంజ్ చేసి చూడండి..

తొందరగా తాము భావప్రాప్తి పొందడం వల్ల.. తమ పార్ట్ నర్ తృప్తి పరచలేమేమో అనే అనుమానం ఉంటుంది. అయితే.. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. అబ్బాయిలు ఎలాంటి అనుమానాలు లేకుండా.. ఎక్కువ సేపు కలయికను ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

తొందరగా తాము భావప్రాప్తి పొందడం వల్ల.. తమ పార్ట్ నర్ తృప్తి పరచలేమేమో అనే అనుమానం ఉంటుంది. అయితే.. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. అబ్బాయిలు ఎలాంటి అనుమానాలు లేకుండా.. ఎక్కువ సేపు కలయికను ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

శృంగారంలో ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉండే ఆలోచనలు చేయవద్దు. మొదటిసారి శృంగారాన్ని అమితంగా ఆస్వాదించాలంటే మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి. అవాస్తవ అంచనాలు(Unrealistic Expectations), టార్గెట్లను పెట్టుకొని మీ భాగస్వామిని ఆందోళనకు గురిచెయ్యకండి.

ఇంకా చదవండి ...

  మనిషి జీవితంలో శృంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా మారాలన్నా.. వారి రిలేషన్ (Relation) రొమాంటిక్ గా ఆనందంగా కొనసాగాలన్నా శృంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారు ఒకింత ఆందోళనకు గురవ్వడం సహజమే. ఈ రకమైన ఆందోళన(Anxious) కేవలం మహిళ(Women)ల్లోనే కాదు పురుషుల్లో(Men) కూడా ఉంటుంది. దీన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా భయాన్ని విడిచిపెట్టి, లోతైన శ్వాస తీసుకోండి. ఎందుకంటే, శృంగారం అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఇది తప్పుపట్టాల్సిన ప్రక్రియ ఏమీ కాదు. మన శరీరానికి ఏది సరైనదో? అది ఏమి చేయాలో? ఆనందాన్ని ఎలా సాధించాలో? సహజంగానే దానికి తెలుస్తుంది. అంతేకాక, శృంగారానికి నియమ నిబంధనలు, ఇలాగే చేయాలన్న గైడ్లైన్స్ ఏమీ లేవు. అయితే, మొదటి సారి శృంగారం చేసే మందు కొన్ని విషయాలపై తప్పక అవగాహన పెంచుకోవాలి. ఈ విషయాలు మన భయాలు(Sexual Fear), అభద్రతాభావాలను వదిలించుకోవడానికి సహాయపడుతాయి.

  పోర్న్ వీడియోలను అనుసరించకండి

  మనలో చాలా మందికి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. వాటిలో చేసినట్లుగానే భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు చాలా మంది. అయితే, పోర్న్ వీడియోలలో చూపించిన విధంగా బయట చేయాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే, పోర్ట్ వీడియోల్లో నటించే వారు సినిమా సినిమా షూటింగ్ మాదిరిగానే విరామాలు తీసుకుంటూ చేస్తారు. అంతేకాక, పోర్న్ వీడియోలకు స్పెషల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ కూడా చేస్తారు. ఇది చూసి నిజమనుకుంటే పొరపాటే. కాబట్టి, మీరు కూడా మీ భాగస్వామితో అలాగే చేయాలని అనుకోకండి. వారిని కూడా అలా చేయాలని ఒత్తిడి చేయండి. ఇవన్నీ పక్కనపెట్టి మీ సురక్షితమైన మొదటి శృంగారంపై దృష్టి పెట్టండి.

  బాధాకరమైన శృంగారాన్ని కోరుకోకండి

  మీ మొదటిసారి శృంగారం బాధాకరం గా లేదా రక్తం మరకలతో ఉండవలసిన అవసరం లేదు. మొదటిసారి శృంగారంలో రక్త ప్రావం అయితేనే కన్యత్యం ఉన్నట్లు భావించకండి. ఎందుకంటే రన్నింగ్ లేదా సైక్లింగ్ వంటి వాటి ద్వారా కూడా చాలా మంది మహిళల్లో చిన్నప్పుడే కన్నెపొర చినిగిపోతుంది. అయితే, మొదటిసారి శృంగారంలో స్త్రీకి సహజంగానే నొప్పి వస్తుంది. అయితే, కొంతమంది పురుషులు తీవ్ర ఉద్రేకంతో స్త్రీ యోనిలోకి బలంగా పురుషాంగాన్ని కదిలిస్తుంటారు. దీని వల్ల తీవ్ర అసౌకర్యం, నొప్పి కలుగుతుంది. దీనికి పరిష్కారంగా ఫోర్‌ప్లే టెక్నిక్ను వాడండి. దీని ద్వారా యోని పొర సాగుతుంది. బాగా ప్రేరేపించినప్పుడు మరింత సరళత పొందుతుంది. లేకపోతే, సులభమైన అంగ సంపర్కం కోసం, ల్యూబ్‌ను ఉపయోగించండి. వీటిని ఉపయోగించడం ద్వారా నొప్పి కలగకుండా శృంగారంలో మజా పొందవచ్చు. ముద్దు లేదా రొమాన్స్ తో శృంగారాన్ని ప్రారంభించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.

  సురక్షిత శృంగారంలో పాల్గొనండి

  సురక్షితమైన శృంగారంలో పాల్గొనడం చాలా కీలకం. వీటి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. కొంతకాలం పిల్లలు కనడానికి దూరంగా ఉండటానికి, సురక్షిత శృంగారానికి గర్భనిరోధక మందులు, కండోమ్‌(Condoms)లను ఉపయోగించండి. చాలా మంది ప్రజలు తమ మొదటి సమయంలో చేసే ఒక సాధారణ తప్పు ఏమిటంటే, ఒకేసారి రెండు కండోమ్‌లను ఉపయోగించడం. ఇది వాస్తవానికి చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే రెండు కండోమ్‌ల మధ్య ఘర్షణ ఏర్పడి కండోమ్‌లను చింపివేస్తుంది.

  శృంగారంలో టార్గెట్లు వద్దు..

  శృంగారంలో ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉండే ఆలోచనలు చేయవద్దు. మొదటిసారి శృంగారాన్ని అమితంగా ఆస్వాదించాలంటే మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి. అవాస్తవ అంచనాలు(Unrealistic Expectations), టార్గెట్లను పెట్టుకొని మీ భాగస్వామిని ఆందోళనకు గురిచెయ్యకండి. సురక్షిత శృంగారంతో ప్రతి క్షణం ఆనందించండి. గొప్పగా శృంగారాన్ని అనుభవించాలంటే 'పెద్ద వక్షోజాలు' లేదా 'భారీ పురుషాంగం' కలిగి ఉండవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి, సెక్స్ అనేది ఇద్దరు ఏకాంతంగా ఆస్వాదించే క్రీడ. అది పరుగుపందెం కాదని గుర్తించుకోండి.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Sexual Wellness

  ఉత్తమ కథలు