మీరు గుడ్లగూబల్ని రెగ్యులర్‌గా చూస్తున్నట్లైతే... మీరు అత్యంత తెలివైనవారు, నాలెడ్జ్ ఉన్నవారు అవుతారు. మనలో నాలెడ్జిని పెంచే లక్షణం గుడ్లగూబలకు ఉందని పరిశోధనల్లో తేలింది. మీరు గుడ్లగూబను పెంచుకుంటున్నట్లైతే... మిగతా వారి కంటే ఎక్కువ నిశితంగా, ఎక్కువ ఏకాగ్రతతో మీరు చూస్తారు. అందుకే గుడ్లగూబల్ని పురాణాల్లో మేథస్సును పెంచే పక్షులుగా, తెలియని ప్రపంచానికి తీసుకెళ్లే మార్గదర్శినులుగా చెప్పారు. గుడ్లగూబ కళ్లలో కళ్లు పెట్టి చూస్తే... మన జీవితంలో మార్పులు రావడం ఖాయం. కారణం దాని కళ్లలో ఉన్న శక్తే. రోజూ దాదాపు 10 నిమిషాలపాటూ... గుడ్లగూడ కళ్లు ఉండే ఫొటోను చూస్తే... లోతుగా, నిశితంగా, స్పష్టంగా, కచ్చితత్వంతో ఆలోచించే అలవాటు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
ఇలా చెయ్యండి :
* పై ఫొటోలో గుడ్లగూబ కళ్లు చూశారుగా... అలాంటి ఫొటోల్లోని గుడ్లగూబ కళ్లలోకి కళ్లు పెట్టి దాదాపు 10 నిమిషాలు చూడాలి. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మనం చూసే కోణం మారుతుంది. ప్రతీదీ నిశితంగా ఏకాగ్రతతో చూస్తామని పరిశోధనల్లో తేలింది.
* గుడ్లగూబ కళ్లు... గుండ్రంగా, సూటిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ కళ్లను తదేకంగా చూస్తామో... ప్రతీదీ తదేకంగా చూడటం అలవాటవుతుంది. అందువల్ల మిగతా వారి కంటే మనం లోతుగా చూడగలం. ఎక్కడ ఏం జరుగుతున్నా, మిగతా వాళ్ల కంటే మనకు ఎక్కువగా విషయం తెలుస్తుంది.
* గుడ్లగూబలు చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు. మనం అలా చూడలేం. కానీ... వాటి కళ్లను నిశితంగా చూడటం వల్ల... మన మెదడులో చూపుకి సంబంధించిన భాగాలు మరింత చురుకుగా మారతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కచ్చితత్వం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
* చుట్టూ జరిగే పరిణామాలపై మనకు ఉత్సుకత పెరుగుతుంది. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవాలనే ఆతృత కలిగిస్తాయి గుడ్లగూబలు. ప్రతీ విషయంపైనా ఆసక్తి పెరుగుతుంది. అలా చెయ్యించడంలో గుడ్లగూబలు ఎక్స్‌పర్ట్స్ అని పరిశోధనల్లో స్పష్టమైంది.
ఇలా గుడ్లగూబ కళ్లను డైరెక్టుగా కానీ... కలర్ ఫుల్ క్లోజ్ ఫొటోల్లో గానీ... 30 సెంటీమీటర్ల దూరం నుంచీ రోజూ 10 నిమిషాలు చూస్తే... ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకవేళ అంత టైం లేదు అనుకునేవారు ఓ పని చెయ్యొచ్చు. గుడ్లగూబ కళ్లను మొబైల్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నా పర్వాలేదు. తద్వారా... రోజులో కనీసం 20 సార్లైనా ఆ ఫొటోని చూస్తాం. కొంతైనా నిశితంగా గమనించే దృష్టి కోణం పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Devotional, Life Style