నా భార్య నాతో సెక్స్ చేయడం లేదు...నాకే సెక్స్ జబ్బు అంటోంది...ఏం చేయాలి...

నా భార్య నాతో సెక్స్ చేయడం లేదు...నాకే సెక్స్ జబ్బు అంటోంది...ఏం చేయాలి...

ప్రతీకాత్మకచిత్రం

మీ భార్య సెక్స్ ను ఒక బూచిగా భావిస్తున్నారు. దాన్ని ఆస్వాదించడం లేదు. దాన్నొక పనిలా మాత్రమే భావిస్తున్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ శరీరంలో కలిగే ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది ఇద్దరిలోనూ ఇమ్యూనిటీని దెబ్బతినేలా చేస్తుంది.

  • Share this:
    ప్రశ్న: నా పేరు రాజు ( పేరు మార్చాం) వయస్సు 30 నేను ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. నా భార్య వయస్సు కూడా ఇంచు మించు నా వయస్సే. మాకు 3 సంవత్సరాల క్రితం పెళ్లి ఒక సంవత్సరం క్రితం మాకు ఒక బాబు పుట్టాడు. అంతా సాఫీగానే సాగుతోంది. అయితే గత మూడు నెలలుగా నా భార్య లైంగిక చర్యకు ఒప్పుకోవడం లేదు ఏం చేయాలి. నాకు కోరికలు కలుగుతున్నాయి. నా భార్య మాత్రం మనకు ఒక పిల్లవాడు ఉన్నాడు కదా..ఇంకెందుకు తొందర నీకు అని అవమానిస్తోంది. మరో పిల్లవాడి కోసం రెండు సంవత్సరాల తర్వాత ప్లానింగ్ చేద్దాం అని అంటోంది. నాకు మాత్రం లైంగిక సుఖం కావాలనిపిస్తోంది. అయితే నాకు లైంగిక సుఖం కోరికలు కలగడం మానసిక రుగ్మత అని సైకాలజిస్టుకు చూపించుకోమని సలహా ఇస్తోంది. నిజంగా నాకు అలాంటి మానసిక రుగ్మత ఉందా. ఒక వయస్సు సెక్స్ కోరికలు కలగడం అసహజమైన చర్యనా...సెక్స్ అనేది కేవలం పిల్లలు కనడం కోసం చేసే ప్లానింగ్ మాత్రమేనా...నా సమస్యకు పరిష్కరం చూపండి.

    జవాబు: మీ సమస్య చాలా మంది జంటల్లో కలిగేదే...చాలా మంది సెక్స్ ను కేవలం పిల్లలు కనేందుకు మాత్రమే చేసే చర్యగా భావిస్తుంటారు. సెక్స్ అనేది ఒక డ్యూటీ కాదు.. అది ఒక సహజ ప్రక్రియ నిద్ర, ఆహారం, ఎలాగో మనిషికి సెక్స్ కూడా అంతే అవసరం. అయితే మీ భార్య సెక్స్ ను ఒక బూచిగా భావిస్తున్నారు. దాన్ని ఆస్వాదించడం లేదు. దాన్నొక పనిలా మాత్రమే భావిస్తున్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ శరీరంలో కలిగే ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది ఇద్దరిలోనూ ఇమ్యూనిటీని దెబ్బతినేలా చేస్తుంది. అలాగే భవిష్యత్తులో గుండె జబ్బులు, అలాగే అధిక రక్త పోటు కలిగేలా చేస్తుంది. కాగా ఈ కార్టిసాల్ కు విరుగుడు సెక్స్ హార్మోన్స్ అనే చెప్పాలి. మేల్ సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ప్రొజస్టిరాన్, ఈస్ట్రోజన్ సెక్స్ సందర్భంగా విడుదల అవుతాయి. ఇవి శరీరంలో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ తగ్గిస్తాయి. సెక్స్ హార్మోన్స్ శరీరంలో విడుదల అవ్వడం వల్ల మీరు డయాబెటిస్ నుంచి కాపాడబడతారు. అంతేకాదు అధిక రక్త పోటు, వృద్ధాప్యం కూడా రాకుండా సెక్స్ హార్మోన్స్ పనిచేస్తాయి. ఇక మీ విషయంలో మీ భార్యకు ముందుగా కౌన్సిలింగ్ అవసరం, సెక్స్ పట్ల ఆమెకు ఉన్న విముఖత ( టాబూ)ను అర్థం చేసుకొని దానికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లైనా సెక్స్ చేస్తే మీ ఇద్దరిలో ఒత్తిడి దూరం అవుతుంది. అలాగే శరీరానికి చక్కటి వ్యాయామం దక్కుతుంది. మీ విషయంలో మీకు ఎలాంటి పొరపాటు లేదు. సెక్స్ కోరికలు కలగడం సహజం. ఇక మీరు మీ పార్ట్ నర్ ను సెక్స్ కు ఒప్పించేందుకు మొరటు పద్ధతులు కాకుండా ఆమెలో కోరికలు కలిగేలా ప్రయత్నం చేయండి. పని ఒత్తడి తగ్గించుకొని ఇద్దరు సంభాషించుకోవడం, రొమాంటిక్ సినిమాలు చూడటం, లేకుంటే సాహిత్యం చదవడం, ప్రణయ గీతాలు వినడం, ఇద్దరూ కలిసి స్నానం చేయడం వంటివి ఇద్దరిలో సెక్స్ డ్రైవ్ చేసేందుకు దోహదం చేస్తాయి. మీకు సమస్య అనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ కు హాజరు అవ్వండి.
    Published by:Krishna Adithya
    First published: