Home /News /life-style /

MY MOTHER IS MY INSPIRATION SAYS TELANGANA SHE TEAMS CHIEF SWATI LAKRA ON THE EVE OF MOTHERS DAY BA

Mothers Day 2020 | అమ్మ అంటే నాకు ఇద్దరు గుర్తొస్తారు: స్వాతి లక్రా

స్వాతి లక్రా

స్వాతి లక్రా

Womens Day | వృత్తి జీవితంలో ఎన్నొ ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్న తాను ఈ రోజుఈ స్థాయికి వచ్చేనంటే దానికి తన త‌ల్లే స్పూర్తి అని స్వాతి లక్రా చెప్పారు.

    స్వాతి లక్రా. ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా మహిళలకు. షీ టీమ్స్‌ ద్వారా తెలంగాణలో ఎంతో మంది తల్లుల కన్నీళ్లు తుడిచారామె. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మదర్స్ డే సందర్భంగా న్యూస్‌18తెలుగు ఆమెతో ముచ్చటించింది.

    మ‌హిళ‌ల ప‌ట్ల చిన్న చూపు ఉన్న స‌మాజం మ‌న‌ది. మారుతున్న కాలంతోపాటు ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారిన‌ప్ప‌టికీ స‌మాజంలో మ‌హిళ‌ల ప‌ట్ల ఆ వివ‌క్ష‌త అలానే ఇంకా ఉంద‌న‌డం అక్ష‌ర స‌త్యం. అప్ప‌ట్లో అలాంటి వివ‌క్ష‌ల‌ను సైతం ఎదురించి ఐపీఎస్ వైపు అడుగులు వేశారంటే ఆమెకు అంత ధైర్యాన్ని ఎవ‌రు ఇచ్చి ఉంటారు. త‌న ప్ర‌తి అడుగులో ఎవ‌రు వెన్నుత‌ట్టి ప్రొత్సహించి ఉంటారు? ఈ ప్రశ్నకు స్వాతి లక్రా చెప్పే సమాధానం... అమ్మ.

    చిన్న‌త‌నంలో తన త‌ల్లి నేర్పిన ధైర్య‌మే ఈ రోజు ఎంద‌రో ఆడ‌పిల్ల‌ల‌కు బాస‌ట‌గా నిల‌వ‌డానికి కార‌ణ‌మైందని చెబుతారు స్వాతి లక్రా. ముఖ్యంగా త‌న త‌ల్లిలో ధైర్యం, స‌హనం త‌న‌కెంతో ఇష్ట‌మ‌ంటారు. అదే ధైర్యం త‌నలో నింపుకొని ఐపీఎస్ వైపు అడుగులు వేశారామె. వృత్తి జీవితంలో ఎన్నొ ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్న ఆమె ఈ రోజు తాను ఈ స్థాయికి వచ్చేనంటే దానికి తన త‌ల్లే స్పూర్తి అని చెప్పారు. ఆ రోజు ఆ త‌ల్లి నూరి పోసిన ఈ ధైర్యం ఇప్పుడు ఎంద‌రో మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తోంది. షీటీమ్ బాస్ గా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు నేనున్నా అనే భరోసాను క‌ల్పిస్తున్నారు స్వాతి లక్రా.

    స్వాతి లక్రా


    మా అమ్మ‌
    నాన్న ఉద్యోగ‌రీత్యా వివిధ ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు మా అమ్మే అన్నీ చూసుకునేది. మా చ‌దువులు ద‌గ్గ‌ర నుంచి అన్ని విష‌యాలు. ఈ క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. అమ్మ గురించి చెప్పాలంటే, ఈ రోజు మీ ముందు నిల్చున్నానంటే అది మా అమ్మ కల. న‌న్ను ఈ స్థాయిలో నిల‌ప‌డానికి త‌ను ప‌డిన క‌ష్టం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ స్థాయికి రావాల‌ని ఆశ‌యం నాదైనా వెనుకుండి న‌డిపించింది మాత్రం మా అమ్మే.

    ఏపీ, తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ నుంచి అభినందన పత్రాన్ని అందుకుంటున్న స్వాతి లక్రా


    ఆ రోజు మా అమ్మ ఏడుపు నాకు ఇప్ప‌టికీ గుర్తుంది..
    1995 నేను సివిల్స్ కి ఎంపిక అయిన‌ప్పుడు విష‌యం ఇది. అప్ప‌ట్లో సెల్‌ ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్లు మాత్రమే ఉన్నాయి. ఆ టైంలో అందుబాటులో ఉన్న ల్యాండ్ లైన్ తీసుకొని నేను ఇంటికి కాల్ చేశా. నాన్న‌తో కొంత సేపు మాట్లాడిన త‌రువాత అమ్మ‌కు ఫోన్ ఇవ్వ‌మన్నా. ఫోన్ అందుకున్న అమ్మ ఏం మాట్లాడ‌ లేదు. చిన్న‌గా ఏడుపు వినిపించింది. నేను ఎంపిక అయిన త‌రువాత అమ్మ ఆనందంతో కార్చిన క‌న్నీళ్లు నేను ఇప్ప‌టికి మ‌ర్చిపోలేను. నా విజ‌యాల‌కు నా క‌న్నా ఎక్కువ సంతోష‌ప‌డిన వ్య‌క్తి మా అమ్మ‌.

    మొక్కలు నాటుతున్న స్వాతి లక్రా


    ప్ర‌స్తుతం నేనొక అమ్మ‌గా
    మా అమ్మ గురించి మాట్లాడాలంటే మా అత్త‌మ్మ గురించి కూడా చెప్పాలి. వృత్తి రీత్యా నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానో ఎప్పుడు బ‌య‌ట ఉంటానో కూడా నాకు తెలీదు. అలాంటి స‌మ‌యంలో మా అత్త‌మ్మ నా ఇద్ద‌రి పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా పెంచి పెద్ద‌వాళ్లును చేసింది. ప్ర‌స్తుతం ఇద్దరు పిల్ల‌లు పెద్ద వాళ్లు అయి త‌మ ప‌నులు తాము చేసుకుంటున్నారు. అమ్మ అనే మాట విన‌బ‌డితే నాకు గుర్తొచ్చేది ఇద్ద‌రు. ఒక‌రు మా అమ్మ. మ‌రొక‌రు మా అత్త‌మ్మ‌.

    స్వాతి లక్రా


    అమ్మ నాకు నేర్పిందిదే
    అమ్మ నాకు నేర్పింది ఇదే. ప‌ని మాత్ర‌మే చేయి. ఫ‌లితం గురించి ఆలోచించ‌కు. కానీ ఆ చేసే ప‌ని మ‌నుసు పెట్టి చేయి. అది ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కంతోనే చెయ్యి. చేసిన త‌రువాత మాత్రం దాని ప‌రిణామాలు గురించి మాత్రం ఆలోచించ‌కు. ధైర్యం, స‌హనం ఇవే అమ్మ నాకు ఇచ్చిన గొప్ప వ‌రాలు.

    (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: She teams, Telangana, Womens Day 2020

    తదుపరి వార్తలు