Home /News /life-style /

MY HUSBAND SLEEPS NAKED EVERY NIGHT BUT I FEEL EMBRASSED FOR THAT RNK

Relationship: నా భర్త బట్టలు లేకుండా ఉన్నాడు.. పనిమనిషి బెడ్రూంలోకి వెళ్లింది.. నాకు అసహ్యంగా అనిపిస్తోంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Relationship: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆ తర్వాత మేము ఒకరినొకరం బాగా అప్యాయంగా ఉండేవాళ్లం. ఆయన కూడా నన్ను బాగానే చూసుకుంటాడు. ఆయనపై ఏ కంప్లైంట్స్ కూడా లేవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram
Relationship: మాది పెద్దలు కుదిర్చిన వివాహం (Wedding). ఆ తర్వాత మేము ఒకరినొకరం బాగా అప్యాయంగా ఉండేవాళ్లం. ఆయన కూడా నన్ను బాగానే చూసుకుంటాడు. ఆయనపై ఏ కంప్లైంట్స్ కూడా లేవు. కానీ, ఆయనకు ఓ అలవాటు ఉంది. నైట్ పూట్ బట్టలు లేకుండా నిద్రించే (Sleep) అలవాటు. అదే ఇప్పుడు నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. అది గుర్తు చేసుకుంటే కూడా నాకు సిగ్గనిపిస్తోంది. ఆయన పై అసహ్యం కలుగుతుంది. ఇంట్లో పనివారుంటారు. వారిమధ్య ఆయన ఉదయం 10 గంటల వరకు అలాగే నిద్రపోతాడు. ప్రతిసారి నేను గది బయటకు వెళ్లినప్పుడు అతని బాడీని పూర్తిగా బ్లాంకెట్ తో కవర్ చేసి వెళ్తాను. కానీ, ఒకరోజు నేను కిచెన్ పనుల్లో బిజీగా ఉన్నాను. పనిమనిషి మా రూం క్లీన్ చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆయన కప్పుకున్న బ్లాంకెట్ మోకాలి పైభాగానికి వెళ్లింది. దీంతో కంగారు పడి రూం లోనుంచి బయటకు పరిగెత్తి నాకు జరిగిన విషయం చెప్పింది. నేను ఆ గదిలోకి వెళ్లను అక్క అని భయపడింది. అప్పుడు నాకు ఎలానో అనిపించింది. ఆయనకు ఎంత వివరించి చెప్పినా.. పట్టించుకోడు. నేను బట్టలు వేసుకుని అస్సలు పడుకోలేను అంటాడు. మరి నేను ఏం చేయాలి?


ఇది కూడా చదవండి: నాకంటే 7 ఏళ్లు చిన్న.. గంటలతరబడి పని సాకుతో నావద్దే కూర్చునేవాడు.. కానీ, ఆ విషయంలో ఆసక్తి చూపేవాడు కాదు..!


ఆయన వివరణ..
నేను హెవీ బ్లాంకెట్ కప్పుకుంటాను. ఏసీ లేకుండా పడుకోలేను. నాకు చర్మ సమస్యలు కూడా ఉండేవి. దీంతో డాక్టర్ రాత్రి సమయంలో బట్టలు లేకుండా పడుకోమన్నాడు. ఆతర్వాత అది అలవాటుగా మారింది. అలా అయితేనే నాకు బాగా నిద్ర పడుతుంది. ఎన్నో ఆర్టికల్స్ లో కూడా చదివాను దుస్తులు లేకుండా పడుకుంటే చర్మం బాగా గాలి పీల్చుకుంటుందని. అందులో నా తప్పేముంది? ఇలా తెలిసి కూడా పనిమనిషిని ఎందుకు గదిలోకి రానివ్వాలి? ఇది నాకు చిన్న విషయమే కానీ, రానురాను మా ఇద్దరి మధ్య పెద్ద సమస్యలా మారుతోంది. నాకు అంత గందరగోళంగా ఉంది. నేనేం చేయాలో అర్థం కావడం లేదు.

జిగ్యాస ఉనియల్, లవ్ కోచ్..
మీ మెడికల్ కండీషన్ పై ఒకరినొకరు కూర్చోని మాట్లాడుకోండి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది. కానీ, అది మంచి మాటల వారకే కూల్ గా సమస్యను పరిష్కరించుకోండి. మిమ్మల్ని అలా చూసిన పనిపనిషి ఏమనుకుంటుందో కూడా అని మీరు ఆలోచించాలి.లేకపోతే త్వరగా ఎవరూ రాకముందు నిద్రలేచి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మీ అలవాటుతో మీ భార్య కూడా ఎంత స్ట్రెస్ కు గురవుతున్నారో ఆలోచించండి. దీంతో మీ బంధం కూడా తెగిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇది కూడా చదవండి: వినూత్న వంటకాలు ఇష్టపడే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లైఫ్‌స్టైల్ ఎలా ఉండేదో తెలుసా?


జాన్వీ మహజన్, రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్..
దుస్తులు లేకుండా ప్రతిరోజూ పడుకోవడం అనేది రిపోర్టులు, నివేదికలు చదివే వరకు బాగానే ఉంటుంది. మనదేశంలో ఇలా చేసినప్పుడు పనిమనిషి రాకుండా రూం లాక్ వేసుకోవాలి. లేదా వేరే గదిలోకి వెళ్లి పడుకోవాలి. ఇది మీ భార్య, పనిమనిషికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. పనిపనిషి మిమ్మల్ని అలా చూడటం, దాన్ని మీ వైఫ్ కు చెప్పడం కూడా మీ భార్యకు చాలా స్ట్రెస్ కు గురిచేస్తుంది కదా? ఏదైనా తేడా జరిగితే, మీ పనిమనిషి మీరు కావాలనే బ్యాడ్ గా ప్రవర్తించారని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. మీకు నిజంగానే స్కిన్ ప్రాబ్లెం ఉంటే మెయిడ్ వచ్చేలోగా వేరే రూంలోకి వెళ్లి పడుకోండి. లేకపోతే త్వరగా లేవండి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Renuka Godugu
First published:

Tags: Relationship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు