Home /News /life-style /

MY DAUGHTER HAS COME TO KNOW THAT SECRET FATHER DOES NOT CARE AT ALL RNK

Relationship: నా కూతురికి ఆ రహస్యం తెలిసిపోయింది.. తండ్రి పూర్తిగా పట్టించుకోడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Relationship: నాకు ఎవరితోనైనా సంబంధం ఉందని నా కుమార్తె అనుమానిస్తోందని, ఇప్పుడు తనతో ఇవన్నీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని ఇటీవల ఓ మహిళ నిపుణుడితో చెప్పింది. నిపుణుడు మహిళకు ఏమి సూచించాడో తెలుసుకుందాం

Relationship Tips: రిలేషన్‌షిప్‌ (Relationship) లో చాలా సార్లు చాలా గందరగోళానికి గురవుతారు. దీని కోసం వారు నిపుణుల సహాయం తీసుకోవాలి. ఈ నిపుణులు (Experts)  ప్రజల సమస్యలను వింటూ వాటిని కూడా వివరిస్తారు. అలాంటి ఒక ఉదంతం తాజాగా తెరపైకి వచ్చింది. ఒక మహిళ తన సంబంధంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిపుణుడితో చెప్పింది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఒక మహిళ నిపుణుడితో మాట్లాడుతూ "నా 17 ఏళ్ల కుమార్తె నేను ఎవరితోనో సంబంధం కలిగి ఉన్నానని అనుమానించింది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమె అనుకున్నదే నిజం.... ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. చాలా కాలంగా నా వైవాహిక జీవితంలో పరిస్థితులు సరిగ్గా లేవు, దాని కారణంగా నాకు శ్రద్ధ చూపే వ్యక్తితో డేటింగ్ చేయాలని అనున్నాను. నా భర్త పనిలో బిజీగా ఉండటమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా నన్ను పట్టించుకోడు.


ఇది కూడా చదవండి: పీరియడ్స్ ఆలస్యం కావడానికి మాత్రలకు గుడ్ బై చెప్పండి.. ఈ సహజ పద్ధతులను ప్రయత్నించండి..


“బహుశా నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలి లేదా ఈ వివాహాన్ని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేయాలి. కానీ నేను ఇప్పుడు చాలా ఆందోళన చెందుతున్నాను, తదుపరిసారి ఈ అంశంపై నాతో మాట్లాడినప్పుడు నా కుమార్తెతో నా వ్యవహారం గురించి నేను ఏమి చెప్పాలి? అని అడిగింది సదరు మహిళ.

నిపుణుల అభిప్రాయం ఏమిటి?
మీ జీవితంలో మీరు ఒంటరిగా ఉన్న దశలో ఉన్నారన్నారు. మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ కుమార్తె ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రస్తుతం మీకు అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఎవరితోనైనా అక్రమ సంబంధం కలిగి ఉన్నారని మీ కుమార్తె అనుమానిస్తున్నందుకు ఈ పరిస్థితిలో మీరు ఆమెకు అబద్ధం చెబితే అది మీ సంబంధాన్ని మరింత నాశనం చేస్తుంది. మీ అబద్ధాలు ఆమెకు మీపై నమ్మకాన్ని మరింత తగ్గించేలా చేస్తాయి. ఆమె చాలా కోపంగా ఉంటుంది. తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పినప్పుడు, పిల్లలు వారిని గౌరవించడం చాలా కష్టం.

నా సలహా ఏమిటంటే మీరు మీ కుమార్తెకు ప్రతిదీ నిజం చెప్పండి. మీరు ఎవరితోనైనా అక్రమ సంబంధం కలిగి ఉన్నారని మీ కుమార్తెకు చెప్పాలి కానీ మొత్తం సమాచారాన్ని పంచుకోవద్దు. మీ అఫైర్‌పై మీ కుమార్తె మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేయడం ,ఆమెకు నిజం చెప్పడం ముఖ్యం.

ఇది కూడా చదవండి: నా క్యూట్‌నెస్‌కి ఇదే కారణం... కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి డైట్ ప్లాన్‌ని షేర్ చేసింది...


కూతురికి నిజం చెప్పేటప్పుడు దాన్ని రహస్యంగా ఉంచమని అడగవద్దు. ఇది ఆమెను చాలా కష్టమైన స్థితిలో ఉంచుతుంది. దీని గురించి ఆమె మదిలో చాలా రకాల ప్రశ్నలు రావచ్చు, కానీ ఎవరికీ చెప్పలేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురికావలసి వస్తుంది. అలాగే, మీ ఇంటి వాతావరణం కాస్త మెరుగ్గా ఉండేలా మీ భర్తకు కూడా దీని గురించి చెప్పండి. మీరు మీ కుటుంబంతో ఏదైనా పంచుకున్నప్పుడు, దాని పరిష్కారం కూడా బయటకు వస్తుంది. ఇంటి ఉద్రిక్తత కూడా తగ్గుతుంది.

అయితే ఇదంతా మీ భర్తకు చెప్పాక మీరు చాలా ఎమోషనల్ రియాక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీకు వేరే ఆప్షన్ లేదు. మీ ఎఫైర్ గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే, మీ సంబంధానికి సంబంధించి తదుపరి ఏమి చేయాలో మీరిద్దరూ కూడా నిర్ణయించుకోవచ్చు. మీరు జంటల కౌన్సెలింగ్ కోసం కూడా వెళ్ళవచ్చు. ఇవన్నీ అంత సులభం కానప్పటికీ మీరు ఈ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

మరోవైపు, మీరు మీ కుమార్తె గురించి మాట్లాడితే మీ వ్యవహారం గురించి విని ఆమె ఖచ్చితంగా కోపంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ గురించి మాత్రమే మాట్లాడకండి, ఆమె వెర్షన్ కూడా వినండి. వీటన్నింటికీ మీరు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పవచ్చు. మీరు కౌన్సెలింగ్ కోసం మీ కుమార్తెను కూడా తీసుకువెళ్లొచ్చు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Renuka Godugu
First published:

Tags: Extra marital affair, Relationship

తదుపరి వార్తలు