Sexual Wellness : నా వక్షోజాలు చిన్నగా ఉన్నాయి...నా భర్తకు సుఖం దక్కట్లేదా...

Sexual Wellness : నా వక్షోజాలు చిన్నగా ఉన్నాయి...నా భర్తకు సుఖం దక్కట్లేదా...

(ప్రతీకాత్మక చిత్రం)

మీ సమస్య కొత్తదేమీ కాదు. అందరి మహిళల్లోనూ ఉన్నదే. వక్షోజాలకు, మీ సంసార సుఖానికి ఎలాంటి సంబంధం లేదు. హార్మోన్ల ప్రభావం వల్లన కొందరిలో ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ వక్షోజాలు కనిపిస్తాయి. అయితే వక్షోజాలు చిన్నగా ఉన్నాయనే ఆత్మన్యూనత భావానికి లోనుకావద్దు.

  • Share this:
    ప్రశ్న:  నా పేరు మోనిత ( పేరు మార్చాం) వయస్సు 24 సంవత్సరాలు. నాకు ఏడాది క్రితమే పెళ్లి అయ్యింది. నేను ఒక విచిత్ర సమస్యతో బాధపడుతున్నాను. నా వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మా వారికి నాతో సెక్స్ చేసిన సమయంలో పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోతున్నాను అనే, అసంతృప్తి నన్ను వెంటాడుతోంది. అంతేకాదు నేను హోటల్ ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. నా వక్షోజాలు చిన్నగా ఉన్న కారణంగా నేను అంత ఆకర్షణీయంగా కనబడటం లేదు. ఏం చేయాలో తెలియక లోలోపల మదన పడుతున్నాను. మీరే పరిష్కారం చూపండి. 

    జవాబు: మీ సమస్య కొత్తదేమీ కాదు. అందరి మహిళల్లోనూ ఉన్నదే. వక్షోజాలకు, మీ సంసార సుఖానికి ఎలాంటి సంబంధం లేదు. హార్మోన్ల ప్రభావం వల్లన కొందరిలో ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ వక్షోజాలు కనిపిస్తాయి. అయితే వక్షోజాలు చిన్నగా ఉన్నాయనే ఆత్మన్యూనత భావానికి లోనుకావద్దు. మీ భర్త అభ్యంతరం పెట్టడం లేదు కనుక ఆయనకు కావాల్సిన సుఖం అందుతున్నట్లే. మీరు అనవసరంగా కంగారు పడవద్దు. ఇక వక్షోజాల సైజు విషయానికి వస్తే ఒక్కొక్కరిలో ఒక్కోలా వాటి తీరు ఉంటుంది. కొందరిలో పిల్లలు పుట్టిన తర్వాత లాక్టేషన్ సమయంలో వాటి పరిమాణం పెరుగుతుంది. అయితే సరైన పోషకాహారం తీసుకొని, కొన్ని రకాల ఎక్సర్ సైజులు చేయడం వల్ల కూడా వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. ఇక వక్షోజాలకు శృంగారానికి సంబంధం లేదు.

    కొంతమంది వక్షోజాల పెరుగుదల కోసం సిలికాన్ ఇంప్లాంట్స్ వాడుతుంటారు. కానీ అలాంటి పద్ధతులు అవలంబించడం వల్ల మీ ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు మార్కెట్లో లభించే టాబ్లెట్స్, అలాగే లేపనాలు కూడా అంత మంచివి కావు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక మీ సంసారాన్ని హాయిగా గడిపేందుకు ప్రయత్నం చేయండి.
    Published by:Krishna Adithya
    First published: